గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవరు ? అంటే, ఈ కాలంలో వాళ్లు చాలామంది న్యూటన్ అని చెబుతారు. అయితే, ప్రాచీన భారతీయ గ్రంధాలలో ఈ విషయం గురించి ఉన్నది.
బ్రహ్మగుప్తుడు రచించిన 'బ్రహ్మస్పుఠ సిద్ధాంతం'లో...
" వస్తువులు భూమి వైపు ఆకర్షింపబడతాయి.నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో , అలా భూమికి సహజమైన ఆకర్షణ శక్తి ఉంది.అని చెప్పటం జరిగింది.
జగద్గురువు ఆదిశంకరుల వారు వారి'ప్రశ్నోపనిషత్' భాష్యంలో 'అపాన'శక్తి గురించి రాస్తూ ..
"ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో..అటులనే పైకి లాగబడే 'ప్రాణ'శక్తిని 'అపాన'శక్తి కిందకు లాగుతోంది.(3-8 శ్లో||)అని చెప్పారు.
శ్లో || "తధా పృధివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా
పురుషస్య అపానవృత్తిమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ
అపకర్షేణ అనుగ్రహం కుర్వతీ వర్తత ఇత్యర్ధః |
అన్యధా హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే వోద్గచ్చేత్ ||"
న్యూటన్ కంటే ఎన్నో సంవత్సరాలకు పూర్వమే గురుత్వాకర్షణ గురించి భారతీయ విజ్ఞానం తెలియజేసింది.
......................
ఆధునిక కాలంలో.. సెల్ ఫోన్లు, రేడియోలు, టీవీలు , శాటిలైట్లు, చివరకు బ్లూటూత్ వ్యవస్థలన్నీ వైర్ లెస్ విధానం ఉపయోగించే పనిచేస్తున్నాయి.
ఈ విధమైన తంత్రీరహితమైన (Wireless) ప్రసారపద్ధతిని ముందు కనుగొన్నది భారతీయుడైన సుప్రసిద్ధ శాస్త్రవేత్త ' జగదీశ్ చంద్రబోస్ '.
క్రీ.శ.1896,సెప్టెంబర్21న బోస్ ఇంగ్లండ్ లో రాయల్ ఇన్ స్టిట్యూట్ లో ఒక ప్రదర్శన, ప్రసంగం ఇచ్చారట.
'ఒక యోగి ఆత్మ కధ' పుస్తకంలో భారతీయ శాస్త్రవేత్త అయిన జగదీశ్ చంద్ర బోస్ గారి గురించిన వివరములు ఉన్నాయి.
భారతీయుడైన బోస్ గారి గురించి ఎక్కువమంది భారతీయులకు కూడా తెలియకపోవటం అత్యంత బాధాకరం.
ETERNALLY TALENTED INDIA - 108 FACTS...
భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు.....అనే పుస్తకాన్ని , మాకు తెలిసిన వారు మాకు ఇచ్చారు.
ఈ పుస్తకాన్ని వివేకానంద లైఫ్ స్కిల్స్ అకాడమీ , హైదరాబాద్ వారు సమర్పించారు. ఈ పుస్తకంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి.
ప్రాచీన భారత దేశపు గొప్పదనం గురించి, ఇంకా ఎన్నో విషయాలను సేకరించి , ఈ గ్రంధం ద్వారా అందించారు .
వ్రాసిన విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని కోరుతున్నాను.
మరిన్ని విషయాల కొరకు దయచేసి ఈ లింకుల వద్ద చూడగలరు.

No comments:
Post a Comment