koodali

Monday, September 10, 2012

మొక్కలు, లోహాలకు కూడా ఫీలింగ్స్ ఉండటం గురించి, మరియు కొన్ని విషయాలు.


*  " ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధంలో  సైన్స్ కు  సంబంధించి  ఎన్నో  వివరాలున్నాయి. 
 
* మొక్కలు,  లోహాల  గురించిన  ఎన్నో  వింతైన  విషయాలను  భారతీయ  సుప్రసిద్ధ  శాస్త్రవేత్త   జగదీశ్ చంద్ర బోసు ,  తాను  చేసిన  ప్రయోగాల  ద్వారా  నిరూపించారు. ...

కొన్ని  విషయాలు...

బోస్ గారు   క్రెస్కో గ్రాపు  అనే  పరికరాన్ని  కనిపెట్టారు.  ఆ  పరికరం  ద్వారా  ,  ఎవరైనా బాధించినప్పుడు  ....  మొక్కలు  ,  లోహాలు   కూడా  బాధను  అనుభవిస్తాయని   వెల్లడి  చేసారు.

 
*లోహాల్లో  జీవశక్తి  బయటనుంచి  కలిగే  ప్రేరణలను  బట్టి  అనుకూలంగా  గాని,  ప్రతికూలంగా  గాని  ప్రతిక్రియలు  చూపిస్తుంది.
 
*బోస్  క్రెస్కో గ్రాపుకు ,  ఉన్నదాన్ని  కోటిరెట్లు  పెద్దగా  చేసి  చూపించే  బ్రహ్మాండమైన  శక్తి  ఉంది.  సూక్ష్మదర్శిని  అయితే  కొన్నివేల  రెట్లు  మాత్రమే  పెద్దగా  చేసి  చూపిస్తుంది.
 
*" లోహాల్నీ ,  మొక్కనూ,  జంతువునూ  ఒకే  సామాన్య  సూత్రం  కిందికి  తేవడానికి  సార్వత్రికమైన  ప్రతిచర్య  ఒకటి  పనిచేస్తున్నట్లు  కనిపిస్తుంది.
 
*బోసు  మహాశయులు  ఫెర్న్  మొక్కకు  ఒకచోట  , పదునైన  పరికరం  ఒకటి  గుచ్చారు;  వెంటనే  ఆ  మొక్క  గిలగిలా  కొట్టుకోడంతో  ఎంత  బాధపడుతోందో  తెలిసింది.
కాడలో  కొంతమేరకు  ఆయన  కత్తి  గుచ్చేసరికి  మొక్క  విపరీతంగా  విలవిల్లాడిపోతున్నట్టు   నీడలో  కనిపించింది.
 
*ఆయన  విష  సంబంధమైన   ఒక  రసాయనాన్ని  తగరానికి   పూసారు.  ఒక  పక్క  తగరపు  ముక్క  కొన  విలవిల్లాడుతూ  ఉండగా  పట్టికమీదున్న  ముల్లు  చావు  కబురు  చల్లగా  చెప్పింది.
 ...............
*  మొక్కలు,  లోహాల  గురించి  మరిన్ని  విషయాలు  తెలుసుకోవాలంటే "  శ్రీపాద శ్రీ వల్లభ  సంపూర్ణచరితామృతము "  గ్రంధంలో   మరిన్ని  వివరములున్నాయి.
 ...............

"భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు ." పుస్తకంలో  కూడా  ఈ  శాస్త్రవేత్త   గురించి  వివరాలు  ఉన్నాయి.

 కొన్ని  విషయాలు.... 
 
*సెల్ ఫోన్లు,  రేడియోలు,  టీవీలు ,  శాటిలైట్లు, చివరకు  బ్లూటూత్  వ్యవస్థలన్నీ  వైర్ లెస్ విధానం  ఉపయోగించే  పనిచేస్తున్నాయి. 

  *.. ఈ  విధమైన  తంత్రీరహితమైన  ( Wireless  )  ప్రసారపద్ధతిని    ముందు  కనుగొన్నది  భారతీయుడైన  సుప్రసిద్ధ  శాస్త్రవేత్త ' జగదీశ్  చంద్రబోస్  '. 


*  క్రీ.శ.1896,సెప్టెంబర్21న  బోస్  ఇంగ్లండ్ లో  రాయల్ ఇన్ స్టిట్యూట్ లో  ఒక  ప్రదర్శన,  ప్రసంగం  ఇచ్చారట.
..............................
 
* మొక్కలు,  లోహాలకు  కూడా  ఫీలింగ్స్  ఉండటం ....  వంటి   విషయాలు  వింటే   చిత్రంగానే   ఉంటుంది.


ప్రపంచంలో  మనకు  తెలిసింది   సముద్రంలో  నీటిబొట్టంత  మాత్రమే. మనం  నమ్మశక్యం  కాని  వింతలెన్నో   సృష్టిలో   ఉన్నాయి.
 
*"Matter and energy cannot be created or destroyed"  అని    శాస్త్రవేత్తలు  చెప్పే  విషయాన్ని  బట్టి  చూసినా ..  పదార్ధం , శక్తి ,యొక్క రూపం  మారుతుంది  .. అంతేకానీ,    పదార్ధాన్ని ,శక్తిని,   సృష్టించలేము , నశింపజెయ్యలేము....అని  తెలుస్తుంది.  

  ఉదా...నీరు  ఆవిరిగా  మారుతుంది ... ఆవిరి  మరల  నీరుగా  మారుతుంది  .  

  * పదార్ధానికే  పుట్టుక , నశించటం  అనేవి  లేనప్పుడు , పదార్ధాన్ని  సృష్టించిన  దైవం  ఆద్యంతాలు  లేని   నిత్యశక్తి .... అని  పెద్దలు  చెప్పిన  మాట  నిజమని  తెలుస్తోంది    కదా  ! 
...............
 
* బోస్  గారి   గురించి  కొన్ని     వివరాలు  ఈ లింకులో ఉన్నాయండి.... Jagadish Chandra Bose - Wikipedia, the free encyclopedia

..........................

మొక్కలు, పశుపక్ష్యాదులు మూగజీవులు. వాటి భావాలు మనకు సరిగ్గా అర్ధం తెలియవు. పశుపక్ష్యాదుల భావాలు మనకు చాలావరకూ తెలుస్తాయి. మొక్కలకు, మనుషులకు..  నెప్పి విషయంలో బాధపడే స్థాయిలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాలు సరిగ్గా అర్ధం కావట్లేదు. ఇక లోహాల సంగతి అర్ధం కావటం మరీ కష్టం.


* జుత్తును, గోర్లను కత్తిరిస్తే బాధ  ఉండదు. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినా ఎక్కువ బాధ ఉండదు. అలా మొక్కలకు ఎక్కువ బాధ ఉండదేమో? అని కొందరి అభిప్రాయం. ఇవన్నీ సరిగ్గా అర్ధంకాని విషయాలు.... ఆధునిక వైజ్ఞానిక పరికరాలకు కూడా  సరిగ్గా అంతుబట్టని  విషయాలు ఎన్నో ఉన్నాయి.


* భూమి ఒక పరీక్షా లోకం.ఇక్కడ కష్టాలు, సుఖాలు రెండూ ఉండే విధంగా సృష్టి ఉంది. ఇది ఒక ఆటస్థలం, నాటకరంగం వంటిది కూడా కావచ్చు. మనకు అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవానికే తెలుస్తాయి.

 

15 comments:


  1. వనజ గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీరు నన్ను మేడం అని పిలవటం మాత్రం బాగోలేదు.

    ReplyDelete
  2. మంచి విషయాలను తెలియ జేస్తున్నారు.
    సూర్యచంద్ర గోళ్ల

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను.. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.




      Delete
  3. I had this book with me for few years
    somehow postponed reading it
    I just finished reading that book
    A"MUST READ" book for every body
    Masterpiece in literature.
    How i let it lie in mylibrary all these years !!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

      గొప్ప గ్రంధాలు ఇంట్లో ఉన్నా కూడా చదవటానికి కొన్నిసార్లు అశ్రద్ధ వహిస్తాము. ఇలాంటి గ్రంధాలు అందరూ తప్పక చదవాలి.

      చదివిన తరువాత వాటి గురించి మరికొందరికి తెలియజేయటం వల్ల మరి కొందరు చదువుతారు.

      Delete
  4. మీ బ్లాగ్ లో వ్రాసిన చాలా మంచి టపాలలో
    ఇది ఒకటి... చాలా విషయాలు తెలియజేసారు...
    ధన్యవాదాలు...
    కాకుంటే మీ పేరే సస్పెన్స్...:-)
    నాకు పేరుతొ సంబోదిస్తూనో...
    లేకుంటే...
    ఆఖర్న పేరుతొ ముగించడమో అలవాటు.
    ప్రతిస్పందనలో మీ పేరు వ్రాసేయండి సార్!..:-))
    (వనజగారికి ఇచ్చిన ప్రతిస్పందన చూసి.)
    @శ్రీ

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

      నిన్న వనజ గారి వ్యాఖ్యను చూసిన తరువాత , నాకు చాలా సంతోషం అనిపించింది.

      అయితే, మేడం అనటం కన్నా, సింపుల్ గా పేరుతో పిలిస్తే బాగుంటుంది కదా ! అనిపించి అలా రాసాను.

      * అంతేకానీ, ఈ విషయం గురించి నేను ఇంత దూరం ఆలోచించలేదండి.

      నా పేరు అనూరాధ. అయితే, పూర్తి పేరు కన్నా , anrd అనటం తేలిగ్గా ఉంటుందని బ్లాగ్ మొదలు పెట్టినప్పటి నుంచి anrd అనే వ్రాసానండి.

      Delete
  5. చాలా ఆశక్తికరమైన విషయాలను తెలియజేసారండీ..ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies

    1. సుభగారు , మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

      Delete
  6. చాలా బాగుంది. మీ పేరు చెప్పేసి ఇబ్బంది పెట్టినందుకు మీరే మన్నించాలి. ఆలస్యంగా స్పందించా.

    ReplyDelete
  7. అయ్యో ! మన్నించండి వంటి మాటలు అనవద్దండి. ఇందులో ఏముంది లెండి.


    ఎవరైనా మనల్ను పొగిడితే మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ... అందుకే అలా వ్యాఖ్య రాసాను.

    వనజగారు నన్ను అపార్ధం చేసుకున్నారో ఏమిటో ? అప్పటికి తోచింది గబగబా రాసేసాను. నేను ఇవన్నీ ఆలోచించలేదు.

    ReplyDelete
  8. ఓ ఇరవై సంవత్సరాలైవుంటుంది, ఈ పుస్తకం చదివి, మంచి విషయాలు గుర్తుచేసినందకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  9. ఒక యోగి ఆత్మ కథ చాలా అద్భుతంగా ఉంటుంది.అలాగే బోస్ గారిపై radio ఉపన్యాసం ఇవ్వటానికి సేకరించిన సమాచారం చాలా ఆసక్తికరం.వాస్తవానికి ఆయన కనుగొన్న ఒక అంశానికి patent తీసుకుని ఉంటె ఆయనకు nobel prize వచ్చేది.సైన్సు అందరిది అని వద్దనుకున్నాడు.మీరు కూడా చాలా మంచి విషయాలు తెలియజేసారు.

    ReplyDelete
  10. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    కొద్దిసేపటి క్రితమే పాత టపాలు చూస్తున్నప్పుడు , మీ వ్యాఖ్యను చూశానండి. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete