koodali

Friday, January 21, 2011

శరణం, శరణం....... శబరిమలై మకరజ్యోతి......... ... .... . .

 

ఈ మధ్య శబరిమలై దగ్గర జరిగిన ప్రమాదంలో కొందరు భక్తులు మరణించటం ఎంతో బాధాకరమైన విషయం. అలా ఎందుకు జరిగిందో కారణం ఆ భగవంతునికే తెలియాలి.

అయితే ఒక పక్క భక్తులు చనిపోయిన విషాదం జరిగి ఎంతో సమయం గడవకముందే మకరజ్యోతిని మనుష్యులే వెలిగిస్తున్నారు అని చర్చ జరగటం ఏమిటో నాకు అర్ధం కాలేదు. దానికీ, దీనికీ ఏం సంబంధం ?


ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగేది కాదేమో ? ఒకోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోడ్ పైన యాక్సిడెంట్స్ , రైలు, విమానప్రమాదాలు జరగటం చూస్తూంటాము. కారణాలు మనకు తెలియదు. విధిలిఖితం అనుకోవాల్సిందే.


మకరజ్యోతి దైవికాధ్బుతమని, అయ్యప్పస్వామి యేనని భక్తుల నమ్మకం. మకరసంక్రమణం రోజున ఆకాశంలో దేదీప్యమానంగా కనిపించే మకరనక్షత్రమే మకరజ్యోతి అని కూడా భావిస్తుంటారు.


సరే , కొంతమంది అంటున్నట్లు ఆ జ్యోతిని మనుష్యులే వెలిగిస్తున్నారు అనుకున్నా అందులో తప్పేమిటి ?

ఆ యాత్ర వల్ల మంచే జరుగుతోంది కదా ! చాలామంది భక్తులు కొన్నిరోజులు నియమాలను పాటించటం వల్ల మనస్సుని నిగ్రహించుకోవటం నేర్చుకునే అవకాశం ఉంది. చెడు అలవాట్లను దూరం చేసే ప్రయత్నం చెయ్యటం వల్ల లాభమే కానీ నష్టమేమీ లేదుకదా !


సమాజంలో దేవుని పేరుతో కొంతమంది ఎన్నో మోసాలు చేస్తున్నారు నిజమే. అలాంటివాటిని అడ్డుకోవటం ద్వారా ప్రజలకు మంచి చేసేవారిని నిజంగా అభినందించాలి. కానీ ఈ యాత్ర వల్ల ప్రజలకు మంచే జరుగుతోంది.


ఇక ప్రమాదాలంటే ఇలాంటివి జరగకుండా ఇక ముందు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

తమిళనాడు లోని తిరువణ్ణామలైలో ప్రతిఏటా కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఆ రోజున సాయంత్రం ఎత్తైన కొండ మీద చాలా పెద్ద జ్యోతిని వెలిగిస్తారు దేవాలయమునకు సంబంధించిన వారు.

ఆ రోజున ఆ దీపాన్ని చూడటానికి లక్షల మంది జనం వస్తారు. ఆ దీపం సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తారు. చూసినవారికి ముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకోసారి ఆ దీపం వారం రోజులు కూడా వెలుగుతుందట. అంత పెద్దది.


ఆ రోజు గుడికి 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపేస్తారు. కాలినడకన వెళ్ళాల్సిందే. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అంతేకానీ దేవుని విమర్శించటం వల్ల సమాజానికి చెడు జరుగుతుందే కానీ మంచి జరగదు.


ఎందుకంటే , దేవుని యందు భయభక్తులు ఉండటం వల్ల ప్రజలు చెడు పనులుచేయటం కొంచెమయినా తగ్గుతుంది. కొందరు దేవుని పూజ చేస్తూ కూడా చెడ్డ పనులు చేస్తున్నారు అంటే ఇక వాళ్ళకి దేవుని యందు నమ్మకం లేకపోతే మరెన్ని దుర్మార్గాలు చేస్తారో ఊహించండి.


ఉదా......పరీక్షరాసే హాల్ లో ఇన్విజిలేటర్ విద్యార్దులను జాగ్రత్తగా చూస్తుంటే కాపీకొట్టటానికి పిల్లలు భయపడతారు, అదే టీచర్ బయటకు వెళ్తే ఇక ఎన్ని కాపీలు , జరుగుతాయో అందరికీ తెలుసు.


సరే , ఇంత ఎక్కువమంది భక్తులు వెళ్ళే సందర్భాలలో , భక్తులు కూడా ఒక్కరోజే అందరూ వెళ్ళాలి అనుకుంటే ఒకోసారి కుదరదు. ముఖ్యమైన రోజుల్లో రష్ వల్ల భగవంతుని దర్శనం కూడా సరిగ్గా జరగకపోవచ్చు. అందుకని కొంతమంది కొన్ని రోజులముందే వెళ్ళి దర్శనం చేసుకు వచ్చేస్తే ముఖ్యమైన రోజుల్లో రష్ తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.

శరణం, శరణం....... శబరిమలై మకరజ్యోతి......... ... .... . ....

(అయినా రద్దీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని అనుకోవటం కూడా తప్పేమో ? ఒకోసారి రద్దీ లేకపోయినా ప్రమాదాలు జరగటం వింటున్నాము. కర్మఫలం ప్రకారం అలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుందేమో. ఏది ఎందుకు జరుగుతుందో భగవంతునికే తెలుస్తుంది. )

(
కామెంట్స్ చూసాక ఇలా రాయాలని అనిపించింది. ).

 

6 comments:

  1. అయితే ఒక పక్క భక్తులు చనిపోయిన విషాదం జరిగి ఎంతో సమయం గడవకముందే మకరజ్యోతిని మనుష్యులే వెలిగిస్తున్నారు అని చర్చ జరగటం ఏమిటో నాకు అర్ధం కాలేదు. దానికీ, దీనికీ ఏం సంబంధం ?

    భక్తులు కూడా ఒక్కరోజే అందరూ వెళ్ళాలి అనుకుంటే ఒకోసారి కుదరదు. ముఖ్యమైన రోజుల్లో రష్ వల్ల భగవంతుని దర్శనం కూడా సరిగ్గా జరగకపోవచ్చు. అందుకని కొంతమంది కొన్ని రోజులముందే వెళ్ళి దర్శనం చేసుకు వచ్చేస్తే ముఖ్యమైన రోజుల్లో రష్ తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.


    చూశారా, ప్రశ్న, సమాధానం మీ బ్లాగులోనే ఉన్నాయి. మకరజ్యోతి పవిత్రమైనదని, దాన్ని చూడాలని అందరూ అదే రోజు వెళ్ళి తొక్కిసలాటకు గురౌతున్నారు. అది మనుషులచేత కృత్రిమంగా సృష్టించ బడిందని తెలిస్తే అంత మంది అదే రోజున వెళ్ళి ప్రమాదాలకు గురి కారు కదా!

    ReplyDelete
  2. భక్తి ఉండవచ్చు గాని, మూడ భక్తి వుండకూడదు కదా.... అందరూ ఒకే సారి మకర జ్యోతిని దర్శించుకోవాలని తపనతో వెళ్ళడం వల్ల అంత మందికి అక్కడ ఏర్పాట్లు చెయ్యడం కూడా కష్టం అవుతుంది. దేవుని దర్శించుకోవడం కోసమే అయితే ఏ రోజన్నా వెళ్ళవచ్చు కదా...

    ReplyDelete
  3. .ధన్యవాదములండి.
    నేను టపా నిడివి మరీ ఎక్కువగా ఉంటే చదవరేమోనని నా అభిప్రాయములు సాధ్యమయినంత తక్కువగా రాయటానికి ప్రయత్నిస్తాను. మీ వల్ల ఇంకొంచెం స్పష్టంగా చెప్పటానికి వీలయింది.

    అయ్యప్ప భక్తులు మకరజ్యోతిని చూడటానికి మాత్రమే అక్కడికి వెళ్ళరు. ఆ రోజు మంచిది కాబట్టి , గుడిసమీపములో మకరనక్షత్రాన్ని చూడటానికి ,ఇంకా ......... స్వామి కి నగలు అవీ అలంకరించిన తరువాత ఆ పవిత్రమైన 18 మెట్ల పైన వెళ్ళాలని ఆశతో అదే రోజు అలా వెళ్ళటం జరుగుతుంది.

    ఇంకా ఒకవేళ మనుషులే జ్యోతిని వెలిగించినా నమ్మకము ఏమీ పోదు. ఉదా... తిరువణ్ణామలైలో వెలిగించే కార్తీక దీపం గొప్పదనం గురించి రాశాను. మీరుదయచేసి గమనించగలరు. మనము గుడులలో దైవ హారతిని భక్తిగా కళ్ళకు అద్దుకోవటం లేదా ?

    ఇక భక్తులు ముందే వెళ్ళిరావచ్చుకదా అని ఎందుకు రాశానంటే వారు ఇబ్బందులు పడకూడదని, ఆ రోజు ఎంత ముఖ్యమయిన రోజయినా భక్తులు ప్రశాంతముగా దర్శనం చేసుకోలేనప్పుడు ఏమి లాభం. ఆ రష్ లో ఒకోసారి కొందరికి దర్శనం కూడా జరగదు. అప్పుడు ఎంత నిరాశగా ఉంటుంది ? . అసలు దర్శనం జరగకపోవటం కన్నా....ముందు అయినా దర్శనం ప్రశాంతముగా జరగటం మంచిది కదా ........ భగవంతుడు దయామయుడు మన కష్టాలు అర్ధం చేసుకుంటారు.......

    .అయినా రద్దీ వల్ల ప్రమాదాలు జరుగుతాయని అనుకోవటం కూడా తప్పేమో ? ఒకోసారి రద్దీ లేకపోయినా ప్రమాదాలు జరగటం వింటున్నాము. కర్మఫలం ప్రకారం అలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుందేమో. ఏది ఎందుకు జరుగుతుందో భగవంతునికే తెలుస్తుంది.

    ఇంకా మ్రొక్కులు వంటి రకరకాల సొంత కారణాలతో భక్తులు అలా వెళ్తుంటారు. ఇతర గుడులలో కూడా పండుగ రోజున విపరీతంగా ప్రజలు వెళ్తారుకదా !

    అయినా ఇదంతా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదమయితే అక్కడకు వెళ్ళటమే తప్పు అన్నట్లు, ....... ...లేక రైలు ప్రమాదమయితే జనాలు రైలెక్కటమే తప్పు ........ అన్నట్లు వింతగా అనిపిస్తోంది కదండి..................

    ReplyDelete
  4. ధన్యవాదములండి.

    ReplyDelete
  5. బాగా చెప్పారు.
    మకరజ్యోతి వుట్టిదే, అలాంటి నక్షత్రం లేదు మూడనమ్మకం అని పోస్ట్ రాసిన ఓ అన్నగారు, తాను చెప్పే గ్రహాలు వాటి ఎఫెక్ట్లు మాత్రం నిఖార్సైన నిజాలంటూ, 'నన్ను కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా' అన్నట్టు, కామెంట్లే మూసేసుకున్నారు. :))

    ReplyDelete
  6. ధన్యవాదములండి.
    నేను అయ్యప్పస్వామి మకరజ్యోతిని, మకరనక్షత్రాన్ని దైవంగా నమ్ముతానండి.
    ఇంతకు ముందు నాకు వర్డ్ వెరిఫికేషన్ గురించి నిజంగానే తెలియదు. ఈ మధ్యన జ్యోతి గారి " బ్లాగ్ గురువు " లో దీనిగురించి వివరములు చదివాక నేను వర్డ్ వెరిఫికేషన్ మార్చటం జరిగింది..... .

    ReplyDelete