koodali

Friday, January 14, 2011

శేషశాయి, వటపత్రశాయి..........పేర్లలో శాయి అన్న పదం................

 

కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

మనం రోజూ అలవాటుగా ఎన్నో పనులను చేస్తూ ఉంటాము. ఎన్నో పుస్తకాలను చదువుతూ ఉంటాము. కానీ ఒకోసారి సడన్ గా ఆ చేసే పనులలో కొత్త అయిడియా రావటం, చదివే పుస్తకంలోని విషయం నుంచి కొత్త అర్ధం స్ఫురించటం జరుగుతుంది.


ఇంతకుముందు ఒక పోస్ట్ లో నేను ' ఈశానుడు,' 'జగదీశా ' ఇలాంటి పేర్లలో ఉన్న ' ఈశా ' అన్న పదమును తిరగతిప్పి పలికితే ' శాఈ ' అని వస్తుందని వ్రాశానండి.


వాల్మీకి మహర్షి తాను మహర్షిగా మారకముందు ' రామ ' నామాన్ని తిరగత్రిప్పి ' మరా,మరా ' అని పలికారట.

ఈ మధ్య ఒక ఆమె తన ఉపన్యాసంలో ' శేషశాయి ' అన్న పదములో " శాయి " అన్న సాయిబాబా పేరు ఉన్నదని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది.

నేను కూడా చాలాసార్లు ' శేషశాయి,' 'రంగశాయి ' ఇలా విన్నాను, కానీ వారు చెప్పేవరకూ నాకు ఇలాంటి ఆలోచన రాలేదు ఎందుకో ! అనిపించింది.


ఇంకో విచిత్రం ఈ పోస్ట్ రాస్తున్నప్పుడే నాకు అవునూ,.......... వటపత్రశాయికి వరహాల లాలి, అనే పాటలో ' వటపత్రశాయి ' అన్నపదములో కూడా ' శాయి ' అన్న నామం వినిపిస్తోంది కదా ! అని ఆలోచన వచ్చిందండి.

నేను ఈ పాట చాలాసార్లు విన్నాను కానీ ఇలా ఆలోచన రావటం ఇదే మొదటిసారి.

ఇంకొకసారి బ్లాగ్ లో రాయటం కోసం ఒక పదం స్పెల్లింగ్ ఎలా వ్రాయాలో తెలియలేదండి.

ఒకరోజు ' శ్రీ శిరిడి సాయి సచ్చరిత్ర ' చదువుతోంటే అందులో నేను స్పెల్లింగ్ కోసం వెదుకుతున్న పదం కనిపించింది. నాకు ఆశ్చర్యమనిపించింది.


నేను ఈ పుస్తకం లో ఈ పదం ఇంతకుముందు కొన్నిసార్లు చదివానుకదా ! మరి ఎంత ఆలోచించినా ఇంతకుముందు ఎందుకు గుర్తు రాలేదు ? ఇప్పుడు మాత్రం సడన్ గా ఎలా స్ఫురించింది ? అని ఆశ్చర్యం వేసిందండి.

 ఇంకో విషయం..........

షిర్డిసాయి బ్రాహ్మణవంశానికి చెందినవారని.. అయితే, తల్లితండ్రి మరణించడంతో ముస్లిం మతస్తులవద్ద పెరిగారని, వారి గురువుమాత్రం వెంకోసా..వారు హిందువు.. అని కొన్నిచోట్ల ఉన్నది. బహుశా ఇలా జరగటం వల్ల, బాబా అన్నిమతములకు సంబంధించిన వారుగా ఉండటం జరిగిందేమో?


No comments:

Post a Comment