ఈ టపాను కొన్ని సంవత్సరాల క్రిందట వ్రాసాను.
శంకరాచార్యుల వారి గురించి ఒకరు వ్రాసిన విషయాలను చదివి ..వారు శంకరాచార్యులను విమర్శించారని అభిప్రాయపడి ఈ టపా వ్రాసాను.
...........
Thursday, December 13, 2012
శంకరాచార్యుల వారికి స్త్రీలంటే ఎంతో గౌరవం .....
* ఆదిశంకరాచార్యుల వారి ప్రశ్నోత్తర రత్న మాలికలోని కొన్ని విషయాలను గురించి, కొందరు ఏమనుకుంటారంటే, శంకరాచార్యుల వారికి స్త్రీలంటే చిన్నచూపు ఉన్నదేమో ? అని అపోహపడతారు.
*ఈ విషయాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తెలిసినంతలో , నా అభిప్రాయాలను వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను.
* ఆదిపరాశక్తిని ఎంతగానో ఆరాధించిన శంకరాచార్యులవారికి స్త్రీలంటే చిన్నచూపు ఉండదు.
* ఆదిశంకరాచార్యుల వారు శిష్యులకు బోధించినది ఈ “ ప్రశ్నోత్తరీ మణిరత్నమాల ” అనుకుంటున్నాను.
* ప్రశ్నోత్తర రత్న మాలికలోని ఈ విషయాలను గమనించితే, శంకరులవారికి స్త్రీలంటే చిన్నచూపు ఎంతమాత్రం లేదని తెలుస్తుంది.
* Who is the friend for a family man ?
a. His wife.
* Who is God whom we can see ?
a. Mother.
* Who is the teacher fit to be worshipped ?
a. Father.
* Who is a brahmachari ( unmarrieD lad doing austerities ) ?
a. He avoids contact with women and is safe from such contacts.
* తల్లిని కనిపించే దైవంగా , భర్తకు జీవితంలో స్నేహితురాలిగా భార్యను చెప్పటం బాగుంది.
* వారు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పినది వివాహం కాని బ్రహ్మచారులు, ..వంటి కొందరిని ఉద్దేశించి చెప్పారని అనిపిస్తున్నది.
.......................
* పై విషయాలను గురించి, నాకు తోచిన అభిప్రాయాలను క్లుప్తంగా చెప్పుకోవాలంటే,,
* వివాహం కాని బ్రహ్మచారులైన పురుషులు , స్త్రీలకు తగుమాత్రం దూరంగా ఉండాలి. లేకపోతే.........వారి విద్యాభ్యాసం కుంటుపడి, వారి భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదముంది.
* తపస్వులైన పురుషులు స్త్రీలకు తగుమాత్రం దూరంగా ఉండాలి. లేకపోతే......వారి తపస్సుకు భంగం కలిగి , అప్పటివరకు సంపాదించుకున్న తపశ్శక్తిని కోల్పోవలసివస్తుంది. అప్పుడు తపస్సు ద్వారా వారు పొందాలనుకున్న ప్రయోజనాలు నెరవేరవు కదా !
*( గృహస్తుల వంటి వారు కూడా కోరికలను సిద్దింపజేసుకోవటానికి , కొన్నిసార్లు తపస్సులు చేస్తుంటారు....ఇలాంటివారు కూడా దీక్షా సమయంలో స్త్రీలకు కొంతవరకు దూరంగా ఉండాలి. అయితే, దీక్షావిధికి సంబంధించిన సహాయం, ఆహారాన్ని తయారుచేసి అందించటం, అనారోగ్యం కలుగకుండా చూసుకోవటం..మొదలైన సేవల విషయంలో భార్య సహాయాన్ని పొందవచ్చు అనుకుంటున్నాను...)
..................................
* శంకరాచార్యుల వారు, తల్లి మరణించిన సందర్భంలో, తానే వచ్చి అంత్యక్రియలు నిర్వహించారని విన్నాను. సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తి తన తల్లికి అంత్యక్రియలు చేయకూడదని అప్పటి వారు కొందరు అన్నారట.
*అయితే,,సన్యాసస్వీకారం అప్పుడు గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారని అంతర్జాలంలో వ్రాసారండి. . అలా ఇచ్చినమాట ప్రకారం వారు తల్లి పట్ల తన బాధ్యతను నిర్వర్తించారనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే, తల్లి అంటే వారికి ఎంతో గౌరవం అని మనం తెలుసుకోవచ్చు.
* ఒక సారి ఆదిశంకరాచార్యుల వారు భిక్షకు వెళ్ళినప్పుడు , పేదరాలైన ఒక స్త్రీ భిక్ష వేయటానికి ఇంట్లో ఏమీ లేక, ఒక ఉసిరికాయను భిక్షగా సమర్పించగా , ఆ ఇల్లాలి పరిస్థితికి జాలి కలిగి అప్పటికప్పుడు కనకధారా స్తోత్రాన్ని పఠించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది బంగారు ఉసిరి పండ్ల వాననే కురిపించారంటారు.
* ఇవన్నీ గమనిస్తే వారికి స్త్రీలంటే గొప్ప గౌరవం అని తెలుస్తుంది.
....................................
* పూర్వం కొందరు తపస్వులు, మహర్షులు స్త్రీ విషయంలో పొరపాట్లు చేసి, అప్పటివరకూ కష్టపడి సాధించిన ఎంతో తపశ్శక్తిని పోగొట్టుకున్నారు. ఉదా....విశ్వామిత్రుల వారు.
* తపస్వులు తపస్సులు చేసేటప్పుడు ఎంతో నిగ్రహంగా ఉండాలి. ఇంద్రుడు వంటివారు తపస్వుల నిగ్రహాన్ని పరీక్షించటానికి అప్సరసలను పంపటం వంటి ఎన్నో పరీక్షలను పెడతారు. ఈ పరీక్షలో నెగ్గినవారికే తపోఫలం లభిస్తుంది.
* ఇక గృహస్తుల విషయంలో , వివాహమైన పురుషుడు ధర్మపత్నితో సంసారాన్ని సాగించటం వరకూ ఎవరూ అభ్యంతరం చెప్పరు. . భార్యాభర్తలు అర్ధనారీశ్వరులన్నారు కదా ! పెద్దలు.
* అయితే, ఒక సంసారాన్ని నిర్వహించాలంటేనే కొన్ని కష్టాలుంటాయి. ఇక ఎక్కువమంది స్త్రీలతో భాంధవ్యాలను పెంచుకుంటూ పోతే పురుషులకు బాధ్యతలు, కష్టాలు పెరగటం తప్ప, సుఖమేమీ ఉండదు.
* అందుకని గృహస్తులు కూడా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* ఇక పురాణేతిహాసాల్లో చూస్తే , కొందరు స్త్రీలు అనుకున్నంత అబలలు కాదని తెలుస్తుంది. శ్రీ రాముని వనవాసానికి పంపించే విషయంలో చాడీలు చెప్పిన మంధర, రావణునికి చాడీలు చెప్పి సీతాదేవిని అపహరించటానికి కారకురాలైన శూర్పణఖ స్త్రీలే.
* పై విషయాలను గమనించితే, పురుషులు కొన్ని సార్లు, స్త్రీల విషయంలో తగుమాత్రం దూరంగా ఉండాలి .అని తెలుస్తుంది..
* శంకరాచార్యుల వారు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పినది , వివాహం కాని బ్రహ్మచారులు, ..వంటి కొందరిని ఉద్దేశించి చెప్పారని అనిపిస్తున్నది.
* శంకరాచార్యుల వారు, తల్లిని కనిపించే దైవంగా , భర్తకు చక్కటి స్నేహితురాలిగా భార్యను చెప్పటాన్ని గమనించితే, వారికి స్త్రీలంటే ఎంతో గౌరవం అని తెలుస్తుంది.
.................................
* ఆదిశంకరాచార్యుల వారి ప్రశ్నోత్తర రత్న మాలికలోని కొన్ని విషయాలను గురించి,
అంతర్జాలంలో ఈ లింక్స్ ద్వారా తెలుసుకోవచ్చు..........
prasnottara ratna malika of adi sankaracharya - gleanings from ...
Prashnottara Ratna Malika | Vedanta Spiritual Library
Hinduism EBooks: Prasnottara Ratna Malika of Adi Sankaracharya ...
* నేను పై విషయాలను ఎవరితోనూ పోటీ కోసం వ్రాయలేదండి. ఆదిశంకరాచార్యుల వారికి స్త్రీలంటే ఎంతో గౌరవం . అని ప్రజలకు తెలియజేయాలన్నది నా తాపత్రయం.
* వ్రాసిన విషయాల్లో పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
దీనిని ఇలా సవరించిన బాగుగా ఉండునని నాఅభిప్రాయము:
ReplyDeleteగృహస్తుల వంటి వారు కూడా కోరికలను సిద్దింపజేసుకోవటానికి , కొన్నిసార్లు తపస్సులు చేస్తుంటారు....ఇలాంటివారు కూడా దీక్షా సమయంలో స్త్రీలకు కొంతవరకు దూరంగా ఉండాలి.
గృహస్తుల వంటి వారు కూడా కోరికలను సిద్దింపజేసుకోవటానికి , కొన్నిసార్లు తపస్సులు చేస్తుంటారు....ఇలాంటివారు కూడా దీక్షా సమయంలో తన భార్యలకు కొంతవరకు దూరంగా ఉండాలి.