koodali

Wednesday, August 26, 2015

ఓం.. మరికొన్ని విషయములు...


శ్రావణ శుక్రవారం  వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ పూర్ణిమ..హయగ్రీవ జయంతి..ఈ సంవత్సరపు శుభప్రదమైన  అమరనాధ్ యాత్ర  శ్రావణ పౌర్ణమికి  పూర్తవుతుంది..శ్రావణ శనివారం శనిదేవుని పూజ..శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉంటాయి.
.............................
 
ఈ క్రింద విషయములు ఈ పోస్ట్ వేసిన చాలాకాలానికి వ్రాసి, ఇక్కడ వేయటం జరిగింది.
 
దక్షిణాచారము, కౌలాచారము..అని రెండు విధాలుంటాయంటారు.

 దక్షిణాచారము అంటే, శ్లోకాలు, మంత్రాలను నేర్చుకుని కొన్ని నియమాలు, పద్ధతులతో దైవాన్ని సాత్వికపద్ధతులతో ఆరాధించటం. కౌలాచారము..అంటే చాలా విషయాలను చెబుతారు.అవన్నీ ఎలాఉన్నా,

నాకు ఏమనిపించిందంటే, శ్లోకములు, మంత్రములు సరిగ్గా తెలియనప్పుడు, కొన్ని సామాన్యనియమాలను పాటిస్తూ..ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ..భక్తితో దైవాన్ని ఆరాధించుకునేవారికి దైవానుగ్రహము లభించే అవకాశముంది.

 నియమాలతో శ్లోకములు, మంత్రములు నేర్చుకుని, అనేకనియమాలను పాటిస్తూ..ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ..భక్తితో దైవాన్ని  ఆరాధించేవారికి దైవానుగ్రహాన్ని పొందే అవకాశం ఉంది.

ఇలా రెండు విధములుగాను ఆరాధించే వారికి దైవానుగ్రహం లభించే అవకాశముందనిపించింది.
.............................
ఒకప్పుడు వ్యాసమహర్షికి వారి బృందానికి కాశీలో అమ్మవారు ఎన్నో పదార్ధాలతో ఆహారాన్ని అనుగ్రహించారని తెలుస్తుంది. 
 
ఒకప్పుడు కొన్నికారణాల వల్ల లోకంలో కరువుకాటకాలు వచ్చి అందరూ దైవాన్ని ప్రార్ధించగా..అమ్మవారు వారికి ఎన్నో శాకములను ఇచ్చారని  తెలుస్తుంది. 
 ...........................
నరకాసురుడు, రావణాసురుడు..దైవము చేత చంపబడ్దారు. ఎవరైనా కూడా జీవులను హింసించటం సరైనది కాదు.
..................................
వ్రాసిన విషయములలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


No comments:

Post a Comment