koodali

Monday, January 22, 2024

ఓం..

 ఓం
శ్రీరామమందిరము ప్రారంభమవుతోంది.
సీతారాములకు వందనములు. 


ఈ శుభ సందర్భముగా  అందరికీ శుభాకాంక్షలు.


 శ్రీరామమందిరం కొరకు ఎందరో కలలు కన్నారు. ఎందరో ఎన్నో త్యాగాలు చేసారు. కష్టాలు అనుభవించారు.


దైవం దయవల్ల కల నిజమయ్యింది.

లోకం అంతా సుఖసంతోషాలతో ఉండాలి.

 

4 comments:

  1. రాక్షసులు తపస్సు చేసినా కూడా వారిని చంపలేదు. అలాంటప్పుడు మనుషులు తపస్సు చేస్తే చంపరు కదా..శంభూకుడిని చంపారంటే శంభూకుడు ఎంత చెడ్డవాడో తెలుస్తోంది. అతను వినాశకరమైన రీతిలో వరాలను పొందటానికి తపస్సు చేస్తుండవచ్చు. అందుకే చంపారు.

    చిత్రం ఏమిటంటే, కొందరు రాక్షసప్రవృత్తికలవారు కూడా తపస్సు చేసి.. దేవతలను జయించేలా వరాన్ని ఇమ్మని దేవతలనే అడిగి.. ఆ వరాలతో శక్తిని పొంది దేవతలను బాధించాలని అనుకుంటారు.

    శంభూకుడు తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలని, స్వర్గాన్ని జయించాలని తపస్సు చేస్తున్నట్లు చెప్పటం జరిగిందట. అలాంటప్పుడు చంపక ఏం చేస్తారు? చెడ్డవారు బ్రతికుంటే మరిన్ని పాపాలు చేసి తమ పాపాలను పెంచుకుంటారు..అలాంటి చెడ్డవారిని వధించటం వల్ల ఆ చెడ్డవారికి మంచి జరుగుతుంది..ఇంకా సమాజానికి కూడా మంచి జరుగుతుంది.

    **************
    ఎవ్వరివిషయంలోనైనా వాళ్ళు ఎవరికి జన్మించినా, వారి ప్రవర్తన ముఖ్యం. ప్రహ్లాదుడు రాక్షసవంశంలో జన్మించినా కూడా గొప్పవిష్ణుభక్తులయ్యారు.

    శ్రీరాములవారు తపస్వి అయిన శబరిని, గుహుడుని, విభీషణుడిని ఆదరించారు. పక్షి అయిన జటాయువుకు అంత్యక్రియలను నిర్వహించారు.

    శ్రీరాములవారు రావణాసురుడిని సంహరించారు. రావణుడి తండ్రి బ్రాహ్మణులు, తల్లి రాక్షసస్త్రీ...రావణుడు ఎందరో స్త్రీలను చెరపట్టటం జరిగింది. సీతాదేవిని బాధపెట్టాడు...అలాంటివ్యక్తిని చంపితే తప్పేమీలేదు. చంపకపోతేనే తప్పు.

    ఎంతటివారైనా సరే పాపాలు చేస్తే శిక్షలను పొందినట్లు గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీకృష్ణుని వారసులు కొందరు, మహర్షితో అసత్యంతో కూడిన మాటలు మాట్లాడి శాపాన్ని పొందారు.అయినా శ్రీకృష్ణులవారు వారిని కాపాడలేదు.

    ************
    శ్రీకృష్ణుడు గురుదక్షిణగా తమ గురువుయొక్క పుత్రులను బ్రతికించి తెచ్చారు. పరీక్షిత్తుకు ప్రాణదానం చేసారు. అయితే, అభిమన్యుని కాపాడలేదు. వీటివెనుక ఎన్నో రహస్యాలుంటాయి. ఆ జీవుల గతకర్మలు వంటి ఎన్నో రహస్యాలు కూడా ఉంటాయి. ఏది ఎందుకు జరుగుతుందో..దైవానికి తెలుస్తాయి.

    ReplyDelete
  2. ఇంకో కోణం ఏమిటంటే, ఉత్తరకాండలో కొన్ని భాగాలు ప్రక్షిప్తం కావచ్చని కొందరి అభిప్రాయం. శంభూకునివధ కానీ, ఆ కధలో కొన్ని భాగాలు కానీ ప్రక్షిప్తం కావచ్చు. ప్రక్షిప్తాలు చేసినప్పుడు కొన్ని శ్లోకాలను మార్చి ఆ స్థానంలో వేరే శ్లోకాలను వ్రాసి, అదే సంఖ్యలో శ్లోకాల లెక్క సరిపోయే విధంగా మార్చివ్రాయటం చేసేవారు చేయగలరు.

    ***********
    నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఎవరైనా రాక్షసుడు శంభూకుని రూపంలో వచ్చి తపస్సు చేస్తుండవచ్చు. రాక్షసప్రవృత్తి గలవారికి సమాజం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ గొడవలు, ఇతరులను చంపటం, యుద్ధాలు వంటివి చేయడాన్ని ఇష్టపడతారు.

    శంభూకుడు స్వర్గాన్ని జయించటానికి తపస్సు చేస్తూ మధ్యలో రాజ్యంలో పిల్లల్ని కొందరిని చంపాడేమో? ఇవన్నీ గమనించిన శ్రీ రాములవారు శంభూకుని చంపేసి ఉండవచ్చు. శంభూకుడు రాక్షసుడైనా కావచ్చు, రాక్షసప్రవృత్తి కల మనుషుడైనా కావచ్చు. ఏమో ఏదైనా అయ్యుండవచ్చు.

    వ్రాసినవాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. అజ్ఞాత గారు వ్రాసిన వ్యాఖ్య పొరపాటున డిలిట్ అయ్యింది.

    శంభుకవధ గురించిన విషయాలు పాత పోస్టులో ఉన్నాయి. వాటిని కొంతకాలం ఇక్కడ వేసి, తరువాత డిలిట్ చేసి వాలివధ గురించిన విషయాలను పోస్ట్ చేద్దామనుకున్నాను...చూస్తే అజ్ఞాత కామెంట్ ఉంది.

    కృత్రిమమేధతో కూడిన రోబోట్ల వల్ల భవిష్యత్తులో ఎలా ఉంటుందో?

    రామాయణంలో శంభూక వధ.....న్యాయమా ? కాదా ? అని కొందరు...... Wednesday, January 25, 2012.

    ReplyDelete