koodali

Saturday, November 12, 2016

కొంత పన్నులు తగ్గిస్తే ..




మన ప్రజలకు క్యూలు కొత్త కాదు. సామాన్యులకు కొన్ని కష్టాలూ కొత్తకాదు.

నల్లడబ్బు సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే తాత్కాలిక క్యూలు, కొన్ని కష్టాలు పెద్దలెక్కలోనివి కావు.


 అయితే పెద్దనోట్లు రద్దు విషయం కొందరు పెద్దలకు ముందే తెలిసి సర్దుకోవటం జరిగితే మాత్రం అది అన్యాయమే.
..............


 పన్ను కట్టే విషయంలో పెద్దవాళ్ళను  వదలకూడదు.

విదేశాలలో దాచిన నల్లడబ్బు  వెనక్కి వచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
.........


దేశప్రజలు ఎందరో తిండి లేక బాధపడుతుంటే  పార్లమెంట్ వద్ద  తక్కువరేటుకు భోజనం ఎందుకు?  దేశప్రజలకు కూడా తక్కువరేటుకు భోజనం అందించండి.
...................


 ప్రజలు కూడా పన్నులు కట్టడంలో మోసాలు చేయకూడదు.


 ప్రభుత్వం ఖజానా బాగుంటేనే కదా దేశం అభివృద్ధి చెందుతుంది.
............


ఇక, ప్రభుత్వాలు  విపరీతమైన పన్నులతో బాదటం, పెనాల్టీ టాక్స్ అంటూ భారీ మొత్తం ...కాకుండా కొంత పన్నులు  తగ్గిస్తే ఎక్కువమంది ప్రజలు పన్ను కట్టడానికి ముందుకు వస్తారు.


  తద్వారా నల్లడబ్బు తగ్గుతుంది.



1 comment:

  1. చిన్న సవరణ..
    టపాలో..(దేశప్రజలకు కూడా తక్కువరేటుకు భోజనం అందించండి...)అని రాసిన దగ్గర ...దేశంలోని పేద ప్రజలకు కూడా తక్కువరేటుకు భోజనం అందించండి..అని సవరణ చేస్తున్నాను.

    పదేపదే టపాను మార్చటం కాకుండా సవరణను కామెంట్స్ వద్ద వ్రాయటమైనది.

    ReplyDelete