koodali

Wednesday, November 30, 2016

దేశంలో పరిస్థితి గురించి కొన్ని విషయాలు ..2..

 
 
కొన్నినెలల క్రిందట ఒకసారి నేను  మనియార్డర్ చేయటానికి పోస్టాఫీసుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాలు చెబుతాను. 

పోస్టాఫీసులో కొందరు వృద్ధులు ఉన్నారు.వాళ్ళు పెన్షన్ల కోసం వచ్చారట.


పోస్టాఫీసులో పెన్షన్లు ఇస్తున్నారని పేపర్లో  రాసారు.మైకులో చెబుతున్నారు. అందుకని వచ్చామని అడుగుతున్నారు. 


అయితే పోస్టాఫీస్ వాళ్ళు ఏమంటున్నారంటే ..


వార్తలు వచ్చాయి గానీ,  మాకు ఇంకా డబ్బు అందలేదు. మేం ఏం చెయ్యం? రేపు డబ్బు వస్తుందేమో? మళ్ళీ రండి అంటున్నారు. 


 ఆ వృద్ధులలో దూరం నుంచి ఎండలో నడిచి వచ్చిన వారూ ఉన్నారట.


 ఇక చేసేదేమీ లేక వృద్ధులలో కొందరు తిరిగి వెళ్ళారు.


 ఇది చూసిన తరువాత నాకు ఏమనిపించిందంటే... 


 ఈ రోజు పోస్టాఫీసుల నుండి వృద్ధులకు డబ్బు వస్తుందని వార్తలలో చెబుతున్నారు..పోస్టాఫీసుకు వెళ్తే డబ్బు రాలేదంటున్నారు.


అయితే, ఇప్పుడు ఈ వృద్ధులు ఇంటికి వెళ్తే.. 


ఇంట్లో వాళ్ళు , ఈ వృద్ధుల మాటలు నమ్మకుండా ఆ డబ్బు ఏం చేసావని ?  వృద్ధులని అనుమానించే పరిస్థితి కూడా ఉండొచ్చు...అనిపించింది.


ఇలా రకరకాల సంఘటనలు ఉంటాయి. 


దేశంలో..  ఇప్పటికిప్పుడు   డిజిటల్ లావాదేవీలంటే ఎన్నో కోణాల నుంచి ఆలోచించాలి.  ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.


**********

మేము కొన్నేళ్ళు చెన్నైలో ఉన్నాము.మాకు తమిళ్ సరిగ్గా రాదు.


అయితే షాపింగ్ కొరకు మాల్స్ కు వెళ్తే కార్డ్ వాడటం వల్ల మాటతో పనిలేకుండా సరుకులు కొనుక్కునే అవకాశం ఉండేది. 


అయితే, షాపులలో కార్డ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.


 బిల్ చెల్లించటం కొరకు షాప్ వాళ్ళకు కార్డ్ ఇచ్చి మరిన్ని సరుకులు కొనటానికి వెళ్ళకూడదు. 


కార్డ్ పక్కకు తీసుకెళ్ళి నెంబర్ కనుక్కుని ఎక్కువ డబ్బు తీసుకునే అవకాశముందని తెలిసినవాళ్ళు చెబుతున్నారు. 


అందువల్ల,  కార్డ్ ఇచ్చి బిల్ చెల్లించి వెంటనే కార్డ్ తీసుకోవాలి.


( మామూలుగా అయితే షాప్ వాళ్ళు  
కార్డ్ వెంటనే ఇచ్చేస్తారు.)


అయితే, మోసం చేయాలనుకుంటే ఎన్నో పద్దతులుంటాయి. 


వినియోగదారులు గట్టిగా అడగాలన్నా విషయం సరిగ్గా తెలియని పరిస్థితి ఉండొచ్చు..


**********
కొన్ని విదేశాలలో.. షాపుకు వెళ్ళి వస్తువులపై ఉన్న ధరల సూచిని మిషన్ వద్ద చూపించి మనమే సొంతంగా బిల్ చెల్లించే ఏర్పాట్లు కూడా ఉన్నాయట.


 (అంటే, మన వద్ద ఉన్న కార్డ్ షాప్ వాళ్ళకు ఇవ్వకుండా  మనమే కార్డ్ తో బిల్ చెల్లించవచ్చన్నమాట.)


కార్డ్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి .. మన నెంబర్ ఇతరులు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


తరచు సిం మార్చటం మంచిదంటున్నారు.


 ఏమైనా ఇకమీదట దేశంలో సైబర్ నేరాలు ఎక్కువ కాకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి.


ప్రస్తుతానికి 100, కొత్త 500 నోట్లు అందుబాటులోకి తెచ్చి ప్రజల సమస్యలు తీర్చాలి. 


క్రమంగా నగదురహిత లావాదేవీల గురించి నేర్చుకోవచ్చు.



3 comments:


  1. ఇప్పటికిప్పుడు అందరూ డిజిటల్ లావాదేవీలకు మారటం కంటే ..పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వటం ..

    చిన్నమొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు నగదు వాడటం జరిగితే బాగుంటుంది.

    ReplyDelete
  2. కేంద్ర ప్రభుత్వం నల్లడబ్బు కట్టడి కొరకు అంటూ ఎన్నో నియమాలు చేస్తోంది. బాగానే ఉంది. ఇలా వచ్చినడబ్బును పేదలకొరకు వినియోగిస్తామని చెబుతున్నారు.

    అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన సొమ్ము అంతా కేంద్రానికి వెళ్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా వెళ్తుందా?

    ఇప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాల పేదలకు నిష్పక్షపాతంగా ఇస్తుందా? లేక తనకు నచ్చిన రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇస్తుందా?

    రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తనకు న్యాయంగా రావలసిన హక్కుల కోసం కూడా ఇప్పటికీ కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాము.

    ప్రత్యేక హోదా అంటే ఇతరరాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి ఇవ్వం అన్నారు. సరేలే అని ప్రత్యేక ప్యాకేజ్ తో సరిపెట్టుకుందామని చూస్తుంటే దానికి చట్టబద్ధత ఇవ్వటానికి కూడా ఆలస్యం చేస్తున్నారు.

    రాజధాని లేకుండా ఆర్ధికలోటులో ఉన్న రాష్ట్రానికి ఆర్ధిక సహకారం విషయంలోనూ సరిగ్గా ఇవ్వకుండా అప్పుడుకొంచెం అప్పుడుకొంచెం ఇస్తూ తమ చుట్టూ తిప్పించుకుంటున్నారు.

    కేంద్రం దగ్గర కూడా డబ్బు లేదంటున్నారు. డబ్బులేనప్పుడు చిన్నరాష్ట్రాలు ఎందుకు ఏర్పాటు చేయాలి?

    ఇక మీదట రాష్ట్రాల పరిస్థితి ఏం కానున్నదో?

    ఏది ఏమైనా నిజంగా నల్లడబ్బు కట్టడి జరిగితే మాత్రం ఎంతో సంతోషకరమైన విషయం.

    దేశమంతా అభివృద్ధి చెందాలని ఆశిద్దాము.

    ReplyDelete
  3. 100 నోట్లు, కొత్త 500 నోట్లు విరివిగా వచ్చేందుకు కొంతకాలం పడుతుందంటున్నారు.

    ఈ లోపు ప్రజల సమస్యలు తగ్గటానికి ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవచ్చు.

    డిజిటల్ లావాదేవీలు చేయటం తెలిసిన వారితో నగరాలలో, గ్రామాలలో విరివిగా సహాయకేంద్రాలు ఏర్పాటుచేయాలి.

    సహాయకేంద్రాలకు రాని ప్రజల ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు సహాయం చేయాలి.

    నగదురహిత లావాదేవీలు తెలియని వారు తమ జీతం తీసుకోవటం, ఇంటి అవసరాలకు సరుకులు కొనుగోలు చేయటం మొదలైన విషయాలను చెపితే వాలంటీర్లు వారికి సహాయం చేయాలి.

    నగదురహిత విధానం ద్వారా జీతాన్ని ఇప్పించటం , సరుకులు కొనుగోలు చేయటం మొదలైన విషయాలలో సహాయం చేయాలి.

    ఈ విధంగా ప్రజలకు రెండు, మూడు నెలలు సహాయసహకారాలను అందిస్తే అప్పటికి కొత్త నోట్లు విరివిగా వస్తాయి. అప్పటికి పరిస్థితి చక్కబడుతుంది.

    ఇక తరువాత ప్రజలు నగదు వాడుకుంటారో లేక డిజిటల్ విధానాన్ని ఆచరిస్తారో వాళ్ళ ఇష్టం.

    ReplyDelete