koodali

Friday, September 8, 2023

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలని..

 

Wednesday, December 10, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల..


  • పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు . 

    పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

    దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

    ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


    ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

    అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 


    వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


    వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

    వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


      శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


    శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


     ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


     మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు...మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

  • ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

    రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.


    అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
     అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

     కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  

    ******************

    గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

    బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.


    భీష్ముల  వారి  విషయంలో............

    భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


      అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

     దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  


    శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

    పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.


    కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


     భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  

  • నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.    జనకమహారాజులా.  


     నిష్కామ  కర్మతో  జీవించేవారు  ఆడంబ
    రాలు  లేకున్నా  ,   క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు . .శబరిలా .

    భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ.
  •  .....
  •  

17 comments:

  1. డబ్బు, అధికారం, స్త్రీలుపురుషులసంబంధాల..కొరకు ప్రపంచంలో అనేక గొడవలు, యుద్ధాలు జరిగాయి. కొందరు స్వార్ధపరులు, అత్యాశకలవారు..డబ్బు, అధికారం కొరకు కులం, మతం, ప్రాంతం..వంటివి ప్రజలలో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. వాళ్ళు బోలెడు డబ్బు సంపాదిస్తారు. అంతేకానీ, పేదవారికి ఏమీ సాయం చేయరు. కొద్దిగా చేసి, ఎంతో చేసినట్లు కబుర్లు చెబుతారు. సరిగ్గా చేస్తే సమాజంలో ఇన్ని అసమానతలు ఎందుకుంటాయి.

    సమాజంలో ఆర్ధికఅసమానతలు..వంటివి పరిష్కరించకుండా కులం,మతం, ప్రాంతం..అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టేవారిని నమ్మి వారివెంట పడటం ప్రజల తప్పు. చెడ్డవారిని నమ్మినప్పుడు దానికి తగ్గ ఫలితమే ఉంటుంది. కొందరు చెడ్డవారివల్ల ఎన్నో గొడవలు, యుద్ధాలు జరిగి ఎందరో కష్టాలు పడతారు.కొందరు ప్రజలు మాత్రం చెడ్డవారంటే భయంతో అన్నింటినీ భరిస్తుంటారు.

    కొందరు తమస్వార్ధం కొరకు దైవాన్ని కూడా వాడుకుంటున్నారు. దైవంపేరుతో కూడా మతాల మధ్య చిచ్చు పెడతారు. ఎన్నో సమస్యలు సృష్టిస్తారు. ఎవరి కర్మ వారిది.
    దైవమే దిక్కు.

    ReplyDelete
  2. దైవశక్తి మహాశక్తి. ఆ శక్తి స్త్రీనా పురుషుడా అని అనుకోనక్కరలేదు.ఆ శక్తి ఏ విధంగానైనా ఉండగలరు. దేవతారూపాలను ఎన్నివిధాలుగా అయినా ఆరాధించుకోవచ్చు.
    శ్రీమాతశ్రీపరమాత్మ.. అనుకోవచ్చు. ఇలా అనుకుంటే.. అన్ని దేవతారూపాలను అనుకున్నట్లే అని నాకు అనిపిస్తుంది. లేదంటే శ్రీపరమాత్మ..అని ఒక్క నామంగా కూడా అనుకోవచ్చు.

    అందరు దైవరూపాలను ఆరాధించేవారు అందరు దేవతలను చక్కగా ఆరాధిస్తారు. అయితే, కొందరు మేము ఆరాధించే దేవతా రూపాలే గొప్ప అంటారు. అలా భావించటం తప్పు అని ప్రాచీనులు తెలియజేసారు.
    సనాతనధర్మంలో దైవాన్ని ఎలాగైనా ఆరాధించుకోవచ్చు. ఎన్నో రూపాలతో ఆరాధించుకోవచ్చు. రూపం లేకుండా కూడా ఆరాధించుకోవచ్చు. ఎన్నో పద్ధతులతో ఆరాధించుకోవచ్చు. దైవస్మరణ, దైవనామ స్మరణతో కూడా ఆరాధించుకోవచ్చు. అంతేకానీ, మూఢనమ్మకాలతో భయపడుతూ ఆరాధించుకోకూడదు.

    ReplyDelete
    Replies
    1. మీరు ఇలా చాంతాడంత కామెంట్లలో మంచి ఇన్ఫర్మేషన్ పెట్టడం బాధగా ఉంది .. పోస్టులలో చెప్పండి

      Delete
    2. గత కొన్ని సంవత్సరాలుగా తెలిసినంతలో విషయాలను వ్రాయటం జరిగిందండి. కొంతకాలంగా వ్రాయటం బాగా తగ్గించాను. ఎప్పుడో మరీ వ్రాయాలనిపిస్తే వ్రాస్తున్నాను. పోస్టులు ఎక్కువగా పెంచటం ఇష్టంలేక ఇలా కామెంట్ల వద్ద వేస్తుంటాను.ధన్యవాదములండి.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. ఇంతకుముందు నేను వ్రాసిన కామెంటుకు కొనసాగింపు .. కొన్ని దేవాలయాలలో ఉపాలయాలు కూడా ఉంటాయి. ఎవరైనా.. ఎక్కువ సమయం లేకుండా హడావిడిగా దేవాలయానికి వెళ్ళినప్పుడు, అనేక దేవతారూపాల నామాలను స్మరించుకోనప్పుడు..అందరూ ఒకే దైవశక్తిగా..శ్రీమాతాశ్రీపరమాత్మా..అని..లేదంటే శ్రీపరమాత్మా..అని కూడా స్మరించుకోవచ్చు..మాతాపరమాత్మా.. అనికూడా స్మరించుకోవచ్చు.ఇక్కడ దీర్ఘం వ్రాసాను.

      Delete
  3. ఈ రోజుల్లో చాలామంది చదువులు, ఉద్యోగాల కొరకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చదువుల కొరకు బోల్డు ఫీజులు కట్టలేమంటున్నారు. పాతరోజుల్లో కొద్దిమంది మాత్రమే గురుకులాలకు వెళ్ళి వేదాలు.. నేర్చుకునేవారు. మిగతా అందరికీ.. ఏం చదవాలి? ఏం ఉద్యోగం చేయాలనే? టెన్షన్లు ఉండేవికాదు. తమపెద్దవారు ఏం వృత్తి చేస్తే అదే వృత్తిని పిల్లలూ నేర్చుకునేవారు కాబట్టి, చదువులంటూ బోలెడు డబ్బుతో ఫీజులు కట్టటం..బయటకు వెళ్లి హాస్టల్స్లో ఉండి చదువుకోవటం ఉండేవికాదు. తరతరాలుగా చేసే పని వల్ల ఎవరి వృత్తిలో వారికి ప్రావీణ్యత ఉండేది. ఎవరి పనులు వారికి ఉండేవి కాబట్టి, పోటీ ఎక్కువ ఉండేది కాదు.

    ఆ రోజుల్లో ఇప్పటిలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి, ఒక వస్తువు చేయాలన్నా చాలా సమయం పట్టేది. అందువల్ల ఎప్పుడూ పని ఉండి, నిరుద్యోగం అంతగా ఉండేది కాదు. ఇప్పటిలా విపరీతమైన వస్తు వినియోగం లేదు కాబట్టి, పర్యావరణంపాడయ్యేది కాదు.

    వ్యవస్థలో అందరికీ గౌరవం ఉండేది. కొందరు స్వార్ధపరుల వల్ల.. సమాజంలో క్రమంగా ఎక్కువతక్కువలు, అంటరానితనం, అసమానతలు వ్యాపించాయి. ఇలాజరగటం మాత్రం చాలాబాధాకరం.

    ఇప్పుడు ఆధునికయుగంలో అందరూ బయటకెళ్లి చదువుకోవటం, ఇష్టమున్నా లేకున్నా హాస్టల్స్ లో ఉండి చదువుకోవలసి వస్తోంది. ఈ రోజుల్లో అయినా మనము ఇష్టపడే చదువు చదవాలంటే..చదవగలమో? లేదో? చెప్పలేము. సీటు కొరకు ఎంతో పోటీ ఉంటుంది. ఉద్యోగం వస్తుందో? లేదో? తెలియదు. ఉద్యోగం వచ్చినా ఎన్నాళ్లు ఉంటుందో? తెలియదు. భార్యాభర్త ఒకే ఊళ్ళో ఉండగలరో? లేదో? తెలియదు. పిల్లలు ఏ ఊరిలో చదువుకుంటారో? చెప్పలేము. కుటుంబం అంటే ఈ రోజుల్లో తలొక ఊరులో ఉండటంలా పరిస్థితి ఉంది.

    ఇంటాబయటా పనివత్తిడి వల్ల, సరైన ఆహారం వండుకోవటానికి, తినడానికికూడా సమయం లేక చాలామందికి అనారోగ్యాలు వస్తున్నాయి.విపరీతంగా పర్యావరణాన్ని కలుషితం చేయటం వల్ల కూడా అనారోగ్యాలు పెరిగాయి.

    టెక్నాలజీ వల్ల యంత్రాలు వచ్చి కొంతమంది నెలరోజులు చేసేపనిని ఒక్క గంటలో వస్తువులు తయారుచేస్తున్నాయి. ఇందువల్ల నిరుద్యోగమూ పెరిగింది.

    అయితే, ఇప్పుడు మారిన ప్రపంచంలో మనం ఎంతోకొంత మారకతప్పదు. శత్రువులదండయాత్రలు జరగకుండా ఆధునికరక్షణ ఏర్పాట్లు చేసుకోకతప్పదు.

    ReplyDelete
  4. కొందరు ఏమంటారంటే, పాతకాలంలో ఎవరికి నచ్చిన వృత్తిని వారు స్వీకరించే వెసులుబాటులేదు అంటారు. పాతకాలంలో కూడా ప్రజలు వివిధమైనపనులను చేసినట్లు గ్రంధాలలోఉంది. వర్ణవ్యవస్థ కులవ్యవస్థ ఒకటికాదు. పనివిభజనతో కూడిన వర్ణవ్యవస్థ కాలక్రమేణా అనేకకులాలతోకూడిన కులవ్యవస్థగా మారిందని తెలుస్తుంది.

    అందరూ అనేకవృత్తులు చేయాలంటే, ఆధునికకాలంలోలా స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్.. పరిశ్రమలు, ఉద్యోగాలు..కాలేజీసీట్లకు పోటీలు, ఉద్యోగాలకు పోటీలు ..ఇలాంటివ్యవస్థ ఉండాలి.. ఇవన్నీ కష్టమని అప్పటివారు అలా ఉండిఉంటారు.

    ఏ వ్యవస్థలో అయినా కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పటికాలంలో ఎవరికి నచ్చినవృత్తిని వారు చేపట్టే వెసులుబాటు ఉంది. మరి ఇప్పుడుకూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. పేద..ధనిక అసమానతలు మరింత పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడచూచినా నిరుద్యోగులు ఉపాధి కల్పించమని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

    ఇప్పుటికాలంలో కూడా నచ్చినవిద్యను చదవలేనివారు ఎందరో ఉన్నారు. ఈ పోటీప్రపంచంలో బ్రతకాలంటే పోటీపడాలంటూ చిన్నతనంనుంచి కొందరుపిల్లలను ఆటలుపాటలు కూడా లేకుండా విపరీతంగా ట్యూషన్లు కూడా పెట్టేస్తారు. ఈ బండచదువులను చదవలేక కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఇంతకష్టపడినా కూడా ఉపాధి లేక ఎందరో నలిగిపోతున్నారు.

    ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ, ఎప్పుడూ పాతకాలంలో సంగతులే మాట్లాడుతూ ప్రజలమధ్య గొడవలు ఎంతకాలం?

    పరిస్థితి ఇలాగే ఉంటే, భవిష్యత్తులో ఏమని చెప్పుకుంటారంటే..19,20 శతాబ్దాలలో పేదరికం చాలాఉండేది..నిరుద్యోగసమస్యతో ఎందరో బాధలుపడేవారు. సంపద, అధికారం కొరకు కొందరు చేసిన కుల,మత, ప్రాంత గొడవలతో ప్రపంచంలో ఎందరో మరణించారు. పర్యావరణకాలుష్యంవల్ల ఎన్నో జబ్బులు వచ్చేవి..ఇలా చెప్పుకుంటారు.

    ReplyDelete
  5. వివక్ష అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉంది.విదేశాలలో విపరీతమైనపనిభారాన్ని భరించలేక కార్మికులు ఉద్యమాలు చేస్తే, పనిగంటలు తగ్గించారు. ఈ రోజుల్లోకూడా అభివృద్ధిచెందాయని చెప్పే కొన్ని దేశాలలో ప్రజలకు స్వేచ్చగా తమ అభిప్రాయాలను చెప్పే పరిస్థితి లేదు. ప్రజల కొరకు సరైన వైద్య వ్యవస్థ లేదు. కొన్నిదేశాలలో ఇప్పుడుకూడా కొందరిపట్ల వివక్ష ఉంది.

    ReplyDelete
    Replies
    1. మీరు ఇలా కామెంట్లలో విషయం పెడితే ఎవరు చదువుతారు? చెప్పాల్సింది పోస్ట్ లాగా పెడితే గూగుల్ లో కనిపిస్తుంది. మేం కామెంట్ చేస్తాం... 🙏🙏🙏

      Delete
    2. మీకు ధన్యవాదములండి.

      Delete
  6. భారతదేశంలో వర్ణవ్యవస్థ అనేది సమాజం సజావు గా నడవటంకొరకు ఏర్పరిచిన ఒకపద్ధతి. వృత్తులు..పనివిభజన.

    సాధారణంగా చాలామంది ఇంట్లో ఎవరిపనులువారే చేసుకుంటారు. పూజచేసుకోవటం,ఇంటిరక్షణ, సరుకులుతెచ్చుకుని వంట చేసుకోవటం, ఇల్లు సర్దుకోవటం..ఎవరికివారే చేసుకుంటారు. కొందరు రోజువారిపనులకు కొందరిని నియమించుకుంటారు.

    కానీ, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు పనులను విభజించి ఇస్తారు. పూజకు కొందరిని నియమించుకుంటారు. ఫంక్షన్ కు వచ్చివెళ్లేవారిని క్రమపద్ధతిలో చూడటానికి కొందరికి బాధ్యతలను అప్పగిస్తారు. అవసరమైన సరుకులుతేవడానికి, వంటలుచేయడం కొరకు కొందరికి బాధ్యతలు అప్పగిస్తారు. ఫంక్షన్ వద్ద అన్నిసక్రమంగా అమర్చటానికి,సర్దడానికి కొందరికి బాధ్యతలు అప్పగిస్తారు.

    ఇలా సమాజంలో కూడా అనేక పనులు ఉంటాయి.ఉదా..ఆఫీసులో కూడా వాచ్మెన్, క్లర్క్, ఉన్నతోద్యోగులు, చైర్మన్..ఇలా వారివారి చదువు, పనితనాన్నిబట్టి వారికి ఉద్యోగనియామకాలు ఉంటాయి.

    ReplyDelete
  7. పాతకాలంలో అన్ని వృత్తులవారికి గౌరవం ఉండేది. కాలక్రమేణా కొందరు స్వార్ధపరులవల్ల, ఇంకా అనేకకారణాలవల్ల వ్యవస్థలో వివక్షవంటివి చోటుచేసుకున్నాయి. అంటరానితనం వంటివి వర్ణవ్యవస్థలో లేవు. అవి కొందరుస్వార్ధపు ప్రజలవల్ల వచ్చాయి..అందుకు వ్యవస్థను తప్పుపట్టటం సరైనదికాదు..

    నాకు ఏమనిపిస్తుందంటే, కొందరు గ్రంధాలలో మార్పులుచేర్పులుచేసి ఇటువంటి విషయాలను ప్రవేశపెట్టి, సమాజంలో అంటరానితనం వంటివి వ్యాప్తిచెందటానికి కారణమయ్యుంటారనిపిస్తుంది.

    ReplyDelete
  8. గతంలో,ఇప్పుడూ కూడా కష్టసుఖాలున్నాయి. ఈరోజుల్లో మాత్రం జనం ఎంత సుఖంగా ఉన్నారు? స్త్రీలు,పురుషులు అందరూ డబ్బు సంపాదిస్తున్నా కూడా, మనశ్శాంతి లేదంటున్నారు. ప్రపంచమంతటా అనేక కారణాలతో కొట్టుకుచస్తునారు.

    పాతకాలంలోనూ మంచిచెడు ఉన్నాయి. ఆధునికకాలంలోనూ మంచిచెడు ఉన్నాయి. ఎప్పుడైనా చెడును వదిలి, మంచిని ఉంచుకోవాలి. సమాజంలో ఉన్న అసమానతలు పోవాలి. టెక్నాలజిని పర్యావరణహితంగా మార్చుకోవాలి.టెక్నాలజిని ఎంతవరకూ వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి.

    ఇప్పుడు ఉన్న సమస్యల పరిష్కారం కొరకు సరిగ్గా ప్రయత్నించాలి. అందరూ గొడవలు, యుద్ధాలు చేసుకుని ప్రపంచాన్ని ధ్వంసంచేసుకుంటారో? మంచిగా మార్పులుచేర్పులు చేసుకుని, ప్రపంచాన్ని శాంతిగా, శుభ్రంగా పర్యావరణహితంగా చేసుకుంటారో? ప్రపంచప్రజలే నిర్ణయించుకోవాలి.


    ReplyDelete
    Replies
    1. ఇక్కడ నేను వర్ణవ్యవస్థ.. వృత్తుల గురించి వ్రాయటం జరిగింది.

      Delete
    2. సంస్కృతము వంటి భాషలలో పదములకు అనేక అర్ధములుంటాయి. వర్ణము అంటే కూడా అనేక అర్ధములుంటాయి. గ్రంధములలో తెలియజేసిన వర్ణవ్యవస్థ అంటే ఏమి అర్ధము ఉంటుందో ....దైవానికి సరిగ్గా తెలుస్తుంది.

      Delete
  9. కొన్ని లింకులు..
    Friday, February 3, 2012
    ఈ సమస్యను మీరైతే ఎలా పరిష్కరిస్తారు ?.......
    .......................
    Friday, February 3, 2012
    నాకు తెలిసినంతలో....ఉడుతా భక్తిగా...
    .....................
    Friday, September 8, 2023
    ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

    ReplyDelete