ఈ మధ్యకాలంలో ..కిడ్నీ, లివర్..వంటి వ్యాధుల వలన అవయవాలు పాడయ్యి, మందులపై ఆధారపడి జీవచ్చవంలా బ్రతుకుతున్నవారు ఎందరో ఉన్నారు.
ఎందరో వ్యాధిగ్రస్తులు అవయవ దాతల కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, అవయవదానం పట్ల కొందరిలో కొన్ని అపోహలున్నాయి. ఈ అపోహలు అవసరం లేదు.
వ్యక్తుల మరణానంతరం వారి అవయవాలను ఇతరులకు అమర్చటం వల్ల ఎందరికో ఉపయోగం కలుగుతుంది.
దధీచి మహర్షి లోకకల్యాణం కొరకు తన శరీరాన్ని దానం చేసారని గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
మనుషులు మరణానంతరం తమ అవయవాలను దానం చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది.
పశుపక్ష్యాదులశరీరాలు మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడతాయి.
మనుషుల శరీరం మరణానంతరం ఎందుకూ పనికిరాదని కొందరు భావిస్తారు.
అయితే మనుషులు కూడా అవయవదానం చేయటం ద్వారా ... మరణానంతరం కూడా ఇతరులకు సహాయాన్ని అందించవచ్చు.
...............
ప్రపంచంలో ..కళ్లు లేనివారు, వికలాంగులు ఎందరో ఉన్నారు.
ఆధునిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని చెపుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలకు ఏమైనా పరిష్కారం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో ..కిడ్నీ, లివర్..వంటి వ్యాధుల వలన అవయవాలు పాడయ్యి, మందులపై ఆధారపడి జీవచ్చవంలా బ్రతుకుతున్నవారు కూడా ఎందరో ఉన్నారు.
ఇలాంటి వ్యాధిగ్రస్తులు ...ఇతరుల నుంచి అవయవదానం కోసం ఎదురుచూసే అవసరం లేకుండా .... శాస్త్రవేత్తలు శరీరావయవాలను పోలిన యంత్రాలను తయారుచేస్తే బాగుంటుందనిపిస్తుంది.
అయితే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.
కిడ్నీ పాడయిన వారికి కిడ్నీలా పనిచేసే చిన్న యంత్రం తయారుచేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయని ఈ మధ్యనే వార్తలు వచ్చాయి.
ఇలాంటి యంత్రాలు తయారుచేస్తే కిడ్నీదాతల కోసం ఎదురుచూస్తున్న ఎందరో రోగులకు ఉపశమనం కలుగుతుంది. అవయవదాతల కొరకు ఎదురు చూసే అవసరం ఉండదు.
( ఆధునిక టెక్నాలజీని ఇలాంటి ఉపయోగకరమైన విషయాల కొరకు ఉపయోగిస్తే ఎంతో మంచిది...... ఇలాంటివి కనిపెట్టే వారు ఎంతో గొప్పవారు.)
....................
అయితే, ఎంతయినా సహజమైన అవయవమే గొప్పది. తెచ్చిపెట్టుకున్నవి సహజమైన అవయవాల వలె ఉండవు.
తెచ్చిపెట్టుకున్న అవయవాలతో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
అయితే , అనారోగ్యం వల్ల అవయవాలు పాడై.. ఇక వేరే దారిలేనప్పుడు తెచ్చిపెట్టుకున్న అవయవాలు అవసరమే.
అందువల్ల..ఎవరైనా అనారోగ్యం రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం.
ఆరోగ్యమే మహా భాగ్యమని పెద్దలు తెలియజేసారు కదా!

దధీచి మహర్షి తమ శరీరాన్ని లోకహితం కొరకు సమర్పించారు. ఇది కూడా శాస్త్రాలలోని విషయమే.
ReplyDeleteనాకు ఏమనిపిస్తుందంటే, మరణించినవారి శరీరం నుంచి అవయవాలను తీయటం శాస్త్రప్రకారం తప్పు అంటారు.మామూలుగా అలా అవయవాలను తీయకూడదు.
అయితే, మరణించిన వారిశరీరం నుండి..సమాజహితం కొరకు, ఇతరుల మంచికొరకు.. అవయవదానం చేయటంలో తప్పులేదని అనిపిస్తుంది.
....
ఇంకొక విషయం ఏమిటంటే..నిమిమహారాజు సంతానాన్ని విదేహులు అంటారు.ఆ పద్ధతి కూడా చిత్రమైన విధానమే.
Monday, July 14, 2014
తండ్రి అయిన నిమి శరీరం నుంచి పుట్టిన మిధి ( జనకుడు ) ...
ReplyDeleteకొన్ని విషయాలు..దివిసీమ ఉప్పెన సమయంలో కొట్టుకొచ్చిన శవాలకు ఒంటిపైన బంగారపునగలు ఉంటే, వాటిని తీసుకోవటానికి కొందరు దొంగలు ఆ శవాల శరీరాన్ని ముక్కలు చేసారని వార్తలు వచ్చాయి. అంటే శరీరాలు నీటిలో ఉబ్బటం వల్ల బంగారునగలు తీయటం కుదరక అలా చేసారట.
నూతులలో, చెరువుల్లో పడి మరణించిన వారి దగ్గరనుండి బంగారునగలు తీయటానికి కూడా కొందరు అలా శరీరాన్ని కట్ చేస్తారు. బంగారం తీయటం తప్పనిసరి అయితే నగను కొయ్యాలి కానీ, శరీరావయవాలను ముక్కలు చేయకూడదు.