koodali

Friday, January 28, 2011

శ్రీ శని దేవుడు కొలువై ఉన్న శింగణాపూర్.. ఇక్కడ ఇళ్ళకు తాళం వేయరు .... ........

 

ఓం..

శ్రీ శని దేవుడు కొలువై ఉన్న శింగణాపూర్.. ఇక్కడ ఇళ్ళకు తాళం వేయరు .... ........ ఆ ఊరిలో దొంగతనం అలాంటివి చేయటానికి ప్రయత్నించినవారు శనిదేవుని చేత శిక్షించబడతారు.


శ్రీ శనిదేవులు కొలువై ఉన్న శింగణాపూర్ మహారాష్ట్రలో ఉంది. శిరిడీకి కొంచెం దగ్గరే. మహారాష్ట్రలో శనిదేవుని పూజలు బాగా చేస్తారట.


మేము కొన్ని సంవత్సరముల క్రిందట శిరిడీకి వెళ్ళినప్పుడు శింగణాపూర్ వెళ్ళటం జరిగిందండి. చాలా గొప్పగా ఉంది. అక్కడ ఒక వేదిక పైన నెలకొన్న దేవుని మూర్తికి పైన కప్పుగా మానవనిర్మిత కట్టడం ఏమీ ఉండదు. మగవారు వేదిక పైకి వెళ్ళి పూజించవచ్చు. ఆడవారు వేదిక క్రింద ఉండి పూజించవచ్చు. వేదిక పైన హనుమంతుని మూర్తి కూడా ఉంటుంది.


శింగణాపూర్ కు చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యమయిన పండుగ రోజుల్లో అయితే విపరీతంగా రద్దీ ఉంటుందట.


ఆ ఊరిలో ఇళ్ళకు తలుపులు తాళములు వేసుకోరట. దేవుని హుండీకి కూడా తాళం ఉండదు. ఇలా ఉండటం చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంగతట. .


ఇప్పుడు మనకు టి.విలో శ్రీ శనిదేవుని మహిమలు కధలుగా వస్తున్నాయి. శింగణాపూర్ వెళ్ళకముందే నేను శనిదేవుని నాకు వీలయినంతలో పూజించటం జరిగేది.


కొందరు శని దేవుడంటే భయపడతారు .......... కానీ శని దేవుడు దయామయుడు. భగవంతుడంటే ఎవరూ భయపడకూడదు.

శ్రీ జ్యేష్ఠా దేవీ సహిత శ్రీ శనిదేవుల వారికి ప్రణామములు. శ్రీ శంకరులకు, శ్రీ వాసుదేవునికి, శ్రీ హనుమంతునికి ప్రణామములు.


ఇంకో విషయం చెప్పాలండి. ఈ మధ్య నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో పూజకు వెళ్ళాను. వాళ్ళు పూజ అయ్యాక వచ్చినవారికి దేవుని పుస్తకములు పంచటం జరిగింది. ఆ గ్రంధము పేరు. .......... " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము. " ఈ గ్రంధములో నేను ఇంతవరకు చదవని ఎన్నో విషయాలు ఉన్నాయి.


నేను కూడా ఇంకా పూర్తిగా చదవలేదు లెండి. ఈ గ్రంధమును, శ్రీ దత్తాత్రేయుల అవతారమైన శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులతోను, ఇంకా సద్గురు శ్రీ గోపాల్ బాబా మహరాజ్ వారి ఆశీస్సులతో లార్డ్ దత్తాత్రేయ స్పిరిట్యువల్ సొసైటీ ( శ్రీ క్షేత్ర పిఠాపురం ) వారు వెలువరించారు.


భగవాన్ శ్రీ గోపాల్ బాబా మహరాజ్ వారి ఆశ్రమం పిఠాపురంలో ఉందట. .. .. ఈ గ్రంధములోని విషయములు అద్భుతంగా ఉన్నాయి.. శ్రీ అనఘాదేవీ సహిత శ్రీ దత్తాత్రేయులవారికి ప్రణామములు.......

ఇందులో తప్పులు ఉన్నయెడల దయచేసి క్షమించవలసినదిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

No comments:

Post a Comment