koodali

Monday, September 17, 2012

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని ..........


సృష్టిలో మనకు అర్ధం కాని విషయాలు అనంతంగా ఉన్నాయి.

రమణ మహర్షుల వారు " నేను " అంటే ఏమిటి అని విచారణ చెయ్యమని చెప్పారట.

మనం మనకే అర్ధం కాము.

మన మనస్సు, మన శరీరం ....ఇవన్నీ కలిపి నేను అని భావిస్తూ ,..


  ఈ " నేను " కోసం , ఎంతో తాపత్రయపడిపోతాము.

చిత్రమేమిటంటే మన మనస్సు గురించి కానీ, మన శరీరంగురించి కానీ మనకు ఏమీ తెలియదు.,

తెలుసుకోవాలన్నా మనకి ఏమీ అర్ధం కాదు.

మన మనస్సు మనదే అనుకుంటాము కానీ ,

మరి మన మనస్సు మనం చెప్పినట్లు ఎందుకు వినదన్నది ఎంత ఆలోచించినా అర్ధం కాదు.

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని వాళ్ళను నిందించటం అనవసరం.

నా మనస్సు, నా మనస్సు ....అని నేను తాపత్రయపడటమే కానీ, దానికి అలాంటి మొహమాటమేమీ ఉన్నట్లు కనిపించదు.

మనం ఏపనైతే చెయ్యకూడదు అనుకుంటామో,  మన మనస్సు ఆ పనే చెయ్యాలని ఒకోసారి మొండికేస్తుంది.

దీనిని అదుపులో పెట్టటం చాలా కష్టం.  చాలాసార్లు ఈ మనస్సును అదుపులో పెట్టలేక నేను ఎంత నరకాన్ని అనుభవించానంటే ,

నాకు అనిపిస్తుంది, చెరకు గడలు యంత్రంలో నలిగేటప్పుడు అనుభవించే బాధ ఇలాగే ఉంటుందేమో ! అని.

అందుకే ఎంత ప్రయత్నించినా మన మనస్సు మన మాట వినకపోతే, భగవంతుని శరణు వేడాలి అని పెద్దలు చెబుతారు.


అయితే పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు.

మట్టి కూజా కాలితేనే కదా గట్టి కూజా తయారయ్యేది.

గొంగళిపురుగు దశ తరువాతే అందమైన సీతాకోక చిలుక దశ వస్తుంది.

అలాగని నేనేదో సీతాకోకచిలుక దశకు వచ్చేశానని కాదు.

కష్టాలు వచ్చినప్పుడు ఎవరూ కూడా గాభరాపడకుండా ఉండాలి అని చెబుతున్నాను అంతే . .

కష్టాలు సుఖాల కొరకే.

కష్టాల వల్ల పూర్వపాపం ఖర్చయిపోతుంది. సుఖాలవల్ల పూర్వపుణ్యం ఖర్చయిపోతుందని పెద్దలు చెప్పారు కదా!

అయితే నా మనస్సు అంటే నాకు ఇష్టమే. దైవప్రార్ధన చేయాలంటే దాని సహాయం కూడా అవసరమే కదా !

అంతా దైవం దయ.

ఇక శరీరం .......దానిగురించి మాత్రం మనకేం తెలుసు.?

ఇలా ఆలోచించగా .... ఏం తెలుస్తుందంటే మన మనస్సు, శరీరం వేటిపైనా మనకు    అంతగా అడ్డూ, అదుపు, అధికారం .. లేవని అర్ధమవుతుంది.

మన శరీరంలో మనం శ్వాస తీసుకునే ప్రక్రియ కూడా మన ప్రమేయం లేకుండానే జరిగేటట్లు ముందే ఏర్పాటు చేయబడి ఉంది.

అందుకే కదా మనం నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.

ఎంత అద్భుతమైన దైవసృష్టో కదా ! అనిపిస్తుంది.

మన శరీరం అనబడేది ఆక్సిజన్, కార్బన్, వంటి కొన్ని ఎలిమెంట్స్ తో తయారుచేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా !

అంటే శరీరమంటే గాలి, నీరు ఇలాంటివేనన్నమాట.

మరి అందులో చైతన్యం ఎలా వస్తుందో ? జీవులు ఇన్ని పనులు ఎలా చేస్తున్నారో ?

అంతా అత్యంత ఆశ్చర్యం, అద్భుతం.
 
ఆధునిక శాస్త్రవేత్తలు శరీరంగురించి ఇలా చెబుతున్నారు.

Question: What Are the Elements in the Human Body?

Answer: Most of the human body is made up of water, H2O, with cells consisting of 65-90% water by weight. Therefore, it isn't surprising that most of a human body's mass is oxygen. Carbon, the basic unit for organic molecules, comes in second. 99% of the mass of the human body is made up of just six elements: oxygen, carbon, hydrogen, nitrogen, calcium, and phosphorus.

1. Oxygen (65%)
2. Carbon (18%)
3. Hydrogen (10%)
4. Nitrogen (3%)
5. Calcium (1.5%)
6. Phosphorus (1.0%)
7. Potassium (0.35%)
8. Sulfur (0.25%)
9. Sodium (0.15%)
10. Magnesium (0.05%)
11. Copper, Zinc, Selenium, Molybdenum, Fluorine, Chlorine, Iodine, Manganese, Cobalt, Iron (0.70%)
12. Lithium, Strontium, Aluminum, Silicon, Lead, Vanadium, Arsenic, Bromine (trace amounts)

Reference: H. A. Harper, V. W. Rodwell, P. A. Mayes, Review of Physiological Chemistry, 16th ed., Lange Medical Publications, Los Altos, 

California 1977.

శాస్త్రవేత్తలు చెప్పినట్లు శరీరం అంటే గాలి, నీరు అయితే మన పెద్దలు చెప్పినది కూడా అదే కదా ! అంతా మట్టి, గాలి, నీరు, అంతా మాయ.

ప్రాచీనులు చెప్పినదీ, ఆధునికులు చెబుతున్నదీ ఒక్కటిగానే అనిపిస్తున్నది కదా .. అంతా దైవం దయ....

(నేను వ్రాసినవి చదివి నాకు ఏవో సినిమా కష్టాలవంటి కష్టాలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి. దైవం నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు.  )

అయితే,

  ( ఈ రోజుల్లో చాలామంది జీవితంలో 90 శాతం మంచి ఉన్నా కూడా, మిగిలిన 10 శాతం లోటును గురించే ఆలోచిస్తూ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు కదా ! . నేనూ అలాగే.. ) .

....................

 ఈ  టపా  పాతదేనండి . 



21 comments:

  1. మనసు గురించి అర్థ చేసుకోవటానికే మనిషికి జీవిత మంతా సరిపోతుంది.మీ విశ్లేషణ బాగుంది.మీరు మెడిసిన్ చదివారా!మనకు రోజు 60,000 ఆలోచనలు వస్తాయట.ఆలోచనల సాంద్రత తగ్గించుకుంటే ఆ నిశ్శబ్దం లో మనకు మనం అర్థమవటం ప్రారంబిస్తాము.దానికి ప్రాణాయామం,ధ్యానం ఇలా ఎన్నో ప్రక్రియలు మన పెద్దలు చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నేను మెడిసిన్ చదువుదామనుకున్నాను కానీ చదవలేదండి.

      రోజు 60,000 ఆలోచనలు వస్తాయంటే ఆశ్చర్యంగా ఉంది. అవునండి , ధ్యానం, చేయటం వల్ల మనస్సు తేలిగ్గా ఉంటుంది.

      Delete
  2. మన మనసే మన మాట వినదు, మరెవరో వినలేదనుకోడం తప్పే

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      " మన మనసే మన మాట వినదు, మరెవరో వినలేదనుకోడం తప్పే " ఇది ఎంతో నిజమండి.

      మనస్సును జయించటం సాధ్యమైతే ఎంతో మనశ్శాంతి లభిస్తుందని పెద్దలు అంటారు. నేను కూడా మనస్సును జయించాలని ప్రయత్నిస్తూ .... ఉన్నాను. ఎప్పటికి సక్సెస్ అవుతానో తెలియదు.

      Delete
  3. అద్భుతంగా వ్రాశారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నాకు తెలిసింది తక్కువ. ప్రాచీన కాలం నుంచీ ఇప్పటి వరకు ఎందరెందరో మహానుభావులు మనకు అందించిన విషయాలు అనంతం.

      ఆ అనంతవిజ్ఞానరాశి లోని అతి కొద్ది విషయాల గురించి నాకు తోచిన అభిప్రాయాలను అందరికీ చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అంతేనండి. అంతా దైవం దయ.


      Delete
  4. శరీరం ఆవిర్భావించేది, సమసిపోయేది అంతా మట్టి, గాలి, నీరు తోటే. ఇంత తెలిసీ కూడబెట్టాలనే కోరిక ఎందుకొస్తుందో !

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      " శరీరం ఆవిర్భావించేది, సమసిపోయేది అంతా మట్టి, గాలి, నీరు తోటే. ఇంత తెలిసీ కూడబెట్టాలనే కోరిక ఎందుకొస్తుందో ! " ఇది ఎంతో నిజమండి.

      కొందరు ఇతరులను మోసం చేసి కూడా తరతరాలవరకూ కూడబెడుతుంటారు. వాళ్ళలో కొందరికి తాము చేసేది తప్పని తెలిసి కూడా , మనస్సును అదుపులో పెట్టుకోలేక అలా ప్రవర్తిస్తుంటారు.

      మనస్సును జయించటం సాధ్యమైతే ఎంతో మనశ్శాంతి లభిస్తుందని పెద్దలు అంటారు. నేను కూడా మనస్సును జయించాలని ప్రయత్నిస్తూ .... ఉన్నాను. ఎప్పటికి సక్సెస్ అవుతానో తెలియదు.

      Delete
  5. /ప్రాచీనులు చెప్పినదీ, ఆధునికులు చెబుతున్నదీ ఒక్కటిగానే అనిపిస్తున్నది కదా !/
    కొంతవరకూ అంతే, అంతా కాదు.
    గాలి అంటే మిశ్రమము, ఏది ఎన్ని పాళ్ళు అని ప్రాచీనులు చెప్పలేదు. ప్రాచీనులు చెప్పిన పంచభూతాల్లో ఆకాశము అనేది ఓ మూలకం కాదు అని గుర్తించాలి. ఆధునికులు ఏది ఎంత శాతం అని ఎస్టిమేట్ చేశారు, ప్రాచీనులు చేయలేదు, బహుశ ఇన్ని రకాల వాయువులున్నాయన్నది కూడా వారికి తెలియదేమో.
    ఈ విషయంలో కెల్విన్ అన్న మాటలు గుర్తు చేసుకోతగ్గవి: "I often say that when you can measure what you are speaking about, and express it in numbers, you know something about it; but when you cannot measure it, when you cannot express it in numbers, your knowledge is of a meagre and unsatisfactory kind;" - Lord Kelvin(1824-1907), British Physicist.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఆధునికులు శరీరం వరకు కొంతవరకు చెప్పగలరు. మనస్సు, బుద్ధి, ఆత్మ వీటి గురించి ఆధునికులకు తెలిసింది చాలా తక్కువ.

      పూర్వీకులు మనస్సు , ప్రాణం....మొదలగువాటి గురించి కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది. అయితే అవన్నీ మనకు అర్ధం కావు కాబట్టి మనకు తెలియటం లేదు.

      " అణువు మొదలు మానవుడి వరకు జీవరాశుల సృష్టికంతకూ కావలసిన ఎనిమిది మూలతత్వాలు ; మన్ను, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, వ్యక్తిత్వం,( అహంకారం)" ....అని

      గీతలో ( విజ్ఞాన యోగము లోని నాలుగవ శ్లోకము) ..చెప్పటం జరిగిందని "ఒక యోగి ఆత్మ కధ" గ్రంధంలో ఉంది.


      ఆధునికులు మన్ను, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వరకు కొంత తెలుసుకోగలిగారు. ఆకాశం అంటే " ఈధర్" అని కొంతవరకు తెలుసుకోగలిగారు.


      ఆకాశం తరువాత....మనస్సు, బుద్ధి, వ్యక్తిత్వం, ( అహంకారం )..గురించి ఆధునికులకు తెలిసింది చాలా తక్కువ.

      Delete

    2. ప్రాచీనులు చెప్పినదీ, ఆధునికులు చెబుతున్నదీ ఒక్కటిగానే అనిపిస్తున్నది అంటే , శరీరం గాలి, నీరు వంటి వాటితోనే నిర్మించబడింది.... అనే విషయంలో పోలికలు కనిపిస్తున్నాయి అన్నది నా అభిప్రాయమండి.

      ఏది ఎన్ని పాళ్ళు అని చెప్పటానికి ప్రాచీనులు వారి పద్ధతిలో వారు ( కొన్ని తత్వాలతో కూడినట్లు ) స్పష్టంగానే చెప్పారు. ( ఆక్సిజన్, నైట్రోజన్ ఇలా చెప్పకపోయినా ) .

      అయినా ఆధునికులు చెప్పిన పాళ్ళ సంగతి నూటికినూరుపాళ్ళు కరెక్ట్ అని ఎవరికి తెలుసు ? శాస్త్రవేత్తల అభిప్రాయాలలో మార్పులు చేర్పులు జరగటం, వారిలో వారికే సిద్ధాంతాల విషయంలో అభిప్రాయబేధాలు ఉండటం చూస్తూనే ఉన్నాం కదా ! ఎవరు చెప్పింది కరెక్టో మనకెలా తెలుస్తుంది ?


      ఉదా....ఆధునిక శాస్త్రవేత్తలు ఆక్సిజన్ లేకుండా జీవులు జీవించలేవు అని బలంగా నమ్మేవారు. ఈ మధ్య ఆక్సిజన్ లేకుండా జీవించే జీవులను కనుగొనటం వల్ల వారి అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చింది.

      Delete

    3. విష్ణుపురాణంలో మొత్తం 84లక్షల జీవరాశుల గురించి చెప్పబడింది. ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా, అమీబా నుండి మానవుని వరకు ఇంచుమించు ఇదే సంఖ్యలో జీవరాశులు ఉన్నట్లు చెప్పబడుతూ ఉంది.
      ఇందులో..
      స్థావరములు.......20 లక్షల రకాలు.
      జలచరులు,....,9 లక్షల రకాలు..
      కూర్మములు......9 లక్షల రకాలు...( ఉభయచరములు )
      పక్షులు.........10 లక్షల రకాలు..
      పశువులు.......30 లక్షల రకాలు..
      వానరములు........4 లక్షల రకాలు..
      మానవులు.........మిగిలిన 2 లక్షల రకములని వివరణ ఉంది. ఇంకా చరకుడు, సుశ్రుతుడు, పాణిని, పతంజలి, ప్రశస్తపాదుడు మొదలగు ఎందరో ప్రాచీన రుషులు " జీవరాశులను " వర్గీకరించారు.
      ఈ వివరములు " భారతీయ ప్రతిభా విశేషాలు 108 నిజాలు " గ్రంధం నుండి సేకరించినవి.
      ...............................

      గ్రహములు గురించీ, , గ్రహముల మధ్య ఇన్ని యోజనాల దూరం అని కూడా పూర్వ గ్రంధాలలో స్పష్టంగా ఉంది. ఆధునికుల లెక్క ప్రకారం చూస్తే పూర్వీకులు చెప్పిన దూరం సరిపోయిందట.

      పూర్వీకులు చెప్పే కొన్ని విషయాలు స్పష్టంగా ఉండవు. స్పష్టంగా అన్నీ చెప్పేస్తే దురాశాపరులు ఎవరైనా ఆ విజ్ఞానాన్ని దుర్వినియోగించి, లోకానికి హాని కలిగించే అవకాశం ఉందని వారి అభిప్రాయం అయి ఉంటుంది.

      ఇప్పుడు చూస్తున్నాము కదండి... ఆధునిక సైన్స్ ను కూడా కొందరు దుర్వినియోగిస్తున్నారు.

      మనుషుల అత్యాశ వల్ల ఓజోన్ పొర కరిగిపోతోంది.
      రాబోయే తరాల వాళ్ళకు సహజవనరులు మిగలని పరిస్థితి వస్తోంది.

      Delete
    4. మీ వ్యాఖ్య చదివిన తరువాత నాకు చిత్రమైన ఆలోచనలు వచ్చాయండి.

      కొందరు కొద్దిగానే ఆహారం తీసుకున్నా కూడా , అనారోగ్య కారణాల వల్ల శరీరంలో నీరు ఎక్కువగా ఉండి , లావుగా కనిపిస్తారు.
      గర్భిణీ స్త్రీలలో కూడా కొందరికి పాదాలకు నీరు ఎక్కువగా వస్తుంది.

      ఇవన్నీ గమనిస్తే వ్యక్తుల శరీరాల్లో ఆక్సిజన్..... వంటివి ఉండే పాళ్ళలో కూడా వ్యక్తుల మధ్య తేడాలు ఉండే అవకాశం ఉంటుందనిపించింది.

      ఇతరలోకాల్లోని వాళ్ళు కేవలం సంకల్పశక్తితో సృష్టిని చేయటం గురించి కూడా ప్రాచీనులు చెప్పటం జరిగింది.

      .. ఎక్కువ వ్యాఖ్యలు రాశాను...ఇవన్నీ ఒకే వ్యాఖ్యగా రాస్తే పెద్దగా అయిపోతుందని ఇలా రాసాను.. దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.

      Delete
    5. మీకు ప్రాచీనుల మీద వున్న అభిమానం హర్షింపతగ్గదే, కానీ ... మరీ...
      /పూర్వీకులు చెప్పే కొన్ని విషయాలు స్పష్టంగా ఉండవు. ఆ విజ్ఞానాన్ని దుర్వినియోగించి, లోకానికి హాని కలిగించే /
      అయ్యుండచ్చు, చెప్పడానికి వాళ్ళకే తెలియక పోయివుండచ్చు, తెలిసినా పూర్తిగా అర్థమయి వుండక ఇలా సాకులు వెబుతుండవచ్చు.
      /వారిలో వారికే సిద్ధాంతాల విషయంలో అభిప్రాయబేధాలు ఉండటం చూస్తూనే ఉన్నాం కదా ! ఎవరు చెప్పింది కరెక్టో మనకెలా తెలుస్తుంది ?/
      అలానే వుండాలి, గాలి కబుర్లు చెప్పినవన్నీ నమ్మకపోయావో నరకంలో పడి పోతావు, దుర్వినీయోగం చేస్తావు వెధవా, అని గద్దించడాన్ని సైన్సు విశ్వసించదు. కరక్ట్‌గా చెప్పారు. మీతో ఏకీభవిస్తున్నా.
      /ఆకాశం అంటే " ఈధర్" అని కొంతవరకు తెలుసుకోగలిగారు./
      శూన్యంలో ఈథర్ అనే వాదన ఎప్పుడో న్యూటన్ కాలంలోనే పోయిందిగా! శూన్యంలో ఈథరు వుండదు. కెమిస్ట్రీలో ఈథర్ అంటే ఓ Organic compound family
      /ఇతరలోకాల్లోని వాళ్ళు కేవలం సంకల్పశక్తితో సృష్టిని చేయటం గురించి కూడా ప్రాచీనులు చెప్పటం జరిగింది./
      అహా, 18వ శతాబ్దంలో లెవోఇజె అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త అలాంటి సంకల్పాలతో సృష్టించడం కుదరదు అని ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడట, ఇప్పటికీ ఆ రూల్ చెల్లుబాటవుతోంది. అలాంటి సంకల్పాలు ఇప్పుడుంటే, కరెంటు, గ్యాసు సిలిండర్, పెట్రోలు, బంగారు ధరలిలా పెరిగేవా!

      మీ ఆలోచనలు చిత్రమైనవైనా బాగున్నాయి, ఆలోచించడం వైజ్ఞానికుల లక్షణం.

      Delete

    6. మీ అభిప్రాయాలు చాలా చిత్రంగా ఉన్నాయి.

      పూర్వీకులవిజ్ఞానం యొక్క గొప్పదనం గురించి వివరించే కొన్ని గ్రంధాల పేర్లు కూడా నేను ఇంతకుముందు టపాల్లో వ్రాసాను. మీరు అవి చదివితే పూర్వీకులను ఇంతలా తక్కువచేసి మాట్లాడరు.

      ఆధునిక సైన్స్ను అభివృద్ధి చేసిన వాళ్ళందరూ నాస్తికులు కాదండి.

      ఆధునిక విజ్ఞానం వల్ల ప్రపంచానికి కొన్ని ఉపయోగాలు జరిగినమాట నిజమే కానీ...నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి.

      గ్లోబల్ వార్మింగ్ , ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, ప్లాస్టిక్ వంటి ఆధునిక ప్రయోగాల వల్ల కాలుష్యం, సెల్ టవర్స్ కాలుష్యం, అణుభయం,....ఇవన్నీ ఆధునిక విజ్ఞానం అందించిన కష్టాలే. ముందు ప్రపంచం వీటిబారి నుంచీ బయటపడే మార్గం చూసుకోవాలి.

      ప్రపంచంలో కోట్లాది ప్రజలు తిండిలేక చస్తుంటే , నిరుద్యోగం పెరిగి , ఉన్న ఉద్యోగాలు పోతుంటే, అభివృద్ధి ఎక్కడుందో అర్ధం కావటం లేదు.

      నేను చెప్పిన ఈధర్ కెమిస్ట్రీలోది కాదండి. సంకల్పశక్తితో సృష్టిని చేయటం గురించి, ఆకాశంలో ఏముందో ......అనే విషయాల గురించి చెప్పే స్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.

      జన్మలు, పునర్జన్మల గురించి పరిశోధనలు చేసి నిజమని చెప్పిన ఇయాన్ స్టీవెన్సన్... అన్న ఆయన సైన్స్ గురించి ఎంతో బాగా తెలిసిన వారే.

      ప్రాచీన భారతీయవిజ్ఞానం యొక్క గొప్పదనాన్ని ఎందరో విదేశీయులు మెచ్చుకుంటుంటే మన దేశీయులు వ్యతిరేకించటం అత్యంత దురదృష్టకరం.

      కరెంట్, గ్యాస్, పెట్రోల్, ఖనిజాలు......ప్రపంచదేశాల మధ్య పోటీ... .ఈ సంబరాలు ఎంతకాలం లెండి. ఈ నిల్వలన్నీ అయిపోయాక అన్ని దేశాల వాళ్ళు మళ్ళీ పాతకాలంలో లాగా జీవించాల్సిందే..

      Delete
  6. మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని .....
    చక్కటి విషయాన్ని ప్రస్తావించారు. మీ విశ్లేషణ బాగుంది. అభినందనలండి.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఏదో నాకు తెలిసినంతలో వ్రాస్తున్నాను.
      అంతా దైవం దయ.

      Delete

  7. కృతజ్ఞతలండి.
    మీకు మరియు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలండి.

    ReplyDelete
  8. మీరు నా మాటలు అపార్థం చేసుకున్నారు. ప్రచీనులు ఆ కాలానికి తగ్గట్టు ఏవో వూహించడం ద్వారా శాస్త్రీయంగా ఆలోచించడానిక్, అవి ఎంతవరకు వాస్తవం అని నిరూపించడానికి పునాదులు వేసి, దారి చూపారు. ప్రాచీనులు అంటే ఏ శతాబ్దానికి ముందు వారని మీ అర్థం? 17వ శతాబ్దం అనుకోవచ్చా?
    మీరు ప్రస్తుత ప్రపంచంలోని దైందిన సమస్యలను(నిరుద్యోగం, ధరలు, ఆర్థిక మాంద్యం, అవినీతి, 2G, Coalgate) ఆధునికుల ఆలోచనా విధానానికి ముడివేసి చూడటం సరి కాదు. వీటన్నిటిని కలిపి ఆలోచించే ముందు, ఆ కాలంలోని ఆ డాటా అంటే జనాభా లెక్కలు, వైద్యం అవీ కూడా చూడాలి. లెక్కలు సేకరించాలనే ఆలోచనే అప్పట్లో లేదు. మెడిసన్‌లో ఇన్ని రోగాలు అప్పటికి తెలియను కూడా లేదు.
    /ప్రాచీన భారతీయవిజ్ఞానం యొక్క గొప్పదనాన్ని ఎందరో విదేశీయులు మెచ్చుకుంటుంటే మన దేశీయులు వ్యతిరేకించటం అత్యంత దురదృష్టకరం/
    విదేశీయులు మెచ్చుకుంటే గొప్పది, లేదంటే పనికిమాలినది అనుకోవడం బాగోలేదు. Walmart ను దేశంలో అనుమతిస్తే దేశంలో ఆర్థిక సంస్కరణలు చేసినట్టు, లేదా ఆర్థిక తిరోగమనమే అని అమెరికా వాడంటే, మనం ఆహా ఔనౌను అనాలా?! ఇదీ అంతే, ఆలోచనలు ఎవరివైనా శాస్త్రీయంగా ఆలోచించి బేరీజు వేయాలి. మన ప్రాచీనులు, విదేశేఎయులు చెప్పారు( అక్కడికి తెల్లోళ్ళు చెబితే వేదమయినట్టు! తెల్లోళ్ళలో ఎదవలుండరా ఏమిటి?!)
    /ఈ నిల్వలన్నీ అయిపోయాక అన్ని దేశాల వాళ్ళు మళ్ళీ పాతకాలంలో లాగా జీవించాల్సిందే../
    ఏమో.. ప్రత్యమ్నాయ వనరులకోసం చూస్తున్నాము, సౌరశక్తి, అణుశక్తి, ఇలా... పాతకాలంలోలా జీవించటానికి వనరులు చాలవు, మరో బ్లాగరు చెప్పినట్టు కుజ గ్రహం వెళ్ళాల్సివస్తుందేమో. :) కుజుని మీద 'దరణీగర్భ సభూతం..' అని స్త్రోత్రం చేసింది మా ప్రాచీనులే అని మీరు అనరా ఏమిటి? :))

    ReplyDelete
  9. ఈ రోజు పనివత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడే బ్లాగ్ చూస్తున్నానండి. మీకు రిప్లై ఇవ్వటం ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete
  10. ప్రాచీనత అంటే వేద కాలం . వేదాలు ఎప్పటివో నాకు తెలియదండి. వేదాలలో ఎంతో విజ్ఞానం ఉంది. ఉదా...ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, ఆయుర్వేదం, రసాయనిక శాస్త్రం,....... ఈ శాస్త్రాలలోని విజ్ఞానం ఊహించటం వరకే ఆగలేదండి . ఎంతో చక్కటి విజ్ఞానం ఉంది.
    .....................................
    ఆయుర్వేదంలో మనిషి ముఖాన్ని గమనించి రోగాన్ని చెప్పగలిగే విధానం కూడా ఉంది. ఇప్పటిలా ఒక్కొక్క అవయవానికి ఒక్కో డాక్టర్ వద్దకు వెళ్ళటం కాకుండా , శరీరం మొత్తం ఒకటే అని వైద్యం చేసేవారు.
    .............................................

    విదేశీయులు మెచ్చుకుంటే గొప్పది, లేదంటే పనికిమాలినది...అని నేను అనుకోవటం లేదండి. అలా అనుకునే జనాలు ఈ దేశంలో ఎందరో ఉన్నారు కదా ! అని...
    ......................
    మిగతా రకాల విద్యుత్ కన్నా సౌరవిద్యుత్ ఎంతో మంచిది. అయితే, చాలామంది విద్యుత్ ఉంటే చాలు. ఇక భవిష్యత్తులో సమస్యలేమీ ఉండవు అనుకుంటున్నారు.

    కానీ, .... ఖనిజాలను ఇలాగే ఖాళీ చేసుకుంటూ పోతే మరో వందేళ్ళకి ఖనిజసంపద అయిపోతే, వస్తువులను ఏ పదార్ధంతో తయారు చేస్తారన్నది ఎవరూ మాట్లాడటంలేదండి.

    వస్తువులు తయారుచేసే మెటీరియల్ లేనప్పుడు విద్యుత్ ఉన్నా ఉపయోగమేమిటి ? అన్నది నా అభిప్రాయం.
    .............................................

    అదేదో సామెత చెప్పినట్లు, ఇతరగ్రహాలకు వెళ్ళి వచ్చే అంత సంపద ప్రపంచ దేశాల వద్ద , ప్రజల వద్ద ఉంటే ప్రపంచం ఇలా ఆర్ధిక మాంద్యంలో ఎందుకు కూరుకుపోతుందండి.

    బోలెడు ఖర్చుపెట్టి ఇతరగ్రహాలకు యాత్రలు చేసే బదులు ఆ సొమ్ముతో భూమిపై ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

    ReplyDelete