ఈ రోజుల్లో అనేక కారణాల వల్ల దృష్టి లోపాలు బాగా పెరిగాయి.చాలామందికి కళ్ళజోడు వాడే అవసరం వస్తోంది.
అయితే కళ్ళజోళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి.
కొద్దిపాటి దృష్టి లోపం ఉన్నప్పుడు రీడింగ్ గ్లాసెస్ వంటి వాటితో సరిపెట్టుకోవచ్చు.
సమస్య మరింత పెరిగితే బై ఫోకల్ గ్లాసెస్ లేక ప్రొగ్రెస్సివ్ గ్లాసెస్ వేసుకోవలసి ఉంటుంది.
ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి.
బైఫోకల్స్ అంటే కళ్ళజోడు రెండు భాగాలుగా ఉండి మధ్య ఒక గీత ఉంటుంది. ఈ గీత భాగంలో చూస్తున్నప్పుడు గందరగోళంగా ఉంటుంది.
ఇలాంటప్పుడు మెట్లు ఎక్కే సమయంలో సరిగ్గా కనిపించక పడిపోయే అవకాశం కూడా ఉంది.
అయితే ఇదంతా కొన్ని రోజులలో అలవాటు అవుతుంది లెమ్మని సర్దిచెబుతారు.
అలవాటు అవుతుందా లేదా అన్నది ఎవరి అభిప్రాయం వారిది.అలవాటు కాలేకపోయినా వేరే దారి లేక సరిపెట్టేసుకుంటారు చాలామంది.
...................
కళ్ళజోడు తయారీలో తప్పులుంటే, కొత్త కళ్ళజోడు కూడా సరిగ్గా కనిపించని పరిస్థితి ఉంటుంది.
కళ్ళజోడు షాపుకు వెళ్ళి అడిగితే కొందరు సరిగ్గా చేసి ఇస్తారు.
ఏం చేయలేం .అలాగే సర్దుకోవాలని చెప్పే వాళ్ళూ కొందరు ఉంటారు.
************
బైఫోకల్స్తో ఉన్న సమస్య నుంచి బైట పడటం కోసం ప్రొగ్రెస్సివ్ అనే కొత్త కళ్ళజోళ్లు వచ్చాయి. అయితే వీటితో కూడా సమస్యలు ఉన్నాయి.
చాలామంది విషయంలో ప్రోగ్రెస్సివ్ అద్దాలు అలవాటు కావటం కష్టమని అద్దాల తయారీ దారులు కూడా చెబుతారు.
కొందరు అద్దాల తయారీదారులేమో ప్రోగ్రెస్సివ్ మంచివి అంటారు . కొందరేమో బైఫోకలే మంచివి అంటారు.
మరికొందరేమో లేసర్ ఆపరేషన్ మంచిది కదా... అంటూ సలహాలు ఇస్తారు.
లేసర్ ఆపరేషన్తో కూడా సమస్యలు ఉంటాయి. ఇలా ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి.
కళ్ళజోడు సరిగ్గా లేకకపోతే మెడ నొప్పులు వచ్చే ప్రమాదముంది.
ఏతావాతా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే.. శరీరంలో ఏ భాగమైనా సమస్య రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటమే అన్నింటికన్నా మంచిది.
అవసరం ఉన్నా లేకపోయినా కంప్యూటర్లు, టీవీలు అదేపనిగా చూడటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.
అందువల్ల నా అభిప్రాయం ఏమిటంటే ఎంతవరకూ అవసరమో అంతవరకే టీవీని, కంప్యూటర్ వాడాలి.
అయితే దురదృష్టం ఏమిటంటే .. ఈ రోజుల్లో చాలా మందికి ఉద్యోగరీత్యా కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయ్యింది.
ఇందువల్ల ఎందరో స్పాండిలైటిస్,వెన్ను నొప్పి, నరాల సమస్యలు, కళ్ళ సమస్యలు... వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
ReplyDeleteరీడింగ్ గ్లాసెస్ తో దూరంగా కనిపించేవి చూడటం మంచిది కాదని నాకు అనిపిస్తోంది.
అంటే, దూరదృష్టి పవర్.... రీడింగ్ పవర్ వేరేగా ఉండటం జరిగినప్పుడు కళ్ళు అలసిపోయి కళ్ళనొప్పి వస్తుందనిపిస్తోంది.
రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
Delete