koodali

Friday, November 4, 2016

ఈ రోజుల్లో ఆరోగ్యం అని గానుగనూనెలు.. మరికొన్ని విషయములు..అనారోగ్యాలకు అనేక కారణాలు..

 
 
 
ఈ రోజుల్లో ఆరోగ్యం అని గానుగనూనెలు వాడటం మొదలెట్టారు.. పాతకాలంలో యంత్రాలు లేనికాలంలో పశువులసాయంతో గానుగ తో నూనెలు తీసేవారు. గానుగ తిప్పటానికి పశువులు చాలాసేపు తిరగవలసి వస్తుంది. మనిషి కూడా చెక్కపైన కూర్చుని అప్పుడప్పుడు పశువులను కొడుతుంటాడు. 
 
 
యంత్రాలు లేని కాలంలో అలా తీయటం సరే కానీ, ఇప్పుడు యంత్రాలు ఉన్నరోజుల్లో కూడా పశువులను కష్టపెడుతూ అలా నూనెలు తీయటం ఎంతవరకు సరైనది? 
 
 
నూనె వేడెక్కకుండా యంత్రాలతో నూనెను తీయవచ్చు. అంటే, వెట్ గ్రైండెర్ తో పప్పును రుబ్బడానికి రుబ్బురాయిని యంత్రం సాయంతో తిప్పినట్లుగా..చెక్కగానుగను యంత్రంతో తిప్పుతూ నూనెను తీసే విధానం కూడా ఉంది. అలా చక్కగా గానుగ నూనెను తీసి వాడుకోవచ్చు.

మనుషులు అంతా పొల్యూషన్ చేస్తూ ఇంకా ఆరోగ్యం పేరుతో పశువులను కష్టపెట్టటం సరైనది కాదు.

***********
మరికొన్ని విషయములు..
 అనారోగ్యాలకు అనేక కారణాలు..
..........


ఈమధ్య B12 గురించి చాలామంది చాలా విధాలుగా చెబుతున్నారు.B 12  శరీరంలో లోపిస్తే చాలా జబ్బులు వస్తాయని, B12 లభించాలంటే మాంసాహారం తినటం వల్లనే లభిస్తుందన్నట్లు చెబుతున్నారు.

అనారోగ్యాలకు ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ వదిలి, కేవలం మాంసాహారం తినకపోవటం వల్లే B12 రోగాలు వస్తున్నాయన్నట్లు కొందరు చెబుతున్నారు.

 గమనించవలసిన విషయం ఏమిటంటే, మాంసాహారం బాగా తినే చాలామందిలో కూడా B12 లోపం ఉంటోంది. శాకాహారం తినే చాలామంది ఆరోగ్యంగా చక్కగా ఉండటం కూడా చూస్తున్నాము.

 కొందరు విదేశాల వాళ్ళు కొన్ని కూరగాయలు, కొన్ని చిక్కుడురకాలు, మాంసాహారాన్ని ఎక్కువగా తింటారు.వాళ్ళు ఎక్కువ పప్పుధాన్యాలను వాడరు.

 భారతదేశం వాతావరణం వల్ల చాలా పంటలు పండుతాయి. 
భారతదేశంలో ఎన్నోరకాల పంటలు పప్పుధాన్యాలు పండించి తింటారు. మనకు ప్రొటీన్స్ చక్కగా లభిస్తాయి. 

అయితే, ఇప్పుడు కొందరు   
పప్పుధాన్యాల ద్వారా ప్రొటీన్స్ సరిపోవని, మాంసాహారం తప్పక తినాలన్నట్లు చెబుతున్నారు. పాతకాలంలో చాలామంది మాంసాహారులు కూడా ఇప్పటిలా రోజూ మాంసాహారాన్ని తినేవారు కాదు. కొన్నిసార్లు మాత్రమే తినేవారు. కాయకష్టం చేసినా కూడా, ఆరోగ్యంగా ఉండేవారు. 

మరి, చాలామంది మాంసాహారులలో కూడా బి12 లోపం ఎందుకు ఉంటోంది? అనేదానికి ఏవేవో కారణాలు చెబుతారు.

 ఈ రోజుల్లో అనారోగ్యాలకు అనేక కారణాలున్నాయి. పాతకాలంలో స్త్రీలు, పురుషులు రోజులో కొంతసేపయినా ఎండలో గడిపేవారు. స్త్రీలు ఆరుబయట పెరట్లో గిన్నెలుకడగటం, దుస్తులు ఉతకటం, పెరట్లో పనులు..చేసేవారు. వారికి ఎండ తగిలి డి విటమిన్ చక్కగా లభించేది.

భారతదేశంలో డి విటమిన్ కొరకు ఎండ చక్కగా ఉంటుంది. మనదేశంలో ఎండ ఉన్నా కూడా, చాలామందిలో డి విటమిన్ లోపం ఉంటోంది.  

ఇప్పుడు అన్నీ ఇంట్లోనే వాషింగ్ మెషిన్, వంటగదిలో సింక్..అపార్ట్మెంట్ కల్చర్ వల్ల ఎండ తగలదు, సరిగ్గా నడవటం కూడా లేదు. స్త్రీలు ఇంట్లో, పురుషులు ఆఫీసుల్లో.. ఆ కొద్దిస్థలంలోనే ఉంటారు.
 
సూర్యరశ్మిలో ఎంతో శక్తి ఉంటుంది, సూర్యుడు ఆరోగ్యప్రదాత అంటారు. సూర్యరశ్మిలో డి విటమిన్ తో పాటు మరెన్నో విటమిన్లు కూడా ఉంటాయనిపిస్తుంది.
 
 మట్టినేలమీద నడవటం, కష్టపడి పనిచేయటం..వంటివి చేస్తే ఆరోగ్యం. 
 
ఈ రోజుల్లో వాతావరణ పొల్యూషన్ కూడా ఉంది.

టెన్షన్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయంటారు. ఈ రోజుల్లో టెన్షన్లు లేనివాళ్లు ఎవరు?
........................................
అనేకకారణాలతో చాలామంది హైదరాబాద్ వంటి నగరాలకు వస్తున్నారు. అయితే, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నీరు హార్డ్ గా ఫ్లోరైడ్ నీరులా ఉంటుంది. ఈ నీరు తాగితే కిడ్నీసమస్యలు వచ్చే అవకాశముంది.
 
 తాగేనీరు బాటిల్లో కొనుక్కుని తాగినా కూడా, వంటకు కూరలు కడగటానికి పంపులో నీరు వాడితే ఆ నీరు కొంతయినా కడుపులోకి వెళ్ళే అవకాశముంటుంది. స్టీల్ పాత్రలు కడిగి బోర్లించకుండా అలాగే ఉంచితే ప్లేటులో నీరు ఉన్నచోట తెల్లగా ఏర్పడటం గమనించవచ్చు.

 
 సిటీల్లో కిక్కిరిసి జనాలు వచ్చి నీటిని తోడటం వల్ల కూడా నీటిసమస్యలు, కాలుష్యము ఎక్కువవుతాయి. ఉపాధి అవకాశాలు ఎక్కడికక్కడ నగరాల్లో, పల్లెల్లో కూడా ఉంటే, అందరూ నగరాలకు వలసరారు. 
 
యువత చాలామంది చదువు కొరకు, ఉపాధి కొరకు  సిటీలకు వచ్చి హాస్టల్స్లోను, వేరే గదుల్లోను ఉంటారు. బయట తింటారు. ఆ ఆహారం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అలా కూడా అనారోగ్యం వచ్చే అవకాశముంది. 

 పంటలు పండటానికి వేసే పురుగుమందులు , గిన్నెలు, ఇంటిని శుభ్రం చేయటానికి వాడే రసాయనాలు  హాని కలిగించేవి ఉంటాయి. 

 అందరికి సెల్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ముందు కూర్చుని సెల్ఫోన్లను అదేపనిగా చేత్తో నొక్కుతూ మార్చటం వల్ల, నరాల జబ్బులు, కళ్లజబ్బులు, మెడనొప్పులు వస్తున్నాయి. 
 
ఇక,  బి 12 లోపం అని చెప్పి, మాంసాహారాన్ని మరింత తినాలని చెబుతారు. అవన్నీ తిని కొవ్వు పెరిగి గుండె జబ్బులొస్తాయి.  
 
ప్రోటిన్ అదేపనిగా తింటే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందట. 
 
........................
 
కొందరు ఇంగ్లిష్ (అల్లోపతి) వైద్యులు ఆయుర్వేదాన్ని, హోమియోని నమ్మరు. అవేం పనిచేస్తాయని తక్కువగా మాట్లాడతారు. కాని, అవి వాడినవారికి అవి ఎంత బాగా పనిచేస్తాయో తెలుసు. కొందరు తమకు తెలిసింది, తాము చదువుకున్నది మాత్రమే కరెక్ట్ అనుకుంటారు.

కొందరు తాము మాంసాహారం తినకుంటే బలహీనులమైపోతామని భయపడతారు. ఆ భయం వల్ల వాళ్లకు బలహీనంగా అనిపిస్తుంది. అది మానసికబలహీనత. . ఇక, మాంసాహారాన్ని అమ్మే వాళ్ళకు, మందులను అమ్మే షాపుల వాళ్ళకు  మాంసాహార ప్రచారం వల్ల లాభమే కదా..

 జనాలు తాము ప్రాణమున్న జీవులను చంపి ఆ మాంసాన్ని తింటున్నాము అనేవిషయాన్ని మర్చిపోతున్నారా ఏమిటి? ఇతరజీవుల ప్రాణాన్ని తీసి తినటం వీళ్ళ హక్కులా.. మాంసాహారాన్ని తినండి.. అని  అలా
ఎలా తేలికగా చెప్పేస్తున్నారు?
 
 ఆ మూగజీవులు బలవంతులైన మనుషుల్ని ఎదుర్కోలేక భయంతో, నొప్పితో నిస్సహాయంగా చూస్తూ మరణిస్తాయి. ఈ మనుషులకు ఒక వేలు తెగితే భరించగలరా?
...................
 
పాతకాలంలో చాలామంది ఇళ్లలో చాలా ఆవులు ఉండేవి. వాటిని ఆరుబయట పచ్చిక మేపుతూ అవి ముసలివి అయినాకూడా వాటిని చక్కగా చూసుకునేవారు. ఒక్కో ఆవు వద్ద పావులీటరు పాలు తీసుకుంటే, నాలుగు ఆవుల వద్ద లీటర్ అయి ఒకకుటుంబానికి సరిపోతాయి.

ఆవుపాలు దూడకోసమే కాబట్టి, దూడకు సరిపడా పాలు తప్పక ఉంచాలి. దూడకు సరిపోకుంటే ఆ పాలను మనుషులు పిండకూడదు. కొందరు ఏమంటున్నారంటే, ఆవుపాలు మనుషులు వాడకుంటే ఎక్కువ మిగిలిపోతాయి, అందువల్ల మనుషులు పిండాలి అంటారు.. 
 
అడవిలో కూడా గేదెలు, ఆవులు ఉంటాయి. మరి అడవుల్లోకి వెళ్లి ఎవరూ వాటి పాలు తీయకపోయినా, అవి బాగానే జీవిస్తున్నాయి. మనుషులు వాటి పాలు తాము వాడటం కోసం తోచినట్లు మాటలు చెబుతారు.(బహుశా మనుషుల వద్ద పెరిగే జంతువుల లక్షణాలు కొన్ని మారాయేమో?)


ఈ రోజుల్లో కొందరు ఇరుకు ప్రదేశాల్లో ఆవులను, గేదెలను పెంచుతూ వాటి దూడలను చంపి పాల వ్యాపారం చేస్తున్నారు. ఇవేవీ పట్టకుండా  కొందరు , ఆ పాలతో చేసిన స్వీట్లను , పన్నీరును.. అదేపనిగా తింటున్నారు.
............................

చాలామంది విదేశీయులు మాంసాహారాన్ని మాని శాకాహారానికి వచ్చినవారు ఎందరో ఉన్నారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉండి బలంగా ఉన్నామని చెబుతున్నారు.. వారిలో కొందరు వీగన్ గా మారి పాలు, నెయ్యి వంటివి తీసుకోకుండా కూడా ఉంటున్నారు. ఈ రోజుల్లో పాలు, నెయ్యి, మాంసాహారం హార్మోన్ల దోషం వల్ల జబ్బులొస్తున్నాయని వాళ్ళు మాంసాన్ని మానివేస్తున్నారు.

ఉదా..Dr. Caldwell Esseltyns,

Dr. Brook Goldner..

ఒక వైద్యురాలు తనకు వచ్చిన వ్యాధిని ఈ పద్ధతిలో తగ్గించుకోవటం జరిగిందట.

వీరి గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో చూడవచ్చు.

ఒక విదేశీ డాక్టర్ గారు పెద్ద అనారోగ్యం బారిన పడగా.. మాంసాహారాన్ని, పాలు,పాల ఉత్పత్తులను కూడా మాని.. ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో చేర్చుకుని అనారోగ్యాన్ని తగ్గించుకుని, అనారోగ్యంగా ఉన్న ఇతరులకు కూడా ఈవిధానం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నారట.

మాంసాహారం, పాలు, నెయ్యి తినకుండా కూడా బలంగా ఉండవచ్చు. ఈ మధ్య చాలామంది మాంసాహారాన్ని, పాలను కూడా మాని వీగన్లుగా మారి చక్కగా బలంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు.

 మాంసాహారం తినటం వల్ల అనారోగ్యం కలిగి,  శాకాహారులుగా మారిన వారు చాలామందే ఉన్నారు.  మైక్ టైసన్ వంటివారు కూడా ఇలా మారారట.

 ఆ మధ్య..THE GAME CHANGERS..అనే డాక్యుమెంటరీ వచ్చింది. అందులో చాలామంది గురించి ఎన్నో విషయాలను తెలియజేసారు. చాలామంది తాము శాకాహారులుగా మారిన తరువాత మరింత శక్తివంతగా ఉన్నట్లు తెలియజేసారు.

సాత్విక్ మూవ్మెంట్ వారు .. ఇండియాలో శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నారు.

.........................

అనారోగ్యం కలగటానికి ఎన్నో కారణాలున్నాయి. అవన్నీ పట్టించుకోకుండా, మాంసాహారం తింటే చాలు అనారోగ్యసమస్యలు అన్నీ సర్దుకుంటాయన్నట్లు చెప్పటం సరైనది కాదు. సమాజంలో సమూలంగా ఎన్నో మార్పులుచేర్పులు జరిగితేనే సమస్యలు తగ్గుతాయి.


No comments:

Post a Comment