కొన్ని రోజుల క్రితం మా ఇంటికి తెలిసిన వాళ్ళు ( ఫ్రెండ్స్) వచ్చి వెళ్లారు.
వాళ్ళ 6 సంవత్సరాల అబ్బాయికి కిడ్నీ వ్యాధి వచ్చింది. మా ఊరిలో వైద్యుల వద్ద చూపించుకోవటానికి వచ్చారు.
అంత చిన్న బాబుకు కిడ్నీ వ్యాధి రావటం ఏమిటో ? చాలా బాధనిపించింది.
రక్త పరీక్ష చేయించుకునేటప్పుడు బాబు భయంతోనూ, నొప్పితోనూ బాగా ఏడ్చాడని చెబుతుంటే ఎంతో బాధనిపించింది.
పాతకాలంలో కాన్సర్.. వంటి వ్యాధుల గురించి అరుదుగా వినేవాళ్ళం.
ఈ రోజుల్లో ఎందరో చిన్నపిల్లలు కూడా కిడ్నీ, కాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు వింటున్నాం.
ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, రసాయన పురుగుమందులతో పెంచుతున్న ఆహారధాన్యాలు, శుభ్రత కోసం ఇంట్లో విరివిగా వాడే రసాయనాలు భూమిలో, నీటిలో కలవటం ... వంటి అనేక కారణాల వల్ల ...
అభివృద్ధి పేరుతో గాలిని, నీటినీ కలుషితం చేయటం...వంటి అనేక కారణాల వల్ల కిడ్నీ వ్యాధులు, కాన్సర్లు, లివర్ పాడవటం..వంటి అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు.
ఎంతసేపూ టెక్నాలజీ పెరగటం గురించి, డబ్బు సంపాదించటం గురించి, ఇతరగ్రహాలపైకి వెళ్ళటం ..వంటి విషయాల గురించి తాపత్రయపడుతున్నారే గానీ , సమాజంలో పెరుగుతున్న వ్యాధుల విజృంభణ, పర్యావరణ కాలుష్యం వల్ల కలుగుతున్న విపరీతమైన వాతావరణ మార్పులు వంటి సమస్యల గురించి పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
పర్యావరణ పరిరక్షణ గురించి అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు జరిపి చర్చించుకోవటంతోనే సరిపెట్టుకుంటే తరువాత చింతించవలసి వస్తుంది.
ఈ సమస్యలను అశ్రద్ధ చేస్తే జీవుల మనుగడకే ప్రమాదం కదా!

No comments:
Post a Comment