పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చాలామంది అంటుంటారు.
అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు..ఇక్కడి రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రప్రజలకు ఉపాధి లభిస్తుంది.
అంతేకానీ ఉద్యోగాలలో ఇతరులను తీసుకుంటే అప్పుడు పరిశ్రమలు వచ్చినా స్థానికులకు కలిగే లాభం ఏమీ ఉండదు.
...............
భూములేమో రాష్ట్ర ప్రజల వద్ద నుండి తీసుకోవటం..పరిశ్రమల ద్వారా వచ్చే లాభాలేమో పరిశ్రమల అధిపతులకు..ఉద్యోగాలేమో ఇతర రాష్ట్రాల వాళ్లకు అనే పరిస్థితి ఉండకూడదు.
ఎక్కడెక్కడెక్కడివాళ్ళో వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ చక్కగా ఉపాధి పొందుతుంటే.. స్థానికులు వలస వెళ్లే పరిస్థితి ఉంటే... అలాంటి అభివృద్ధి ఎవరికోసం ?
.....................
ఎక్కడైనా కొంచెం అభివృద్ధి కనిపిస్తే చాలు .. ఇక ఎక్కడెక్కడి వాళ్లో వచ్ఛేస్తారు.
ఇలాంటప్పుడు స్థానికులకు ఉపాధి విషయంలో పోటీ ఏర్పడి సమస్యలు వస్తాయి.
ఇవన్నీ చదివి, నాకు విశాలహృదయం లేదు..స్వార్ధం ఎక్కువ అనుకుంటే నేనేమీ చేయలేను.

దేశంలో అందరూ ఒకే జాతిగా కలిసికట్టుగా జీవించాలి అనుకోవటం బాగుంటుంది.
అయితే అలాంటి సమైక్యత ఉండి, మన నీళ్లు, మన ఉద్యోగాలు..అనుకుంటూ కలిసికట్టుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడు ... మా నీళ్ళు, మా ఉద్యోగాలు అనే మాట వినిపించదు.
అయితే .. అనేక కారణాల వల్ల, మా నీళ్లు, మా ఉద్యోగాలు అనే ధోరణి ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితిలో ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వారికి కూడా మా నీళ్ళు, మా ఉద్యోగాలు .. అనే అభిప్రాయం కలగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
..............
ఇప్పుడు అమెరికా వంటి దేశాల వాళ్ళు కూడా ఇతరదేశాలనుండి తమ దేశానికి వచ్చే వాళ్ల వల్ల ... తమకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని భావించే పరిస్థితి ఉంది.
........................
అన్ని రాష్ట్రాల ప్రజలు తమతమ రాష్ట్రంలో ఓట్లు వేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రం ప్రజలయినా తమ ప్రభుత్వాలు తమకు సమస్యలు లేకుండా చూడాలని భావిస్తారు. తాము ఎన్నుకున్న ప్రభుత్వాలు తమకు చక్కటి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు.
అయితే, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పడినా కూడా, ఆ పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి లభించకుండా, ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉపాధి పొందుతుంటే .. ఓట్లేసిన స్థానికులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? తమకు ఉపాధి కల్పించమని స్థానికులు ఎవరిని అడగాలి? అందువల్ల ప్రభుత్వాలు స్థానికులకు ఉపాధి లభించేలా పనిచేయాలి.
***************
సంస్థలను ఏర్పాటు చేసినప్పుడు, ఆ సంస్థలలో ఎక్కువగా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ, ఇతరరాష్ట్రాల వారికి ఉపాధి కల్పిస్తే స్థానికులకు ఉపాధి ఎలా? ఇంకో విషయం ఏమిటంటే, ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ ఓటుహక్కు ఉండదు. వారు వారి రాష్ట్రాలలోనే ఓట్లు వేస్తారు.
ఇతరులకు ఉపాధి కల్పించటానికి మనము సంస్థలను తేవటం ఎందుకు? నాకు ఇతరరాష్ట్రాలవారంటే కూడా గౌరవమే. అయితే, ఎవరి రాష్ట్రాలను వారు అభివృద్ధి చేసుకుని ఉపాధిని పొందాలి. ఎవరి రాష్ట్రాన్ని, దేశాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి కానీ, అదేపనిగా వలసలు పోవటం వల్ల అనేక సమస్యలు ఉంటాయి.
****************
ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను.
ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇతర రాష్ట్రం నుండి మరింత మంది ఇక్కడ రావాలి.. అంటూ ఇక్కడ స్థిరపడిన కొందరు ఇతర రాష్ట్రం వాళ్ళు... తమ వాళ్ళను ఆహ్వానిస్తున్న వార్త చదివాను.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే బోలెడుమంది ఉపాధి లేక బాధపడుతున్నారు.
ఇక ఎక్కడెక్కడి నుండో వస్తే స్థానికుల ఉపాధి సంగతేమిటి ?
ఇలాంటప్పుడు .. మాకు విశ్వనగరాలు అక్కరలేదు... బాబోయ్! మమ్మల్నిలా బ్రతకవ్వండి చాలు.. అనాలనిపిస్తుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇతరరాష్ట్రాలకు, ఇతరదేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడివాళ్ళు కూడా మనవాళ్లను తిట్టుకుంటూ ఉంటారు.
.................
వలసలు వెళ్లటం కొంతవరకూ ఎక్కడైనా జరిగేదే..
అయితే , వలసలు ఒక స్థాయిని మించితే మాత్రం స్థానికులకు, వలసదారులకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితిలో ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ...ఎవరి దేశాన్ని వాళ్లు అభివృద్ధి చేసుకుని సొంత ప్రాంతంలో ఉపాధి పొందటం మంచిది.
.................
అయితే, ప్రపంచమంతటా ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు , తత్వవేత్తలు.... వంటివారు ప్రపంచానికి అంతా చెందినవారు.
ఇలాంటివారికి ప్రాంతీయత ఉండదు.ప్రపంచమంతా వారిదే. వారు అందరివారు.
ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే.. సైనికులలో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళూ ఉంటారు. వారికి ప్రాంతీయభేదాలు ఉండవు. కలసికట్టుగా దేశ రక్షణకు కృషి చేస్తుంటారు.
సైనికులను చూసి దేశప్రజలు ఎంతో నేర్చుకోవాలి.

ప్రజలు ఎడారిదేశాలకు వెళ్ళి చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతున్నారు. ప్రభుత్వాలు చిన్న ఉద్యోగాలనైనా కల్పించి, ఉపాధి కల్పిస్తే బాగుంటుంది.
పర్యావరణరక్షణ, పార్కులు అభివృద్ధి, రహదారుల శుచిశుభ్రత, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు..ఇలా ఎన్నో రంగాలలో ఉపాధి కల్పించవచ్చు.
విదేశాలకు వెళ్తే కొన్ని కష్టాలుంటాయని తెలిసినా కూడా, కొందరు ప్రజలు విదేశాలకు వెళ్ళి .. ఆదుకోవాలంటూ ప్రభుత్వాలను అడుగుతుంటారు. వెళ్ళినవాళ్ళందరూ అలా అడగటం మొదలెడితే ఎంతమందిని తిరిగి రప్పిస్తారు..
ప్రజలు కూడా ఇతరదేశాలకు వెళ్ళి కష్టాలు పడటం కన్నా , స్వదేశంలోనే వ్యవసాయం వంటివి కూడా చేయటానికి ప్రయత్నించవచ్చు.
****************
ఈ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను.
ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇతర రాష్ట్రం నుండి మరింత మంది ఇక్కడ రావాలి.. అంటూ ఇక్కడ స్థిరపడిన కొందరు ఇతర రాష్ట్రం వాళ్ళు... తమ వాళ్ళను ఆహ్వానిస్తున్న వార్త చదివాను.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే బోలెడుమంది ఉపాధి లేక బాధపడుతున్నారు.
ఇక ఎక్కడెక్కడి నుండో వస్తే స్థానికుల ఉపాధి సంగతేమిటి ?
ఇలాంటప్పుడు .. మాకు విశ్వనగరాలు అక్కరలేదు... బాబోయ్! మమ్మల్నిలా బ్రతకవ్వండి చాలు.. అనాలనిపిస్తుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇతరరాష్ట్రాలకు, ఇతరదేశాలకు వలస వెళ్తున్నారు. అక్కడివాళ్ళు కూడా మనవాళ్లను తిట్టుకుంటూ ఉంటారు.
.................
వలసలు వెళ్లటం కొంతవరకూ ఎక్కడైనా జరిగేదే..
అయితే , వలసలు ఒక స్థాయిని మించితే మాత్రం స్థానికులకు, వలసదారులకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.
ఇలాంటి పరిస్థితిలో ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ...ఎవరి దేశాన్ని వాళ్లు అభివృద్ధి చేసుకుని సొంత ప్రాంతంలో ఉపాధి పొందటం మంచిది.
.................
అయితే, ప్రపంచమంతటా ఉపయోగపడే విధంగా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు , తత్వవేత్తలు.... వంటివారు ప్రపంచానికి అంతా చెందినవారు.
ఇలాంటివారికి ప్రాంతీయత ఉండదు.ప్రపంచమంతా వారిదే. వారు అందరివారు.
ఇక్కడ అందరూ గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే.. సైనికులలో దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళూ ఉంటారు. వారికి ప్రాంతీయభేదాలు ఉండవు. కలసికట్టుగా దేశ రక్షణకు కృషి చేస్తుంటారు.
సైనికులను చూసి దేశప్రజలు ఎంతో నేర్చుకోవాలి.
**************
marikonni vishayaalu..
కొంతకాలం క్రిందట తిరుమలను కేంద్రప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పుకార్లు కావచ్చు కానీ, కొన్ని వార్తలు వచ్చాయి. కొందరు తమిళులు అప్పుడప్పుడు తిరుమల.. తిరుపతి మావే అన్నట్లు మాట్లాడుతారు. సరిగ్గా పూజాదికాలు జరగని పురాతనకాలం నాటి దేవాలయాలెన్నో ఉన్నాయి. వాటిగురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు ? ఆదాయం ఎక్కువ వచ్చే తిరుమల గురించి పర్యవేక్షిస్తామంటూ మాత్రం వార్తలు వస్తుంటాయి.
రాష్ట్ర విభజన సమయంలో మద్రాస్ తమిళనాడుకు, తిరుమల ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. నాకు తమిళులంటే ఏమీ వివక్షలేదు.వారంటే నాకు ఎంతో గౌరవం. అయితే, తిరుమల మాదే.. అనే కొందరి గురించి.. అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.
హిందువులు అందరూ ఒకటేనంటూ.. తిరుమలను ఇస్కాన్, ఇతర రాష్ట్రాలు, లేక కేంద్రం ఆధీనంలోకి ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా నా అభిప్రాయం.
No comments:
Post a Comment