Monday, January 24, 2011
అనాధలను ఆదరించటం మంచిదే , ఇంకా .......
ఈ రోజుల్లో చాలామంది అనాధలకు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అలాంటి ఎందరో మహానుభావులకు నా వందనములు.
ఇంకా, నాకు ఏమనిపిస్తుందంటే ....అసలు ............ .ఇంతమంది అనాధలుగా మారటానికి కారణాలను కనుగొని ......... సాధ్యమయినంతవరకు వాటిని ఆపటం కూడా చేస్తే బాగుంటుంది కదా అని...
పూర్వం ప్రకృతి వైపరీత్యాలయిన భూకంపాలు, ఉప్పెనలు ఇలా కారణాలు ఎక్కువగా కనపడేవి. ఇప్పుడు వాటికి తోడు సామాజిక కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వదిలివేయబడటం, తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల హత్యలు, ఆత్మహత్యలు . జైలుకెళ్ళటం తద్వారా పిల్లలు అనాధలవటం ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
పూర్వపు కాలంలో ...... తల్లిదండ్రులు పోయి అనాధలుగా మారిన పిల్లలను బంధువులు ఆదరించటం కూడా జరిగేది. ఈ రోజుల్లో ఈ విషయం గురించి ఏం చెప్పగలం ?
సమాజసేవ అంటే సంసారులు ఇల్లు పట్టించుకోకుండా .......... సమాజ సేవ చెయ్యాలేమో అని భయపడనక్కరలేదు. అయ్యో !మనం సమాజ సేవ చెయ్యలేక పోతున్నామే ........ అని ఎవరు బాధ పడనవసరం లేదు.
ఎవరికి వారు మంచిగా ప్రవర్తిస్తూ, కోరికలను అదుపులో పెట్టుకుని అవసరాలను తగ్గించుకుంటూ....... సంపద ఇంకా చాలు అని తృప్తి పడినప్పుడు............. అది కూడా పెద్ద త్యాగం, సమాజసేవా అవుతుంది. .. ............ అప్పుడు సంపద అందరికీ సమానంగా అందించిన వాళ్ళమవుతాము.
అసలు ఎవరైనా అవసరానికి మించి డబ్బు కూడపెట్టడం మహాపాపం.
ఈ రోజుల్లో చాలామంది లక్షలకారు కొన్నాక కోట్ల ఖరీదు చేసే కారుకోసం ఆశ పడటం, ఆడవారు లక్షల ఖరీదు చేసే నగలతో తృప్తి పడకుండా కోట్ల రూపాయల విలువ చేసే నగలు, వస్త్రాల కొరకు ఆశపడటం ............... ఇలా కోరికలకు అంతు లేకుండా పోతోంది. ఇవన్నీ చూసి మిగతావాళ్ళూ తామూ అవన్నీ కోరుకుని ఎలాగైనా డబ్బు సంపాదించటమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు.
ఇంతా చేసి అన్ని విలాసాలు ఉన్న ధనవంతుల జీవితాల్లో మానసిక ప్రశాంతత ఎంత ఉంటుందో ........... వారికే బాగా తెలుసు.
ఎన్ని సంపదలున్నా మానసిక ప్రశాంతత కొరకు ఆఖరికి భగవంతుని ఆశ్రయించాల్సిందే,.
డబ్బు లేనివారికి డబ్బు ఎలా సంపాదించాలో అన్న చింత...........డబ్బు ఉన్నవారికి ఆ డబ్బు పోకుండా ఎలా కాపాడుకోవాలో అన్న చింత............... ఇలాగే జీవితం గడిచిపోతుంది.
అసలు పెద్దలు ఏం చెబుతున్నారంటే , ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కన్నా మరణం తరువాతే చాలా జీవితం ఉంటుందట.
ఎన్నో పాపాలు చేసి వచ్చే జన్మలో కుంటి, గ్రుడ్డి ఇలా కష్టాలతో కూడిన జీవితం లభిస్తే అప్పుడూ .......... దేవునికి దయలేదు అని భగవంతుడినే తిడతారు. అంతేకానీ, తాము చేసిన పాపాల వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని గ్రహించరు.
కొందరు ప్రజల సొమ్మును దోచుకుంటారు,...... కొందరు ఆడవాళ్ళకు అర్ధనగ్నదుస్తులు వేసి, ఇంకా కుటుంబసభ్యుల మధ్యన చిచ్చురగిలేలా కధలు అందిస్తూ సమాజాన్ని పెడత్రోవపట్టించేవాళ్ళూ ,......... కొందరు పర్యావరణాన్ని పాడుచేసి మూగజీవులను రోదనకు గురిచేసేవాళ్ళు, ......కొందరు అవినీతిపరులు.......... ఇలా ఎందరో................. అనేకరకాలవాళ్ళు .
పేదవారు ఏం చేస్తారులే అనుకుంటారు కొందరు . పేదవారు ఏమీ చెయ్యలేకపోవచ్చు. కానీ పేదవారి కన్నీటికి కూడా కరెంట్ కన్నా ఎక్కువ పవరుంటుందండి. దాన్నే ఉసురు అంటారు. బాధితుల ఉసురు తగిలితే ఎన్నో కష్టాలు వస్తాయి. ఇవన్నీ పాపాలు చేసేవాళ్ళు ఆలోచించుకోవాలి.
పాపాలు చేసిన వాళ్ళు వారి పాపం పండినరోజున ఫలితాన్ని అనుభవిస్తారు.
భగవంతుడు అందరూ తన పిల్లలే కదా అని , వారిలో మార్పు వస్తుందిలే అని కొంత అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది.
ఎన్నో పాపాలు చేసి కొన్ని పూజలు చేస్తే చాలు , ఇక భగవంతుడు క్షమిస్తారు అనుకోవటం పొరపాటు. పాపాలు చేసినవాళ్ళు పశ్చాత్తాపపడి మంచిగా మారితే అప్పుడు దైవం క్షమించే అవకాశం ఉంది.
పూర్వం గొప్పతపస్సులు చేసి దైవాన్ని ప్రత్యక్షం చేసుకున్నవాళ్ళే ...... తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు భగవంతుడు.............. వారు నా భక్తులే కదా.. అందుకని ఎలా ప్రవర్తించినా ఫరవాలేదులే అనుకోలేదు...ఏమాత్రం మొహమాటం లేకుండా వారిని శిక్షించటమే జరిగింది.
ఎవరికివారు నీతిగా జీవించినప్పుడు అనాధలుగా మారేవారు చాలావరకూ తగ్గిపోతారు. ఇలా నీతిగా ప్రవర్తించటం సమాజానికి సేవచెయ్యటం అనేకన్నా..తాము మంచిగా ప్రవర్తించటం తమ మేలు కొరకే అన్నది నిజం...... ................
Subscribe to:
Post Comments (Atom)
ఇ౦త మ౦చి టపా లు ఉన్న బ్లాగు లో , వ్యాఖ్య లు లేకపోవడ౦ ఆశ్చర్య౦ గా ఉ౦ది :)
ReplyDeleteచివరి పేరా ..నూటికి నూరు పాళ్ళూ సత్య౦ :)