ఇప్పుడు జరిగిన పెద్దనోట్ల రద్దు.. తదనంతర పరిణామాల వల్ల దేశంలో అందరికీ పన్నుల గురించి చాలా అవగాహన వచ్చింది.
పన్ను కట్టకపోయినా ఏమీ కాదులే..అనే ధోరణి తగ్గుతుంది. బడా వాళ్ళకు కూడా కొంత కదలిక వస్తుంది.
..................
అయితే ఇప్పుడు పెద్దనోట్లు ఎందుకు రద్దు చేయటం... మళ్ళీ తిరిగి తేవటం ఎందుకు ?అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. కొత్తనోట్లు పాతనోట్లను పోలిలేవు. కొత్తనోట్లు డిజైన్ మారింది.
ఇలా అప్పుడప్పుడు పాతనోట్లను రద్దుచేయటం..కొత్త డిజైన్ తో కొత్తనోట్లను తేవటం వల్ల దొంగనోట్లు సమస్య, నల్లడబ్బు సమస్య కొంతకాలం.. కొంతవరకూ తగ్గుతుంది.
అయితే ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఇకపై ప్రజలు 2000నోట్లను భారీగా నిల్వ చేయటానికి భయపడతారు.
...........
ఈ చర్యల వల్ల రియల్ ఎస్టేట్ భారీగా దెబ్బతిని సామాన్య ,మధ్యతరగతి ప్రజలు నష్టపోతారని కొందరు ప్రచారం చేస్తున్నారు.
నిజం చెప్పాలంటే ..ఇప్పుడు ఇళ్ళు, స్థలాలు ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నాయా?
ఈ పరిణామాల వల్లనయినా రియల్ ఎస్టేట్ ధరలు దిగివస్తే మంచిది.
ఇక , భారీ ఎత్తున బంగారం కొంటున్నవారిపై నిఘా ఉంచుతున్నారు కదా!
............
అయితే మనదేశంలో చాలామంది చదువుకున్నవాళ్ళకు కూడా బ్యాంక్ వ్యవహారాల గురించి సరిగ్గా తెలియదు.
ఇలాంటప్పుడు పెద్దనోట్లన్నీ రద్దు చేయటం సరైనది కాదు.
2000 నోటు బదులు కొత్త 1000నోటు వస్తే బాగుంటుంది.
100 నోట్లతో మాత్రమే ఎక్కువమొత్తంలో లావాదేవీలు నిర్వహించటం కష్టం. అందువల్ల 500, 1000 నోట్లు ఉండటం అవసరమే.
అన్ని లావాదేవీలూ బ్యాంకుల ద్వారా మాత్రమే నిర్వహించటం ఇంకా అభివృద్ధి చెందని మన దేశంలో ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు.
సైబర్ నేరాలు జరుగుతున్న ఈ రోజుల్లో అన్ని లావాదేవీలు ఆన్ లైన్ ద్వారానే జరగాలన్నా కష్టమే.
దేశంలో ఎప్పటినుంచో 100, 50, 10..నోట్లు సరిపడా అందుబాటులో లేవు కాబట్టి..
ReplyDelete.పెద్దనోట్ల రద్దు ప్రకటనకు కొన్ని నెలలకు ముందే..100, 50,10..నోట్ల కొరత లేకుండా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఉండవలసింది.
ఇప్పుడు 2000నోట్లు ముద్రించారు కదా! దాని బదులు కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ముద్రించి రడీగా ఉంచవలసింది.
పెద్దనోట్లు రద్దు ప్రకటన తరువాత వారం లోపే.. కొత్త డిజైన్ 500, 1000 నోట్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేసి ఉంటే ఇప్పుడు ఉన్న గందరగోళం ఉండేది కాదు.