కూడలి తాత్కాలికంగానైనా మూతబడటం చాలా బాధను కలిగిస్తోంది. నేను బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టినప్పటి కొత్తలో కూడలి ద్వారానే అందరికీ మొదట పరిచయమయింది.
అగ్రిగేటర్ల వల్ల మా బ్లాగులు అందరికీ ఎంతో పరిచయమయ్యాయి. ఇందుకు వారికి ఎన్నో కృతజ్ఞతలు.
అగ్రిగేటర్లు ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా తెలుగు బ్లాగులను ముందుకు తీసుకువెళ్తున్నారని కష్టేఫలే వారి బ్లాగులో చదివాను.
తెలుగు బ్లాగులను ప్రోత్సహిస్తున్న అగ్రిగేటర్లు అందరికి నా కృతజ్ఞతలు.
............
నా బ్లాగ్ వల్ల అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయేమోనని కొంతకాలం క్రిందట నాకు సందేహం కలిగింది.
అంటే.. బ్లాగ్లో కొత్త టపా పోస్ట్ చేసిన తరువాత నాకు కొత్త ఆలోచనలు రావటం, అందువల్ల టపాలో మార్పులు, చేర్పులు చేయటం నాకు అలవాటు.
ఇందువల్ల నేను వేసే టపాను పదేపదే పోస్ట్ చేయటం అనే ఇబ్బంది వల్ల అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో? అనే సందేహం వచ్చి టపాలలో మార్పులు,చేర్పులను చేయటం కొంతవరకూ తగ్గించాను.
అయితే,నాకు కంప్యూటర్స్ వాడకం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇలాంటి విషయాల్లో ఏం చేయాలో నాకు తెలియదు.
నా బ్లాగులోని రాతల వల్లగానీ లేక నా బ్లాగ్ వల్లగానీ అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా బ్లాగును అగ్రిగేటర్ నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను.
..............
కూడలి తిరిగి ప్రారంభమవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
ఇంతకుముందు మూసివేసిన అగ్రిగేటర్లు మరియు బ్లాగులు కూడా తిరిగి ప్రారంభమవ్వాలని కూడా మనసారా కోరుకుంటున్నాను.

Your blog is very interesting.Keep posting.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteకూడలి మూసి వేసారు అని ఎవరు చెప్పారు.
ReplyDeleteకూడలి మొదటి పేజి నే మార్చి మూసి వేసాం అని పెట్టారు
కూడలి మిగిలిన పేజి లు అలాగే ఉన్నాయి.
http://koodali.org/blogs
అందరు ఈ లింక్ క్లిక్ చేస్తే తెలుస్తుంది
కూడలి వారు ఏదో ఒకటి ఆశించి ఇలా చేసినట్టున్నారు
మూసి వేసాం మూసి వేసాం అని ఇలా చేస్తే ఏం ఊహించుకోవాలి