సునామీలు, తుఫాన్లు గురించి ముందుగానే సమాచారం తెలిసే విధంగా రాకెట్ ప్రయోగం విజయవంతగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు అభినందనలు.
..........
రాబోయే కాలంలో రొబోట్ల సంఖ్య పెరగటం.. తద్వారా మనుషులకు ఉద్యోగావకాశాలు తగ్గటం జరుగుతుందంటున్నారు.
అయితే రోబోట్లను కొన్ని పనులకు చక్కగా ఉపయోగించుకోవచ్చు.
ఉదా..భూకంపాలు వచ్చినప్పుడు శిధిలాలలో ఉండిపోయిన వారి ఆచూకీ తెలుసుకోవటం కోసం రోబోట్లను ఉపయోగించవచ్చు అంటున్నారు..
చెత్త తరలించే కార్యక్రమాలలో మనుషుల బదులు రోబోట్లను వాడుకోవచ్చు.
బోరుబావులలో పడిపోయిన వారిని వెలికితీయటంలో రోబోట్లను వాడవచ్చు.
మనుషులకు కష్టమైన పనులకు రోబోట్లను వాడేలా ఉపయోగించితే బాగుంటుంది.
***************
మనుషులు చేసే ఉద్యోగాల స్థానంలో మనుషులను తీసేసి రోబోట్లను పెడితే నిరుద్యోగ సమస్య ఎదురవుతుందనేది నిజమే..
అయితే, ప్రభుత్వం వద్ద డబ్బు బాగా ఉండి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఉద్యోగాల కల్పన కష్టమేమీ కాదు.
జీతాలు ఇవ్వటానికి డబ్బు ఉండాలే కానీ ఉద్యోగాలకు ఏం కొదవ .. . ఎన్ని చిత్రవిచిత్రమైన ఉద్యోగాలైనా సృష్టించవచ్చు..
ఉదా..రోడ్డు ప్రక్కన చెట్లు నాటి వాటి రక్షణకు ఒక్కో రోడ్డుకు ఒక్కో ఉద్యోగిని నియమించవచ్చు.
...............
ఈ రోజుల్లో చాలా ఆఫీసులలో ఇద్దరు చేసే పనిని ఒక్కరే చేస్తున్నారు.
ఇంతకుముందు అన్ని బస్సులలో డ్రైవర్ మరియు కండక్టర్ ఉండేవారు.
ఇప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బు ఎక్కువ లేక కొన్ని బస్సులలో కండక్టర్ను తీసివేసారు. డ్రైవరే టికెట్ ఇస్తున్నారు.
సమాజంలో పేదరికం, నిరుద్యోగం పోవాలంటే సంపద కొందరి వద్దే కాకుండా .. అందరి వద్ద ఉండాలి.
పేదరికం, నిరుద్యోగం తగ్గాలంటే ప్రభుత్వాలు నల్లడబ్బును, అవినీతిని సమర్ధవంతంగా అరికట్టటానికి కఠినచర్యలు తీసుకోవాలి.
పెరుగుతున్న ధరలను తగ్గించాలి.
ప్రజలు కూడా అత్యాశ తగ్గించుకోవాలి. అప్పుడు అందరి వద్దా సంపద ఉంటుంది.
భారతీయుల వద్ద ఉన్న వేలు లేక లక్షల కోట్ల సంపద బయటకు వస్తే .. పేదరికం తగ్గి నిరుద్యోగ సమస్యా తగ్గుతుంది.
అందువల్ల నల్లడబ్బును, అవినీతిని నిర్మూలించటం ఎంతో ముఖ్యం.
సమాజంలో నైతికవిలువలు పెంపొందటం అనేది అన్ని సమస్యలకు పరిష్కారం.
*******
ఎవరికైనా ప్రాధమిక అవసరాలు తీరటం ముఖ్యం.. అంటే, ఆహారం, రక్షణ, ఆవాసం(ఇల్లు), విద్య, వైద్యం..ఇలా ప్రాధమిక అవసరాలు తీరటం పెద్ద కష్టమేమీకాదు. ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి.
బోలెడు మొక్కలనుంచి అందరికీ ఆహారం లభిస్తుంది. ప్రకృతి నుంచి లభించే వాటితో పర్యావరణహితమైన ఇళ్ళు కట్టుకోవచ్చు. ఇక, చక్కటి పద్ధతితో జీవిస్తే అనారోగ్యాలు తక్కువగా ఉంటాయి. ప్రకృతి నుంచి లభించే వాటితో మందులు తయారీ , సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజవిధానాలతో వైద్యం చేయవచ్చు. ఎన్నో విద్యలు, వృత్తులు ఉన్నాయి. ఇలా ప్రాధమిక అవసరాలు తీరటం అందరికీ తీరటం సులభమే. మనుషులే వ్యవస్థను పాడుచేసుకుంటున్నారు.

పాతకాలంలో డబ్బు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. ఆ విధానాన్ని ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వాడవచ్చు.
ఇప్పటి ప్రజలు చాలామంది ప్రాధమిక అవసరాలను కూడా విలాసంగా మార్చుకుంటున్నారు. అంటే, ఆహారం విషయంలో.. సరిపడినంత మంచి ఆహారం కాకుండా, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఇల్లు విషయంలో..సరిపడినంత చక్కటి ఇల్లు కాకుండా, విలాసవంతమైన ఇళ్ళకు బోలెడు డబ్బును ఖర్చుపెడుతున్నారు. ఇక వైద్యం, విద్య విషయంలో గమనిస్తే.. వీటిని చాలాచోట్ల వ్యాపారధోరణితో మార్చుకున్నారు. ఇక రక్షణ విషయంలో..ప్రపంచంలో మనుషులు అనేకకారణాలతో గొడవలు పడుతున్నారు కాబట్టి, రక్షణకొరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఉంది.
విమానప్రయాణాలు, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన హోటల్స్ ఖర్చులు, అనేక ఆభరణాలు, కాస్మెటిక్స్ఖర్చులు..ఇలాంటి విలాసాలు ఎన్నో ఉన్నాయి.
ఆధునికకాలంలో కుటుంబవ్యవస్థ, విద్య, వైద్యం, అన్నీ మారిపోయాయి. కొత్తవస్తువులకొరకు ప్రజల కోరికలు పెరిగిపోయాయి. వాటిని పొందటానికి స్త్రీలు, పురుషులు అదేపనిగా పనిచేసినా కూడా ఎక్కడి డబ్బూ సరిపోవట్లేదు.

No comments:
Post a Comment