ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గమనించదగ్గ కొన్ని విషయాలున్నాయి.
రాజధాని అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది,
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చిపోవటానికి రవాణాసౌకర్యం బాగుండాలి...ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
...............
నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే రాజధానికి నీటికొరత ఏర్పడుతుంది.
నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు కన్నా, ఆ ప్రాంతాలకు నీరు ఇవ్వటం ఎంతో అవసరం.
అందువల్ల నీరు ఉన్న కోస్తాలో రాజధాని ఏర్పాటు చేయటం... రాయలసీమ, ఉత్తరాంధ్రాకు నీటిని ఇవ్వటం అనే ఆలోచన మంచిదే.
నీటికొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించి ఆ ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తే అన్ని ప్రాంతాల వారు సంతృప్తి చెందవచ్చు.
రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఏర్పాటు కాకుండా ..రాష్ట్రమధ్యన రాజధాని ఏర్పాటు అవటం మంచిదే.
.....................
రైతులకు భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినా అమ్మటానికి ఇష్టపడరు.
తమ భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు ఎంతో అభినందనీయులు.
రాజధాని అభివృద్ధి చెందటం అవసరమే. అయితే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందటం మరింత ముఖ్యం.
రాజధాని అభివృద్ధిని కొంత తగ్గించి అయినా, మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
రాజధాని క్రమంగా అభివృద్ధి చెందుతుంది.
అమరావతి చుట్టుప్రక్కల కూడా కొంతభాగాన్ని వ్యవసాయానికి అట్టేపెట్టి మిగతా భాగాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చేస్తే మంచిదే.
....................
రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు తరలివస్తాయంటున్నారు.
అయితే, పరిశ్రమలు రావాలంటే రాయితీలు మాత్రమే సరిపోవు.
పారిశ్రామికవేత్తలు భూమి తక్కువధరలో కావాలంటారు.
కోస్తాలో భూమి ధర ఆకాశాన్ని అంటేలా ఉంది.
భూముల రేట్లు బాగా ఎక్కువ ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా పరిశ్రమలు రావు.
అందువల్ల ఎక్కువ పరిశ్రమలను రాయలసీమ మరియు ఉత్తరాంధ్రాలో ఏర్పాటుచేస్తే తక్కువధరకే భూమి లభిస్తుంది.
అక్కడ ఉద్యోగాలూ లభిస్తాయి.
అయితే పరిశ్రమల వల్ల కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.
.....................
మాకు..
కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ..ప్రాంతాలలో బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు.
నేను.. గుడివాడ, విశాఖపట్నం, కర్నూలులో ..కొన్ని సంవత్సరాలు నివసించటం వల్ల
ఆ ప్రాంతాలు నాకు తెలుసు.
రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా ....అని కాకుండా అందరము ఒకే రాష్ట్ర ప్రజలం అని భావించాలి.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రానికి సంబందించిన అందరివీ.
............
ఆంధ్రప్రజలు కూడా ఉత్తరాంధ్ర..
రాయలసీమ..కోస్తా.. అని కాకుండా, తామంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి, అందరూ
చక్కగా ఉండాలి.
దేశంలో అన్ని ప్రాంతాలు చక్కగా అభివృద్ధి కావాలి. అయితే, కొన్ని ప్రాంతాలలో అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణకారణాలవల్ల త్వరగా అభివృద్ధి జరగదు. ఉదా.. ఎడారి భూములు, కొండప్రాంతాలు ..ఇలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి కొంచెం నిదానంగా ఉంటుంది.
పోలవరం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, త్వరగా పూర్తి చేయలేమనుకుంటే.. రెండు ప్రాజెక్టులుగా కట్టవచ్చేమో? పెద్దప్రాజెక్టుల కన్నా, చిన్నచిన్న ప్రాజెక్టుల వల్ల ఉపయోగాలున్నాయని, నష్టాలు ఉండవని కొందరు నిపుణుల అభిప్రాయం.
రాజధాని అంటే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది,
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చిపోవటానికి రవాణాసౌకర్యం బాగుండాలి...ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
...............
నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేస్తే రాజధానికి నీటికొరత ఏర్పడుతుంది.
నీటికొరత ఉన్న ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు కన్నా, ఆ ప్రాంతాలకు నీరు ఇవ్వటం ఎంతో అవసరం.
అందువల్ల నీరు ఉన్న కోస్తాలో రాజధాని ఏర్పాటు చేయటం... రాయలసీమ, ఉత్తరాంధ్రాకు నీటిని ఇవ్వటం అనే ఆలోచన మంచిదే.
నీటికొరత ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించి ఆ ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తే అన్ని ప్రాంతాల వారు సంతృప్తి చెందవచ్చు.
రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఏర్పాటు కాకుండా ..రాష్ట్రమధ్యన రాజధాని ఏర్పాటు అవటం మంచిదే.
.....................
రైతులకు భూమి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఇచ్చినా అమ్మటానికి ఇష్టపడరు.
తమ భూమిని ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులు ఎంతో అభినందనీయులు.
రాజధాని అభివృద్ధి చెందటం అవసరమే. అయితే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందటం మరింత ముఖ్యం.
రాజధాని అభివృద్ధిని కొంత తగ్గించి అయినా, మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.
రాజధాని క్రమంగా అభివృద్ధి చెందుతుంది.
అమరావతి చుట్టుప్రక్కల కూడా కొంతభాగాన్ని వ్యవసాయానికి అట్టేపెట్టి మిగతా భాగాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామంటున్నారు. అలా చేస్తే మంచిదే.
....................
రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు తరలివస్తాయంటున్నారు.
అయితే, పరిశ్రమలు రావాలంటే రాయితీలు మాత్రమే సరిపోవు.
పారిశ్రామికవేత్తలు భూమి తక్కువధరలో కావాలంటారు.
కోస్తాలో భూమి ధర ఆకాశాన్ని అంటేలా ఉంది.
భూముల రేట్లు బాగా ఎక్కువ ఉంటే ఎన్ని రాయితీలు ఇచ్చినా పరిశ్రమలు రావు.
అందువల్ల ఎక్కువ పరిశ్రమలను రాయలసీమ మరియు ఉత్తరాంధ్రాలో ఏర్పాటుచేస్తే తక్కువధరకే భూమి లభిస్తుంది.
అక్కడ ఉద్యోగాలూ లభిస్తాయి.
అయితే పరిశ్రమల వల్ల కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోవాలి.
.....................
రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రా ....అని కాకుండా అందరము ఒకే రాష్ట్ర ప్రజలం అని భావించాలి.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రానికి సంబందించిన అందరివీ.
............
రాజధాని
గురించి గొడవలు పడటం కన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం మంచిది.
భారతదేశానికి ఢిల్లి రాజధాని అని చెప్పుకుంటాము. ఇతరరాష్ట్రాల వారు వారి
రాజధాని పేరు చెప్పుకుంటారు. ఇతరరాష్ట్రాలకు కూడా వారి రాష్ట్రంలో అనేక
ప్రాంతాలుంటాయి. అయితే, వాళ్ళు కూడా రాష్ట్రం అంతటా ఒక్కటిగా భావించి, వారి
రాజధాని పేరు చెప్పుకుంటారు.
udaa..తెలంగాణాలో
ఉన్న కరీంనగర్, మెదక్, ఇంకా వేరే ఊర్ల వారు.. మా ప్రాంతంలో రాజధాని
పెట్టాలి అని అనలేదు. హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చేయటం ఏమిటి? అని కూడా
అనటం లేదు. హైదరాబాద్ ..మా రాజధాని ..అని గొప్పగా చెప్పుకుంటారు.
దేశంలో అన్ని ప్రాంతాలు చక్కగా అభివృద్ధి కావాలి. అయితే, కొన్ని ప్రాంతాలలో అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణకారణాలవల్ల త్వరగా అభివృద్ధి జరగదు. ఉదా.. ఎడారి భూములు, కొండప్రాంతాలు ..ఇలాంటి ప్రదేశాల్లో అభివృద్ధి కొంచెం నిదానంగా ఉంటుంది.
అయితే..ప్రజలు,
ప్రభుత్వాలు..అభివృద్ధి పట్ల పట్టుదల కలవారయితే, ఎడారిలో కూడా సిరులు
కురిపించి చక్కగా జీవించవచ్చు. ఒకే తల్లి కన్నబిడ్దలలో కూడా కొందరు
అభివృద్ధిలోకి వస్తారు. కొందరు వెనుకబడి ఉంటారు. ఇందుకు అనేక
కారణాలుంటాయి.కారణాలు తెలుసుకుని పట్టుదలగా పైకి రావాలి.
ప్రజలు ఒకరితో ఒకరు గొడవలు పడటం, కొట్టుకోవటం..వంటివి జరిగే ప్రాంతాలుకాని, రాష్ట్రాలు కానీ అభివృద్ధిలో వెనుకబడి ఉంటాయి. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు.. అందువల్ల అభివృద్ధి చెందాలంటే ప్రజలు గొడవలు లేకుండా చక్కగా ఉండాలి.
రాజధానికి డబ్బు సరిపోకుంటే, విజయవాడ గుంటూరు..జంటనగరాలుగా.. రాజధానిగా అమరావతివరకు సంస్థలను, కార్యాలయాలను ఏర్పాటుచేయవచ్చు.
దేశంలోని పెద్ద నగరాలు జనాభాతో కిక్కిరిసి ఉన్నాయి. మురికితో గబ్బు కొట్టే పరిసరాలు ఉంటాయి మరియు పెద్దకాంక్రీట్ కట్టడాలు, జిలుగువెలుగులు ఉంటాయి.
పెద్దనగరాలలో డ్రైనేజ్ సమస్యలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందువల్ల పెద్ద సంస్థలను చిన్న నగరాలలో కూడా ఏర్పాటు చేస్తే మంచిదని, కొంత జనాభా అటు వెళ్తారని కొందరు నిపుణుల అభిప్రాయం.
దేశంలోని పెద్ద నగరాలు జనాభాతో కిక్కిరిసి ఉన్నాయి. మురికితో గబ్బు కొట్టే పరిసరాలు ఉంటాయి మరియు పెద్దకాంక్రీట్ కట్టడాలు, జిలుగువెలుగులు ఉంటాయి.
పెద్దనగరాలలో డ్రైనేజ్ సమస్యలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందువల్ల పెద్ద సంస్థలను చిన్న నగరాలలో కూడా ఏర్పాటు చేస్తే మంచిదని, కొంత జనాభా అటు వెళ్తారని కొందరు నిపుణుల అభిప్రాయం.
పోలవరం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, త్వరగా పూర్తి చేయలేమనుకుంటే.. రెండు ప్రాజెక్టులుగా కట్టవచ్చేమో? పెద్దప్రాజెక్టుల కన్నా, చిన్నచిన్న ప్రాజెక్టుల వల్ల ఉపయోగాలున్నాయని, నష్టాలు ఉండవని కొందరు నిపుణుల అభిప్రాయం.
*************
ఆంధ్రప్రజలకు ఐక్యత లేనప్పుడు, చిన్న రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి బతుకు వారు బతకటం మంచిది. అంతేకానీ, సంవత్సరాల తరబడి అభివృద్ధి లేకుండా ఎంతకాలం?
********
కొన్ని అభిప్రాయాలను వ్రాసాను. ఇక ఎవరి అభిప్రాయాలు వారివి.

No comments:
Post a Comment