koodali

Wednesday, November 9, 2016

చిల్లర సమస్యలు..కొందరి అసహనం..


పాతకాలంలో వస్తుమార్పిడి విధానం ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది. 

ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా కొన్ని నోట్లను రద్దు చేస్తూ ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

అయితే వీటితో పాటూ విదేశాలలో దాచిన నల్లడబ్బును  కూడా తిరిగి రప్పించే ప్రయత్నాలు చేయాలి. 

 ఇప్పుడు 500, 1000..నోట్ల గురించిన భయం తగ్గింది.

 నిన్నటి వరకూ ఏది దొంగనోటో? ఏది సరైన నోటో? తెలియక అయోమయంగా ఉండేది. ప్రస్తుతానికి ఆ భయం లేదు. 

అయితే, మళ్ళీ 500, 2000..నోట్లు వస్తాయంటున్నారు.

 అయితే కొత్తనోట్ల విషయంలో దొంగ నోట్లు తయారీ కష్టం అంటున్నారు.

 ట్రాక్ చేసే పద్ధతి వల్ల నల్లడబ్బు చలామణీ కూడా కష్టమే అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?
...................

కొందరు ఏమంటున్నారంటే,ఈ అకస్మాత్తు చర్య వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందే విషయాలు చెప్పి చేస్తే బాగుండేది అంటున్నారు.

 ( అంటే, ఇన్ కం టాక్స్ వాళ్ళు ముందే చెప్పి దాడులు చేయాలి... అన్నట్లు ..ముందే చెప్పి చేస్తే ఇంకేముంటుంది? 

ముందే చెపితే తమవద్ద ఉన్న నల్లడబ్బును జాగ్రత్తగా మార్చేసుకునేవారు.

.ముందే పెద్ద ఎత్తున వందనోట్లను బాంకులకు పంపినా విషయాన్ని పసిగట్టి చాలామంది జాగ్రత్తగా సర్దుకునేవారు.)

 ఇలా అకస్మాత్తుగా ప్రకటించటమే కరెక్ట్. అయితే ఈ చర్య వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినా తప్పని పరిస్థితి. 

********************
 ప్రజలకు మంచి చేయటం కోసం ఒక చిన్న ప్రయత్నం ప్రయత్నిస్తే చాలామంది ప్రజలు అర్ధం చేసుకోకుండా మాట్లాడటం అత్యంత బాధాకరం.

చాలామంది సామాన్యప్రజలు కూడా తమ వద్ద  500, 1000 నోట్లు తప్ప చిన్న నోట్లు లేవన్నట్లు మాట్లాడుతున్నారు.  

ఇవన్నీ గమనిస్తుంటే భారతప్రజలు అందరూ సంపన్నులు అయ్యారు కాబోలు అనిపిస్తోంది.

వీళ్ళకు తోడు కొన్ని చానల్స్ వాళ్ళు ప్రజలకు వివరించి చెప్పాల్సింది పోయి ప్రజలు చాలా కష్టాలు పడిపోతున్నారంటూ అందరికీ చూపెడుతున్నారు.

అయితే, కొన్ని చానల్స్ వాళ్ళు ప్రజల సందేహాలకు తగిన సమాధానాలు తెలియజేస్తూ సహాయం చేస్తున్నారు. 

***********************
ఈ చిల్లరసమస్య తగ్గాలంటే రెండురోజులు ఆఫీసులకు సెలవులు ప్రకటించటం మంచిది.

కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ప్రజలు ఓర్చుకోవాలి. 

హుధుద్ తుపాన్, నగరాలలో వరదలు .. వంటివి వచ్చినప్పుడు ప్రజలు ఇంట్లోనే ఉన్నారు కదా! అలాగే రెండురోజులు ఇబ్బంది భరించలేరా ? 

 ఇంత అసహనం వ్యక్తం చేయటం ఎంతవరకూ సమంజసం?

 అత్యవసరంగా హాస్పిటల్ వంటి ఖర్చులకు మినహాయింపు ఇచ్చారు కదా!

 నిజమే ఈ ప్రయత్నం వల్ల నల్లడబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు, ఇందులో కొన్ని రాజకీయాలూ ఉండవచ్చు.

 అయితే ఒక ప్రయత్నం చేస్తుంటే.. ప్రజలు ఇంత అసహనం వ్యక్తం చేస్తుంటే ఇక ప్రజల సమస్యలు తగ్గించటానికి కొత్త ప్రయత్నాలు చేయటానికి ఎవరూ ముందుకు రారు. వారి ఖర్మకు వారిని వదిలివేయటం తప్ప.

******************

సరిహద్దులలో సైనికులు దేశప్రజల రక్షణ కొరకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. 

అలాంటిది దేశప్రయోజనాల కొరకు ప్రజలు కొన్ని  రోజులు ఇబ్బందులు పడలేరా?


1 comment: