టీవీలో ఒక వినోదకార్యక్రమం వస్తోంది.
ఆ కార్యక్రమంలో ..... కొన్ని రోబోట్లు తీరికవేళలో కబుర్లు చెప్పుకుంటున్నాయి.
ఒక రోబోట్ , సాలోచనగా .... మనల్ని సృష్టించినదెవరో అంతుపట్టటం లేదు.... అన్నది.
ఇంకో రోబోట్ ,.... మనల్ని ఎవరూ సృష్టించలేదు. సృష్టికర్త అంటూ ఎవరూ లేరు. మనకు మనమే యాదృచ్ఛికంగా జన్మించాము. అన్నది.
ఈ విషయం మీద రోబోట్లన్నీ రెండువర్గాలుగా విడిపోయాయి. రోబోట్ల వాదనలతో అక్కడంతా గోలగోలగా తయారయింది.
వేరే గదిలో కూర్చుని , స్క్రీన్ మీద రోబోట్ల వాదనలను గమనిస్తున్న , ఈ రోబోట్లను సృష్టించిన శాస్త్రవేత్తలు వినోదంగా నవ్వుకున్నారు.
వినోదకార్యక్రమం సంగతి అలా ఉంచితే....
దైవం, జీవులు.....శాస్త్రవేత్తలు , రోబోట్ల పోలికలో చాలా తేడాలు ఉన్నాయి.
................
ఆస్తికులు సృష్టిని సృష్టించినది దైవం అని భావిస్తారు. నాస్తికులు సృష్టి యాదృచ్చికంగా దానికదే సృష్టించబడిందని అంటారు.
ప్రతి విషయంలోనూ హేతుబద్ధంగా ఆలోచించాలి అని వాదించే భౌతికవాదులు , సృష్టి యాదృచ్ఛికంగా దానికదే ఏర్పడిందని అనటంలో హేతుబద్ధత ?
యాదృచ్ఛికం అనటం కన్నా, దైవమనే మహాశక్తి వల్లే సృష్టి ఏర్పడిందనటంలోనే హేతుబద్ధత ఉంది.
ఒక రోబోట్ యొక్క విడిభాగాలను దూరంగా విసిరేసి ఒక సంవత్సరం గడిచిన తరువాత చూసినా, ఆ విడిభాగాలు అలాగే ఉంటాయికానీ, వాటికవే కలిసి రోబోట్ గా తయారవదు కదా ! ఎవరైనా వ్యక్తి ఆ విడిభాగాలను కలిపితేనే రోబోట్ తయారవుతుంది.
చిన్న రోబోట్ విషయంలోనే ఇలా ఉంటే ఇంత గొప్ప సృష్టి, సృష్టి కర్త లేకుండా దానికదే యాదృచ్ఛికంగా ఎలా ఏర్పడుతుంది ? అదీ ఇంత పద్ధతిగా.... చక్కటి ప్రణాళిక ప్రకారం....
..గాలిలో ఎగిరే పక్షులకు తేలికైన రెక్కలు ఉండటం, నీటిలో చేపలకు ఈదటానికి తగ్గట్లు శరీరం ఉండటం, అతి చిన్న చీమకు ఉండే శ్రమశక్తి, గతితప్పకుండా వచ్చే సూర్యచంద్రులు, వాటివల్ల జీవించే మొక్కలు, భూమికి గల గురుత్వాకర్షణ శక్తి ....
..ఇంత గొప్ప సృష్టి దానికదే యాదృచ్ఛికంగా ఏర్పడిందని అనటం హేతుబద్ధత అనిపించుకోదు.
ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్నతలండి .
............
............
మీరు చెప్పింది నిజమే.
ReplyDelete
Deleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
హేతువుని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారంటే,మీరు కూడా హేతువాదేనండి, కాకపోతే ఒకరు దేవుడూ అంటే, మరొకరు ప్రకృతి అంటారేమో, మీ ఆలోచనలు బాగుంటాయండి.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteఆధ్యాత్మిక వాదులైనా, భౌతికవాదులైనా విచక్షణతో ఆలోచించటం మంచిదేనండి..
. " ఒకరు దేవుడూ అంటే, మరొకరు ప్రకృతి అంటారేమో," ...సరిగ్గా చెప్పారండి. ఆస్తికులు దైవం అంటారు....నాస్తికులు ( భౌతిక వాదులు. ) ప్రకృతి అంటారు...... పేరు ఏదైనా విషయం ఒక్కటే.
చక్కటి తర్కం...
ReplyDeleteమంచి పోస్ట్ అనూరాధ గారూ!
@శ్రీ
Deleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
రోబో సృష్టికర్త ఎవరనే ప్రశ్నకు సమాధానం బాగా చెప్పారు.
ReplyDeleteమరి ఆ సృష్టికర్తను సృష్టించింది ఎవరు? ఆయనను సృష్టించింది ఎవరు? అంటూ గొలుసు పద్దతిలో వరుసుగా అడుగుతూ ఉంటె సమాధానం చెప్పలేము.
ఎప్పుడో ఒకప్పుడు "ఆయన స్వయంభువు" అని అనక తప్పదు. ఆ చేసేదేదో మనకు అందుబాటులో ఉన్న స్థాయిలోనే అనుకుంటే పోలా?
Jai Gottimukkala గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteనిన్నటి టపాలో మరికొన్ని విషయాలు కూడా రాయాలనుకున్నానండి. అయితే ఆ విషయాలు ఇంతకుముందు వ్రాసినవే కదా ! అని ఊరుకున్నానండి.
సృష్టిని సృష్టించినది దైవం అని తెలిసిన తరువాత . మరి దైవం ఎలా జన్మించారు అనే ఆలోచన రావటం సహజం.
* సృష్టిలో మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. తెలియనివి ఎన్నో ఉన్నాయి.
* దైవం ఆది అంతమూ లేని మహాశక్తి .... అని పెద్దలు చెప్పటం జరిగింది.
* "Matter and energy cannot be created or destroyed" అని ఆధునికశాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ,యొక్క రూపం మారుతుంది .. అంతేకానీ, పదార్ధాన్ని ,శక్తిని, సృష్టించలేము , నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.
ఉదా...నీరు ఆవిరిగా మారుతుంది ... ఆవిరి మరల నీరుగా మారుతుంది .
* పదార్ధానికే పుట్టుక , నశించటం అనేవి లేనప్పుడు , పదార్ధాన్ని సృష్టించిన దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .... అని పెద్దలు చెప్పిన మాట నిజమని తెలుస్తోంది కదా !
.................................
* దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .. అనే విషయం నమ్మటం కష్టంగా అనిపించినా నిజమదే.
* ఫోన్లు, టీవీలు రాని కొత్తలో ఎక్కడో దూరాన ఉన్నవారిని చూడటం, వారితో మాట్లాడటం సాధ్యమే..... అని పురాణాలలో పెద్దలు తెలియజేసిన విషయాన్ని చాలామంది నమ్మలేదు. ఇప్పుడు ఫోన్లు, టీవీలు వచ్చాక అది సాధ్యమేనని తెలిసింది కదండి.
* అలాగే " దైవం ఆద్యంతాలు లేని నిత్యశక్తి .." అనే విషయం కూడా అక్షరసత్యం.
* ఉదా... ఒక గుడ్రటి సున్నా లాంటి ఆకారాన్ని మనసులో ఊహించుకుంటే, ఓ..... ఈ ఆకారానికి ఆది ....అంతమూ ఎక్కడో చెప్పలేము కదా !
Madhu Mohan గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీరు వ్రాసినది నిజం.
DeleteSorry for commenting in English. Who created man begets the question "who created the creator". Somewhere we have to break the link. The answer "universe is self created" is superior to "god created himself" because it reduces one unknown parameter and reduces the cycle.
Delete..బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం, దేవుడి కల. మానవుడు తన స్వప్న చేతనలో , సకల జీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణంపోసినట్టుగానే దేవుడు, తన మనస్సులోంచే సర్వ వస్తు సముదాయాన్నీ సృష్టిస్తాడు.
Delete" ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు. తరవాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణుశక్తీ ఆ తరవాత పదార్ధమూ పుట్టాయి.....ఇలా ఎన్నో విషయాలు "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో ఉన్నాయండి. ఈ గ్రంధం ఇంగ్లీష్లో కూడా ఉంది. ఈ గ్రంధం చదివితే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.
.........................
మీరు చెప్పినట్లు సృష్టి దానికదే ఏర్పడితే , మనం ఏదైనా యంత్రాన్ని ముక్కలు చేసి విడి భాగాలను అలాగే వదిలేస్తే అవి వాటంతట అవి తిరిగి యంత్రంగా అవటం లేదు కదా ! ఆ యంత్రానికి ప్రాణం కూడా రావటం లేదు .
ఒక యంత్రమే దానికదే ప్రాణాన్ని పొందటం అసాధ్యం అయినప్పుడు, ఈ సృష్టి అంతా దానికదే యాధృచ్చికంగా ఏర్పడటం అనేది అసంభవం .
అసలు జీవిలోకి ప్రాణం ఎలా వస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ అద్భుతమైన , అంతుచిక్కని విషయాలు. ఏమైనా అద్భుతమైన ఆలోచనాశక్తి గల దైవానికే ఇదంతా సాధ్యం. .
గుండ్రని ఆకారాన్నే కాదు, చతురస్రాకారమైనా, దీర్ఘచతురశ్రాకారమైనా ఏ ఆకారం యొక్క చుట్టుకొలతకైనా అద్యంతాలు కనుక్కోవటం కుదరదు. ఒక బిందువును చూసినా .... దాని చుట్టుకొలతకు తుది మొదలు .... కనుక్కోవటం కుదరదు.
రాబోట్ కథ ఏమంత వాస్తవంగా లేదు కాని, హేతుబద్ధత మీద మీరు చెప్పింది నిజమే. ఇలా కార్నర్ చేసినపుడు, ఎదురు దాడి చేసి గొట్టిముక్కల గారు చేసినట్టు ఎదురుదాడి చేసి తప్పించుకోవడమే. :))
ReplyDelete
Deleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
రోబోట్ కధ పూర్తి వాస్తవంగా లేకపోవటం నిజమేనండి. అందుకే అది వినోదకార్యక్రమం . అని వ్రాసాను.
అయితే " దైవం, జీవులు.....శాస్త్రవేత్తలు , రోబోట్ల పోలికలో చాలా తేడాలు ఉన్నాయి. " అని వ్రాసాను.
అవును దేవుళ్ళు వున్నారు నాదగ్గర వేలమంది దేవుళ్ళు బందీగా వున్నారు. ఒక ఆటవికుల దేవుణ్ణి అడిగాను ఏమయ్య.. ఈ పిడికెడు మందికే దేవుడివయ్యవు ప్రపంచంలొ వందల కొట్లమంది వున్నారు వాళ్ళందరికీ దేవుడివి ఎందుకు కాలేదు.అప్పుడు ఆయనన్నాడు నన్ను వీళ్ళు మాత్రమే దేవుడిగా పరిగనించారు.నేనేం చెయ్యను. మిగత వాళ్ళకు ఎప్పుడు దేవుడివి ఔతావు. ? వళ్ళందరూ కొలిచినప్పుడు. నీ శక్తితొ దేవుడి ఔవచ్చు కదా? నాకా శక్తి లేదు. వాళ్ళు పెట్టు కునారు నేనున్నాను. ఇప్పుడు హిందూ దేవుళ్ళ అడిగాను. వీళ్ళు ఒక పెద్ద గుంపు ఈమతంలొ వున్న దేవుళ్ళు ఏ మతంలొనూ లేరు. వీళ్ళు రొండు మూడు దేశాలకు మాత్రమే ప్రాతినిద్యం వహిస్తున్నారు.ముఖ్యంగా ఇండియాకు. వీళ్ళను అడిగాను ప్రపంచంలొ చాలా దేశాల ప్రజలకు మీ గురించి తెలియదు ఎందువల్ల. అని. వాళ్ళలొ ఒక దేవుడు చాలా ఆవేశంగా మమ్ములను చాల తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీ శిరస్సును ఇప్పుడే కండించదా అంటూ ముందుకు వచ్చాడు. అక్కడున్న కొంతమంది శంతపిరిచిరి ( నాదగ్గర బందీగా వున్నారన్న సంగతి మరిశాడు). అందులొ ఒక దేవుడు రొడు మూడు దేశాలైతే ఎమి నాయనా ప్రపంచంలొ జనాబాలొ రెండవ అతి పెద్ద దేశమైన దానికి ప్రాతినిద్యం వహిస్తున్నాను అది చాలదా. సరే గానీ సమజంలొ ఎక్కువ తక్కువలూ, ప్రతినిత్యం గొరాలూ, స్త్రీ, పురుషుల మద్య అసమానతలూ, ఇవన్నీ ఎందుకు వన్నాయి.ఒక గడ్డమొడు లేచాడు సమాదానం చెప్పడానికి పుర్వ జన్మల పాపఫలం నాయనా. ఈ అరిగిపొయిన పాట విని యక్కడా లేని నిసత్తువ వచ్చింది. మా ఎద్దులను అదిలించే చాలాకొడితొ యడా పెడా వాయించాను.
ReplyDeleteఇక ముస్లింలకు ప్రాతినిద్యం వహించే అల్లాను అడిగాను ఆ బైయ్యా అన్ని మతాల్లొ కెల్లా మీ మతంలొ స్త్రీల అణచివేత భయంకరంగ వుంటుందనీ ఎం చేసిన మత పెద్దలకు చెప్పే చేయాలని నిభందనలు వున్నాయి. దీన్ని మీరేందుకు రూపుమాపలేదు. ఆయనన్నాడు అవును స్త్రీలు పురుసులకు బానిసలు వాళ్ళకు సేవచేసుకుంటేనే పున్యం వస్తుంది. మా మతాన్నే వేలెట్టి చుపనక్కరలేదు. ఇది అన్ని మతాల్లొ వున్నదే. తర్వాత అక్కడున్న ముస్లిం సొదరీమణులను చీపురులిచ్చి పంపాను తర్వాత వెల్లి చుచేటప్పటికి సౄహలొ లేడు. ఇక ఆకరున క్రిస్టియన్ యెసుప్రభువను ప్రపంచం నలుదిక్కులా వ్యాపించావు. కాఅదన్న మతాన్ని తొక్కి పారేశావు వేల క్షల మందిని మందిని బలితీసుకున్నావు. ఇది అన్యాయం కాదా అని అడిగాను . అన్యాయం ఎముంది నేను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనుకున్నాను ఆ విస్తరించడంలొ చనిపొయారు దానికి నేనేం చేయాలి? నీ ఎమీ చెయ్యవద్దు మా ఇంటి వెనకాల పాడుబడిన నీళ్ళు లేని బావిలొ విసిరేశాను. పైవాళ్ళంతా దేవుళ్ళు కరు దేవుడనే నమ్మకాన్ని బతికిస్తూ ఆయా మతలకు చెందిన అధికార్లు ఇక్కడ వుండే పుల్ల తీసి అక్కడ పెట్టకుండా కార్మికుల శ్రమపైన బతికే పరాన్న జీవులు. మెలుకువ వచ్చింది లేచి చుస్తె తెల్లవారిపొయింది .ఇదంతా కళలన్న మాట ఇదే నిజమైతే ఎంత బావుణ్ణు.
ఆదిమ సమాజంలొ నుంచి ఆయా నిర్దిష్ట సమాజాలలొ మత బావనలు తలెత్తి అనేక రూపాలు మారుతూ వచింది మతం. ఆనాడు ఆ బావనలు తలెత్తడం సహజం సైన్సు ప్రదమిక దశలొ వుంది. మరి ఈ రొజొ ! అనేక అసమాతనతల వల్ల ఆ బావనలు కార్మిక జనాల్లొ కుడా ప్రభలంగా వున్నాయి ఈ నాడు ఉద్దేశపుర్వకంగానే మత నమ్మ కాలను వ్యాపిస్తున్నారు.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteదేవుడు ఉన్నారని చాలామంది భక్తులు నిర్ధారణ చేసారు. అయితే అందరికీ నిర్ధారణ కావాలంటే ప్రతివారికీ ఆ సమయం వచ్చినప్పుడు తప్పక నిర్ధారణ అవుతుంది.
ఇక దేవుడు ఉన్నాడని తెలుసుకున్న భక్తులు గట్టిగా చెబుతున్నా, అందరూ ఎందుకు నమ్మటం లేదంటే మాయ వల్ల.
ఈ మాయను తట్టుకోవటం చాలా కష్టమండి. అందుకే దేవుడు ఉన్నాడని తెలిసినా మనస్సును అదుపులో ఉంచుకోవటం చేతకాక పాపాలు చేస్తూ ఉంటారు.
మనస్సు కూడా ఒక మాయ. ఈ మాయను జయించినప్పుడు జననమరణ చక్రాన్ని దాటగలరని పెద్దలు తెలియజేసారు.
అజ్ఞాత గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteఏ మతమైనా మంచి విషయాలనే చెబుతుంది. ఆ విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వ్యక్తుల వల్లా , అర్ధం అయినా పాటించని వ్యక్తుల వల్లా సమస్యలు వస్తున్నాయి.