koodali

Thursday, November 17, 2016

ప్రభుత్వం వెంటనే 500వందలు,100 నోట్లను దండిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి..


రోగికి ఆపరేషన్ చేయాలంటే ఇచ్చే మత్తుమందు ఎంతకావాలో అంతే ఉండాలి. డోస్ ఎక్కువయినా..తక్కువయినా సమస్యే.

 పెద్దనోట్ల రద్దు తరువాత ఇప్పటికే చాలారోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పెద్దనోట్ల రద్దుకన్నా ముందు ..విదేశాలకు తరలించిన  నల్లడబ్బు గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోలేదనే అసంతృప్తి ప్రజలలో ఉంది.

బాగా నల్లడబ్బు ఉన్న వారి పని పడితే బాగుండేదని కూడా  చాలామందికి మనసులో ఉంది.

అయినా కూడా, నల్లడబ్బు, నకిలీ నోట్ల సమస్యలు కొంతవరకైనా తీరుతాయనే ఆశతో ప్రజలు ఇబ్బందులు ఓర్చుకుంటున్నారు.

* అసలే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, బాగా డబ్బు ఉన్నవారి బకాయిలు బ్యాంకుల వాళ్ళు రద్దు చేశారన్నట్లు వస్తున్న వార్తలు ప్రజలలో మరింత అసహనాన్ని పెంచుతున్నాయి.

( అయినా, రైతుల రుణాలు మాఫీ చేయమంటే ఏడ్చిపోయే బ్యాంకుల వాళ్ళు ..డబ్బున్న వాళ్ళ రుణాలు ఉత్సాహంగా మాఫీ చేయటమేమిటి?)

* బడా వ్యక్తుల బాకీల రద్దు వంటి  చర్యలు..  ప్రభుత్వంపై నమ్మకాన్ని సడలేలా చేస్తున్నాయి.

ప్రజలు తమను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటూ ..  ప్రభుత్వం కొత్తనోట్ల విడుదల ఆలస్యం చేస్తే..  ప్రభుత్వంపై ఆగ్రహం బాగా పెరిగే అవకాశం ఉంది.

* అందువల్ల, ప్రభుత్వం వెంటనే 500వందలు,100 నోట్లను దండిగా ప్రజలకు అందుబాటులోకి తేవాలి..

బినామీల విషయంలో చర్యలు తీసుకోవాలనుకోవటం చాలా బాగుంది.
--------
  పాతకాలంలో భారతప్రజలకు పొదుపు అలవాటు ఉండేది.

ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే..బాగా పెరిగిన జీతాలు, బాగా పెరిగిన ధరలు..బాగా పెరిగిన ఖర్చులు..ఇలాంటప్పుడు,100 నోట్లు ఏం సరిపోతాయి?

 * అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కాకుండా.. ఎక్కువగా 100, 500 నోట్లను వెంటనే విడుదల చేస్తే జనానికి ధైర్యం వచ్చి క్యూలు తగ్గిస్తారు.
******

* చిల్లర సమస్య తగ్గటం కోసం దేవాలయాల హుండీ డబ్బు వాడాలనుకోవటం బాగానే ఉంది కానీ, తీసుకున్న హుండీల సొమ్ముకు సరిపడినంత పెద్దనోట్లను(సొమ్మును) దేవాలయాలకు వెంటనే ఇవ్వాలి.
  1. **********************

  2. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ చెబుతున్నారు.

    కొన్ని ఇబ్బందులు ఉన్నమాట నిజమే.

    అయితే,  కొందరు ఏం చెబుతున్నారంటే పెద్దనోట్ల రద్దు వల్ల
    సినిమా హాల్స్ ఖాళీగా ఉన్నాయని..బంగారం షాపులు, మద్యం షాపులు, రియల్ ఎస్టేట్, నాన్ వెజ్ షాపులు,..వంటివి వ్యాపారం జరగక వెలవెలపోతున్నాయంటూ వాపోతున్నారు. 
  3.  
     కొన్ని రోజులుసినిమాహాల్ కు వెళ్లి సినిమా చూడకపోతే వచ్చే నష్టమేమీ లేదు.
    కొన్ని రోజులు బంగారం కొనకపోతే ఏమీకాదు, నాన్ వెజ్ తినకపోయినా ఏమీ కాదు, విపరీతంగా ధరలు పెరిగిన ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొన్నాళ్ళు ఆగితే నష్టమేమీ లేదు.

    ఇక మద్యంపై వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటమనేది ఎంతో దారుణం.

    కొందరు జనం మనస్తత్వం విపరీతంగా ఉంది. ఉప్పు ధరలు పెరిగాయంటూ వార్తలు వస్తే చాలు ముందూవెనుకా ఆలోచించకుండా కిలోలకొద్దీ ఉప్పు కొని దాచేసారు.

    ఇలాంటి మనస్తత్వం ఉన్న జనాలు డబ్బు విషయంలో మరింత ఎక్కువ ఆలోచిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు.

    డబ్బు విషయంలోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంది.

    పెద్దనోట్ల రద్దు తరువాత జనాలు కంగారుపడిపోయి తమవద్ద ఉన్న 100 నోట్లను ఎక్కువగా వాడకుండా దాచుకుంటున్నారు.

    ఏటీఎం లలో ఎంత డబ్బు వేసినా నిమిషాలలో ఖాళీ అయిపోతున్నదంటున్నారు.

    క్యూలు పెరగటాన్ని గమనిస్తే కొందరు నిజంగా అవసరాలకు తీసుకుంటుంటే మరికొందరు డబ్బు నిలువ పెట్టుకుకోవటం మంచిదని భావించి క్యూలో ఉంటున్నారనిపిస్తుంది.

    జనాలు ముందస్తు భయంతో అవసరానికన్నా ఎక్కువ నోట్లు తెచ్చుకుని దాచుకోవటం వల్ల నోట్ల కొరత వస్తుంది.

    ఇందువల్ల కొన్ని రోజులు ఈ సమస్యలు కొనసాగే అవకాశం ఉంది.

  4. **************************
  5. ఇక, డబ్బున్న పెద్దవాళ్ళను పట్టుకోవచ్చు కదా అంటున్నారు.

    ఈ విషయంలో మరింత ఎక్కువ దృఢత్వం కావాలి. డబ్బున్న పెద్దవాళ్ళు అన్ని పార్టీలలోనూ ఉన్నారు.

    అవినీతి పనులతో డబ్బుకూడబెట్టడం ఎవరి విషయంలోనైనా తప్పే.

    డబ్బు సంపాదన విషయంలో చట్టప్రకారం ప్రవర్తిస్తే అందరికీ మంచిది.

    ఇప్పుడు ఎక్కువమంది ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే నల్లడబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా భయం వస్తుంది.

    అలా కాకుండా,ఇప్పుడు ప్రభుత్వాన్ని తిట్టడం వల్ల ..బ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం తమనేమీ చేయలేదనే ధైర్యం వస్తుంది.
    ఇక ప్రజలే ఆలోచించుకోవాలి.

  6. *******************
  7. దేశంలో ఎప్పటినుంచో 100, 50, 10..నోట్లు సరిపడా అందుబాటులో లేవు కాబట్టి..
    .పెద్దనోట్ల రద్దు ప్రకటనకు కొన్ని నెలలకు ముందే..100, 50,10..నోట్ల కొరత లేకుండా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఉండవలసింది.

    ఇప్పుడు 2000నోట్లు ముద్రించారు కదా! దాని బదులు కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ముద్రించి రడీగా ఉంచవలసింది.

    పెద్దనోట్లు రద్దు ప్రకటన తరువాత వారం లోపే.. కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేసి ఉంటే ఇప్పుడు ఉన్న గందరగోళం ఉండేది కాదు.

5 comments:

  1. Bear for 15 days. Everything will be normal. Switch off tv. They are repeatedly showing negative news.

    ReplyDelete


  2. మాకు ఇబ్బందేమీ లేదండి.

    అయితే,చాలామంది విషయంలో కొత్త500నోట్లు,100 మరియు చిల్లర నోట్లు అందక ఇబ్బంది పడుతున్నారంటున్నారు కదా!

    15 రోజులయితే ఫర్వాలేదు.

    కొన్ని నెలల వరకూ కొత్తనోట్లు రావంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

    కొన్ని నెలల వరకూ నోట్ల కొరత ఉంటే కష్టమే కదా! అలా కాకుండా త్వరగా కొత్తనోట్లు వస్తే బాగుంటుంది.

    ఏది ఏమైనా పరిస్థితి చక్కబడుతుందని ఆశిద్దామండి.

    ReplyDelete
  3. ఇప్పటికయినా మించిపోయిందేమీ లేదు. 2014, ఆ తరువాత ముద్రించిన 500 నోట్లు చెల్లుతాయి అని ప్రకటిస్తే సమస్య చాలావరకు తగ్గుతుంది. కావాలంటే ఒకటి, రెండేళ్ళ తరువాత ఈ పాత నోట్లని చలామణి లోంచి తొలగించవచ్చు.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పినట్లు కొంతకాలం వరకూ 500 నోట్లు అనుమతించటం బాగానే ఉంటుంది.
      అయితే,ఈ విషయం గురించి మరి కొన్ని అభిప్రాయాలు ఏమిటంటేనండి..
      .....
      నాకు బ్యాంకింగ్ గురించి అంతగా తెలియదు. అయితే, బ్యాంకింగ్ గురించి కొంత తెలిసిన వారు చెప్పిన కొన్ని విషయములు ఏమిటంటే..

      డిసెంబర్ 30 వరకూ లేదా కొత్త నోట్లు సరిపడినంతగా వచ్చేవరకు పాత 500 నోట్లను అనుమతించాలి.

      10 వేల పై బడిన లావాదేవీలను బ్యాంకుల ద్వారా మాత్రమే అనుమతించాలి. ఇందువల్ల.. నల్లడబ్బుకు అవకాశం ఉండదంటున్నారు.

      కొత్త 500 నోట్లు వచ్చే వరకూ ఇలా చేయవచ్చని అంటున్నారు.

      అయితే, రద్దు అయే పాతనోట్లను తీసుకోవటానికి ఎక్కువమంది ఇష్టపడరు.

      ఇందువల్ల లావాదేవీలు తక్కువగా జరిగే అవకాశం ఉంది.
      ..............

      మరికొన్ని అభిప్రాయాలు..దేశంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి..వాళ్ళ సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.


      కొత్తనోట్లు అందుబాటులోకి వచ్చేవరకూ ప్రజలు ముఖ్యమైన లావాదేవీలు తప్ప మిగతా పనులు వాయిదా వేసుకోవాలి.
      ............

      ఏదిఏమైనా.. ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవ్వాలని ఆశిద్దామండి.

      Delete
  4. ఈ నోట్ల రద్దు పరిణామాలను గమనిస్తున్న కొందరి అభిప్రాయాలు ..

    కొందరు మీడియా వాళ్ళు కూడా జనాన్ని మరింత కంగారు పెడుతున్నారు.

    ఉదా..యజమానులు కూలీలకు డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ గోలగోలగా చెబుతున్నారు.

    యజమానులు కూలీల పేరిట అకౌంట్ తెరిచి వాళ్ళ అకౌంట్లో జీతాలు వేయచ్చు కదా!

    ReplyDelete