koodali

Monday, January 17, 2011

అందరికీ ఆహారం అసాధ్యమా ?

 

 

అందరికీ ఆహారం అసాధ్యమా ? అసాధ్యమని భావించటమే అత్యంత విచారకరమయిన అంశం. అందరికీ ఆహారం అసాధ్యమేమీ కాదు ......... మనకు చిత్తశుద్ధి ఉంటే...........అది అలా ఉంచండి.....

భగవంతుడు ఎంత తెలివిగలవాడు , వారు చక్కని ప్రణాళికతో ఈ విశ్వాన్ని సృష్టించటం జరిగింది. జీవులకు దాహం తీర్చటానికి నీరు, మనిషికి ఆహారంగా ఎన్నో పండ్లు , కాయగూరలు, ధాన్యములు ఇలా ఎన్నో సృష్టించారు.


ఒక చిన్న విత్తనం నాటితే అందులోనుంచి మహావృక్షం దానికి పండ్లు మళ్ళీ వాటినుంచి చెట్లు ఇలా ఎంతో ఆహారాన్ని పొందవచ్చు.


భగవంతుడు మనకొరకు ఇంత ఏర్పాటు చేసినా , ఒక ప్రణాళిక ప్రకారం ఆ ఆహారాన్ని పొందటం విషయంలో కూడా మనం విఫలమవుతున్నాము. మళ్ళీ మనం చాలా తెలివి గలవాళ్ళమని ఫీలయిపోతుంటాము.


ఆ మధ్య మన దేశంలో టన్నులకొద్దీ ధాన్యాన్ని కుళ్ళపెట్టుకున్న విషాదం మనకు తెలిసిందే. ఒకోసారి ఎక్కువగా లెక్కలు వేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. అప్పుడు లెక్కలకన్నా లౌక్యంగా ప్రవర్తించటం మంచి ఫలితాన్ని ఇస్తుంది.


ఇలా ఆహారకొరత రావటానికి ఎన్నో కారణాలు. పంటలు పండే భూమి విస్తీర్ణమ్ తగ్గించి , ............. ఆ భూమిని పరిశ్రమలు, పార్కులు, గోల్ఫ్ కోర్ట్స్ అంతటి పెద్ద ఇళ్ళు కట్టుకోవటానికి కేటాయించుకుంటూ పోతే ........... పంటలు ఇక చంద్రమండలంలో పండించుకోవలసిందే.


ఆహార కొరత రావటానికి ......... పండిన పంటను చక్కటి ప్రణాళిక ప్రకారం అందరికీ అందుబాటులోకి తేలేక పోవటం , వృధా అవుతున్న ఆహారం ఇలా ఎన్నో కారణాలు.


ఇవన్నీ ఆలోచించే పెద్దలు అన్నం పరబ్రహ్మస్వరూపమని వృధా చెయ్యరాదనీ చెప్పేవారు.. ఇప్పటివాళ్ళు ఇలాంటి మాటలను విని చాదస్తం అంటారు. మీరు చెట్లను, పశువులను పూజిస్తారు అని ఎగతాళిగా మాట్లాడుతారు.


మనం తింటున్న ఒక్కో మెతుకు ఒకో మొక్క త్యాగంతో , తాను బాధపడి మనకు ఇస్తున్న ఆహారమే. అందుకే చెట్లను పూజిస్తే తప్పేమిటి ?

ముందుముందు ఇంధన అవసరాలకు మొక్కజొన్న లాంటివాటిని వాడుతారట. ఇక అప్పుడు రోబోట్స్ కు తప్పితే మనుషులకు, పశువులకు ఆహారం అందని ద్రాక్షే.


నీటిని కూడా తాగునీటి అవసరాలకన్నా పారిశ్రామిక అవసరాలకోసమే ఎక్కువగా వాడుతున్నారు. ఇవన్నీ మనిషి కోరి తెచ్చుకున్న కష్టాలే. ఫలితం అనుభవించక తప్పదు మరి...


ప్రపంచం నుండీ తీసుకోవటమే కానీ మనిషి తాను ప్రపంచానికి ఇస్తున్నదేమీ కనిపించటం లేదు. మనకన్నా మొక్కలు, చెట్లు నయం. వాటి వల్ల మనం బ్రతుకుతున్నాము,. మన వల్ల ప్రపంచానికి ఏమీ ఉపయోగం కనిపించటం లేదు..

 

11 comments:

  1. ప్రపంచం నుండీ తీసుకోవటమే కానీ మనిషి తాను ప్రపంచానికి ఇస్తున్నదేమీ కనిపించటం లేదు.
    --------
    కాలుష్యం ఇస్తున్నాము. దానితో మన గోతిని మనమే తవ్వు కుంటున్నాము. ఇదివరకు సత్రాలు,సమారాధనలు,చలివేంద్రాలు ఉండేవి. అవసరంలో ఆడుకోటానికి. ఇప్పుడు అన్నిటికీ ప్రభుత్వమే గతి. మన ఆచారాలు పాటించకుండా ఇది మనము చేసిన తప్పేనేమో.

    ReplyDelete
  2. ధన్యవాదములండి. కొంతకాలం క్రిందట పల్లెటూళ్ళలో వేసవికాలం వస్తే గ్రామస్తులందరూ కలసి చెరువులో పూడిక వాళ్ళే తీసేవారు. అప్పట్లో అలా కలసి సమస్యలు పరిష్కరించుకునేవారు. అప్పుడంతా చాలా సందడిగా ఉండేది.

    ReplyDelete
  3. మనకందరికీ ఆకర్షణలు ఎక్కువైనాయి, వాటిమూలాన కోరికలు ఎక్కువైనాయి, వాటిని తీర్చు కోటానికి స్వార్ధం ఎక్కువైంది. ఇదివరకు వీటన్నిటి మీదా మత పరమైన limitations ఉండేవనుకుంటాను(భయ భక్తులు వగైరా). ఇప్పుడు మనకి ఆ limitations ఏమిటో కూడా తెలియవు. మీరు వాటిగురించి వీలయితే నాలుగు ముక్కలు వ్రాయండి.

    ReplyDelete
  4. ధన్యవాదములండి.,
    నిజమే కోరికలు ,ఆకర్షణలు విపరీతంగా పెరగటమే ఈ అనర్ధాలకు అసలు కారణం. అప్పట్లో దైవం అంటే విశ్వాసం, పాపం.........పుణ్యం , స్వర్గం ....... నరకం ఇలాంటి భయభక్తులు ఉండేవి ప్రజలలో.

    ఇప్పుడు దేవుడు గురించి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఎక్కువయిపోయాక ఇక భయం ఏముంటుంది ? ఇప్పుడు ఆ భయభక్తులు తగ్గిపోయాక ఎవరి ఇష్టప్రకారం వారు వెళ్తున్నారు.. పాపభీతి అనేది లేకపోతే మంచివారు కూడా ఒకోసారి తప్పు చేయటానికి వెనకాడరు.

    లిమిటేషన్స్ అంటే నాకూ అంతగా తెలియదు కానీ, ఒకవేళ , పెద్దలు ఉపన్యాసాల్లో చెపుతున్నవాటిని విని మనబోటివాళ్ళు చెప్పటానికి ప్రయత్నించినా, ఈ రోజుల్లో అవన్నీపాటిస్తారంటారా ?

    ఇంకా, ఈ రోజుల్లో చాలామంది ప్రజలకు తమ పనులు కూడా తాము చేసుకోవటానికి బద్ధకం పెరిగిపోయింది. తినే ఆహారంలో కూడా బలం లేకపోవటం వల్ల ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. ఓపిక కూడతీసుకుని టి.వి ముందయినా కూర్చుంటారు గానీ ఎక్కువగా పని చేయటానికి శరీరం సహకరించదని చెబుతుంటారు..
    అంతా కలికాలమహిమ అని సరిపెట్టుకోవాలేమోనండి...... .

    ReplyDelete
  5. ఏమీ ఇవ్వకు౦డా మనిషికి ఊరికే ఆహార౦ దొరుకుతున్నదా ఎక్కడైనా ? :)

    ReplyDelete
  6. ధన్యవాదాలండి.
    మనిషికి ఏమీ ఇవ్వకుండా ఆహారం దొరుకుతున్నదా ? అని అన్నారు మీరు.

    .అసలు ఒకప్పుడు మానవులు తినే పండ్లు, కాయకూరలు, పప్పుదినుసులు ఇవన్నీ భూమిపైన ఎక్కడపడితే అక్కడ పెరిగేవి ....... .అలా దొరికే పండ్లు., కాయలు .............. వీటిని ఎవరికీ డబ్బు ఇవ్వకుండానే తామే దొరికినవి పచ్చివే తినేవారు.

    మనం మన సౌలభ్యం కోసం మనలో మనకు గొడవలు రాకుండా ఇలా డబ్బు ద్వారా ఆహారాన్ని పొందటం ఏర్పాటు చేసుకున్నాము.

    అంతేకానీ, భగవంతుడు సూర్యుడు, గాలి, నీరు , మొక్కలు, ఇవన్నీ సృష్టించకపోతే మనం డబ్బు ఇచ్చినా ఇలా రుచికరమైన ఆహారం ఎలా పొందగలిగే వాళ్ళం ?

    తరువాత కాలంలో ఒక దగ్గర పంటలు పండించటం, వస్తుమార్పిడి పధ్ధతి, ఆ తరువాత డబ్బు కనిపెట్టటం ఇలా మారింది. .....

    ఇప్పుడు కూడా అడవుల్లో చెట్లకు పండ్లు అవీ ఉంటాయి. అయితే దేశాలు, ప్రాంతాలు , ఇలా ఎవరికివారు విభజనలు జరిగాక పరిస్థితులు మారిపోయాయి. డబ్బు రంగప్రవేశం చేసింది.

    ఇప్పుడు కూడా అడవిలో జంతువులు ఏమీ డబ్బు ఇవ్వకుండానే ఆహారం తింటున్నాయి.

    మొక్కలు, చెట్లు పెరుగుదలకు ............ నీరు (, వానల వల్ల ) ఎండ, ఆక్సిజన్ , కార్బండైయాక్సైడ్ ఇవన్నీ కావాలి............. వీటిని భగవంతుడే ఏర్పాటు చేసాడు. సూర్యుని మనం సృష్టించలేదుగదా......

    .ఇప్పుడు కూడా ఆరోగ్యం ,బలం కోసం పండ్లు, దోసకాయలు, కారెట్ ,నానబెట్టిన శనగలు, పెసలు , డ్రై ఫ్రూట్స్ ఇలా ఎన్నో పచ్చివే ఆహారంగా తీసుకుంటున్నారుకదా........ మనం రుచికోసం రకరకాలుగా వండుకుంటున్నాము అంతే....... .....

    ReplyDelete
  7. ఇంకానండి, ఈ భూమి, నదులలో నీరు, ఆకాశం, ఇవన్నీ మనం సృష్టించలేదు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని అన్ని జీవుల మనుగడకోసం సృష్టించారు. అయినా భూమిపైన స్థలాల కోసం , నదుల్లో నీటికోసం ఇలా మానవులు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూనే ఉన్నారు .

    భగవంతుడు చక్కగా ఆహారాన్ని ఏర్పరిచినా సరిగ్గా పంచుకు తినటం కూడా చేతకావట్లేదు. సాటి జీవులను ఆకలిచావులకు గురిచేస్తున్నారు. .భగవంతుని సొమ్ముపై మనం పెత్తనం చేస్తున్నాము...

    ReplyDelete
  8. :) మీరు టపా కి స౦బ౦ధిచి వ్యాఖ్యానిస్తే బాగు౦టు౦ది .. మీ ప్రశ్నలన్ని౦టికీ టపా లోనే సమాధానాలున్నాయి అ౦డి.

    ReplyDelete
  9. ధన్యవాదాలండి.
    మీరు దయచేసి అపార్ధం చేసుకోవద్దండి. దైవం మనకు ఎంతో ఆహారాన్ని సృష్టించి ఇచ్చినా కూడా .............. అందరికీ ఆహారాన్ని సమానంగా అందించటంలో విఫలమయ్యాము. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఆకలితో బాధపడుతున్నారు. ఈ విషయాలే కదండి నేను టపాలో వివరించటం జరిగింది.

    అయితే మీ వ్యాఖ్యలో " ఏమీ ఇవ్వకుండా మనిషికి ఊరికే ఆహారం దొరుకుతుందా ఎక్కడైనా? " అన్నారు కదండి.......అందుకే నేను ......... వ్యాఖ్యలో టాపిక్ మార్చి .......... డబ్బు గురించి , మారిన ఆహార కొనుగోలు పద్ధతుల గురించి .......... రాయటం జరిగిందండి.......

    ReplyDelete
  10. ఆహార౦ ప్రకృతి ను౦డి వస్తు౦ది ..ఇ౦కా, ప్రకృతి ఏదీ ఎవ్వరికీ ఊరికే ఇవ్వదు ..ఇది నిజ౦ ..ప్రకృతి నే మన౦ దైవ౦ అ౦టున్నాము :)

    ReplyDelete
  11. ధన్యవాదములండి.
    "మీ వ్యాఖ్య........ ప్రకృతి ఏదీ ఎవ్వరికీ ఊరికే ఇవ్వదు..ఇది నిజం. ప్రకృతినే మనం దైవం అంటున్నాము. " ................
    ఇందులో ........ ప్రకృతి ఏదీ ఎవరికీ ఊరికే ఇవ్వదు అంటే మీ అభిప్రాయం అర్ధం కాలేదండి. మనకు , మొక్కలకు, ఇతర జీవులకు కావలసిన సూర్యరశ్మి, వాననీరు, వాతావరణం ఇవన్నీ ఉచితంగానే లభిస్తున్నాయి కదా !
    .తల్లిదండ్రులు పిల్లలకు ఆహారాన్ని ప్రేమతో ఇస్తారు. తిరిగి ఫలితాన్ని ఆశించి కాదు. సంస్కారవంతులైన పిల్లలు పెద్దవాళ్ళ వృద్ధాప్యంలో వారికి ఆసరాగా ఉంటారు.
    అదే............ దైవం విషయంలో అయితే వారే మనకు ఎప్పటికీ ఆసరా.............అయితే,........ దైవం మనకు ఎన్నో ఇచ్చినందుకు మనం దైవానికి కృతజ్ఞతగా ఉండాలి. వారిని ఆనందపరచటానికి అందరం జీవితాన్ని ధర్మబద్ధంగా గడపాలి. దైవం ధర్మం రూపంలో తిరిగి మనల్ని రక్షించటం జరుగుతుంది..
    భగవంతుడు జీవుల సుఖసంతోషాల కొరకు ఎంతగానో ఆలోచిస్తారు. జీవులు పరమాత్మను పొంది అలా దుఃఖం లేని పరమానందాన్ని పొందాలని భగవంతుని ఆలోచన.........
    నేను వాదిస్తున్నానని మీరు దయచేసి అపార్ధం చేసుకోవద్దండి. ఇవన్నీ మంచి వాతావరణంలో జరుగుతున్న చర్చలు అంతే..

    ReplyDelete