మానవులకు అనేక కోణాలనుంచి ఆలోచించే శక్తి ఉండటం ఒక రకంగా వరం.........ఒక రకంగా శాపం కూడా....
అంటే మన ఆలోచనల ద్వారా మనము జీవితాన్ని బాగూ చేసుకోవచ్చు....అలాగే పాడూ చేసుకోవచ్చు.
ఉదా...మహాభారతంలో.... ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు. వారు పాచికలాటలో రాజ్యాన్ని పోగొట్టుకోవటం .. మనకు తెలిసిన విషయాలే కదా !
ఆ సంఘటన ద్వారా ఎంత గొప్పవారైనా సరే.......... చిన్న పొరపాటు చేసినా కష్టాలను అనుభవించే అవకాశం ఉంది ........ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పబడింది.
దీని ద్వారా ఒక వ్యక్తి ఎలా ఆలోచించవచ్చంటే........ధర్మరాజంతటి వారే ఒక చిన్న సంఘటన వల్ల అన్ని కష్టాలు అనుభవించినప్పుడు , మనం జీవితంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ...... అలా ఆలోచించి ఆ కధవల్ల జీవితాన్ని సరి దిద్దుకుంటారు కొందరు.
మరి కొందరేమో........... ధర్మరాజంతటి వారే జూదం ఆడటం జరిగింది కాబట్టి సామాన్యవ్యక్తిని నేను ఆడితే తప్పేమీ లేదు అని ఆలోచిస్తారు. ............. ఇలా ఆలోచించి తన వ్యసనాన్ని సమర్ధించుకోవటానికి ప్రయత్నిస్తారు. ......... ఇలా ఆలోచిస్తూ తమ కష్టాలను తామే కొని తెచ్చుకుంటారు.
ఇలా ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లో ప్రతిఒక్కరూ ........ అవకాశవాదంతో ............ ధర్మాన్ని ...... తమకు అనుకూలంగా మార్చి చెప్పుకుంటే ఎవరుమాత్రం ఏం చెయ్యగలరు ?
ఆలోచన అన్ని వైపులా పదునున్న కత్తిలాంటిది. అది వాడుకునేవాళ్ళను బట్టి ఉంటుంది.కత్తితో కూరగాయలూ తరుగుకోవచ్చు........ఇతరుల తలకాయలూ నరకవచ్చు..
అందుకని నాకు ఏమనిపిస్తుందంటే, ఎవరి కర్మ ప్రకారం వారి ఆలోచనలు ఉంటాయి.
బాగుపడేరాత ఉన్నవాళ్ళను ఎవరూ చెడగొట్టలేరు. చెడిపోయేవారిని ఎవరూ బాగుచేయలేరు.
ఒకోసారి కొన్ని సంకటపరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. భగవంతుని మేధాశక్తి అపరిమితం ......... మన ఊహకు కూడా అందదు. మానవుల మేధాశక్తి పరిమితం.
అందుకే సంకటపరిస్థితి వచ్చినప్పుడు మనకు చేతనయినంతలో ప్రయత్నించి ఇక మనలను సరి అయిన దారిలో నడిపించమని ఆ దైవాన్ని కోరటమే మనం చేయగలిగింది.
.....................................
ధృతరాష్ట్రునికి పాచికలాటకు పాండవులను పిలవటం అంతగా ఇష్టం లేకపోయినా, పుత్రప్రేమను అణచుకోలేక ఒప్పుకున్నాడు. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించారు.
ధర్మరాజుకు పాచికలాట ఆడటం ఇష్టం లేదు. అయితే, పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుని ఆహ్వానం మేరకు , ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించకూడదని వచ్చి, పాచికలాట ఆడటం జరిగింది.
ఈ విషయాలు ఈ లింక్ ద్వారా చదువవచ్చు..... మహా భారతము
(తెలుగు )

మ౦చి టపా వ్రాశారు కాని, చివరి లో కర్మ అని చెప్పడ౦ కొరుకుడు పడట౦ లేదు .. మిగతా వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొ౦దా౦ :)
ReplyDeleteప్రతీ విషయానికి రెండువేపులూ (మీరు అన్నట్లు పదునైన కత్తి) ఉంటాయి.
ReplyDeleteఉదా:US లో లాస్ వెగాస్ లో జూదం ఒక వృత్తి. చాలా మంది బ్రతుకు తెరువు ఆ వూళ్ళో దానిమీద ఆధార పడిఉంటుంది. అప్పులున్న వాళ్ళూ లేని వాళ్ళు అక్కడికి "ఆనందం" కోసం వస్తారు.
మనం వెళ్ళాక పోతే వారి జీవనోపాధి పోతుంది. వెళ్తే మన అప్పులు పెరుగుతాయి. అదృష్టముంటే మనకి డబ్బులు కూడా రావచ్చు.
ఈ రెండిట్లో ఏది చెయ్యాలి? అదే మన ఇంగిత జ్ఞానం పట్టి వుంటుంది. కొందరు అక్కడికి వెళ్తారు.కొందరు వెళ్ళరు. నా ఉద్దేశం లో అదే మన ఖర్మ. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
ధన్యవాదాలండి.
ReplyDeleteప్రపంచంలో జరిగే సంఘటనలు చూస్తుంటే ఎవరి కర్మ ప్రకారం వాళ్ళ జీవితాలు నడుస్తాయి అనే అనుకోవలసి వస్తుంది.
ఇప్పుడు నల్ల డబ్బు కధలు వింటున్నాము కదా ! ఇలాంటి పనులు చేయటం వల్ల కష్టాలు వస్తాయని తెలుసు. అయినా తెలిసీతెలిసీ....... ఇలాంటి పనులే చేస్తూంటారు.
ఇంకా పేపర్లో చూస్తే ఎన్నో ఆకస్మిక మరణాల వార్తలు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయో 1 ఇవన్నీ ఆలోచించి ఎవరి కర్మ ప్రకారం వారి జీవితాలు నడుస్తాయి అనే సిద్ధాంతం నిజమే అనిపిస్తుంది..
అయితే దైవ పూజ, ఇప్పటి మంచి ప్రవర్తన వల్ల పూర్వ పాపాన్ని తగ్గించుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు.. ...వినేవాళ్ళు ............
ధన్యవాదాలండి.
ReplyDeleteఈ జూదంలాంటి వాటిలో ........... అదృష్టముంటే డబ్బు రావచ్చు అన్నారు. కానీ ఇలాంటి వాటి విషయంలో డబ్బు రావటమే దురదృష్టం. ఎందుకంటే ఒకసారి డబ్బు వస్తే మళ్ళీమళ్ళీ ఆడి ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టుకుపోయేవరకూ ఆగటం అనేది ఉండదు కాబట్టి......
.అసలు ఎవరైనా వారి మనసును జయిస్తే విశ్వాన్ని జయించినట్లేనని పెద్దలు చెబుతున్నారు. అదేదో సామెత చెప్పినట్లు అదే చేతనయితే ఈ బాధలన్నీ ఎందుకుంటాయి ?
http://funnotes.net/sai_satcharitra_telugu.php
ReplyDeleteధన్యవాదములండి.
ReplyDeleteనరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ...ఆ రెంటి నట్టనడుమ నీకేందికింత తపన ..:)
ReplyDeleteధన్యవాదములండి.
ReplyDeleteనిజమే ఈ తపన వల్లే మనిషికి కష్టాలు. భగవంతునిపైన భారం వేసి వారి తలపు ఎలా ఉంటే అలా జరుగుతుందని నమ్మినవారికి బాధే ఉండదు......
కర్మ, లలాట లిఖితంతోబాటు ఫ్రీవిల్(Rao s lakkarajuగారు చెప్పిన ఇంగిత జ్ఞానం) అనే అంశాన్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. దానిని ఉపయోగించుకుని రాతను కూడా మార్చుకోవచ్చంటారు.
ReplyDeleteధన్యవాదములండి.
ReplyDeleteనిజమేనండి. ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించి రాతను కూడా మార్చుకోవచ్చట.
అంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించి సక్రమమైన పద్ధతిలో జీవించటం ద్వారా తాను ముందు చేసిన పాపకర్మ ద్వారా అనుభవించే కష్టాలను తగ్గించుకోవచ్చు.
అంటే జైలుశిక్ష పడిన ఖైదీలు సత్ప్రవర్తనతో ఉన్నప్పుడు ప్రభుత్వం వారి శిక్షను తగ్గిస్తుంది ఒకోసారి వారిని విడుదల చేస్తుంది కూడా అలా..............