koodali

Sunday, November 1, 2020

జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

రెండు పంచాంగాలలో ..ఒకే నక్షత్రం విషయంలో గంటల సమయం తేడా చూసి ఈ విషయం గురించి వ్రాయాలనిపించింది.

 సమయం విషయంలో ఇంత తేడా ఉంటే ..ఈ  మధ్యలో జన్మించిన పిల్లలు  ఏ నక్షత్రంలో జన్మించినట్లు? అనేది సందేహం కలుగుతుంది.

 

 ఉదాహరణ .. ఒక కాలెండర్లో  ఆశ్లేష నక్షత్రం రాత్రి 8 గంటల 38 నిమిషాల వరకూ అని ఉంటే, అంతర్జాలంలో కొన్ని పంచాంగాలలో అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకూ ఆశ్లేష నక్షత్రం ఉన్నది..అని ఉంటే ఏ సమయాన్ని తీసుకోవాలో అర్ధం కాదు.

 

  సుమారు నాలుగు గంటల సమయం తేడా ఉంటే.. ఈ నాలుగుగంటల మధ్య జన్మించిన పిల్లలు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినట్లా ? లేక  మఘ నక్షత్రంలో జన్మించినట్లా ? అనేది సందేహం.

 

  చాలామంది వివాహసంబంధాల విషయంలో నక్షత్రపొంతన వంటివి చూస్తారు. సంబంధాల విషయంలో చాలా విషయాలు నచ్చినా.. వివాహపొంతన కుదరలేదని సంబంధాలు వదులుకునే వారూ ఉంటారు.

  ఇలాంటప్పుడు జాతకాలు మొదలైన వాటి విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి.

 

 పంచాంగం రాష్ట్రంలోని వేరువేరు ప్రదేశాలలో ప్రింట్ వేసినా కూడా ఒకే రాష్ట్రంలో గంటల సమయం తేడా ఉండదు కదా? మరి ఎందుకు ఇలా జరిగిందో అర్ధం కాదు.

 మేము ఒక ముహూర్తం కొరకు సాధనతార, నైధనతార ..చూద్దామని వెతుకుతుంటే నక్షత్రం సమయంలో తేడా కనిపించింది.

 

 వివాహం విషయం మాత్రమే కాకుండా, ముహూర్తాల కొరకు సాధనతార, విపత్తార .. వంటివి పరిశీలించడానికి కూడా నక్షత్రం యొక్క సమయం అవసరం ఉంటుంది.

 

   ఇవన్నీ గమనిస్తుంటే ఏమనిపిస్తుందంటే.. కాలెండర్లను, కంప్యూటర్లో విషయములను చూడవచ్చు కానీ, తరువాత ముఖ్యమైన విషయముల కొరకు ..తెలిసిన పండితులను సంప్రదించటం మంచిది.

 

 సాయనవిధానము, నిరయన విధానము ..అయనాంశ..ఈ విధానాల గురించి  అభిప్రాయ భేదాలు ఉన్నాయట. అందువల్ల కొన్నిసార్లు .. సమయంలో  తేడా వచ్చే అవకాశముందని పండితుల ద్వారా తెలుస్తోంది. 

ఏ విధానాన్ని అనుసరించేవారు ఆ విధానాన్ని అనుసరించి చెబుతారు. 

***********

పై విషయములలో కొన్నింటిని క్రింద పోస్ట్ యొక్క  కామెంట్ వద్ద గమనించగలరు.

******************

4 comments:


  1. కొంతకాలం క్రిందట..రెండు పంచాంగాలలో .. గంట సమయం తేడా చూసి ఈ విషయం గురించి వ్రాయాలనిపించింది.

    అయితే, ఎవరైనా అపార్ధం చేసుకుంటారేమోననే సందేహంతో పోస్టులోని కొన్ని విషయాలను కామెంట్ గా పాత టపాల వద్ద వేసాను.

    అయితే, ఈ మధ్య మరల పంచాంగంలో నక్షత్రం విషయంలో కొన్ని గంటల సమయం తేడాను గమనించిన తరువాత ఇలా పోస్ట్ వేయటం జరిగింది.


    ReplyDelete
    Replies


    1. వివాహపొంతన చూసే విషయంలో అమ్మాయి మరియు అబ్బాయి యొక్క గుణగణాలు, వారికి పొంతన వంటి కొన్ని విషయాలు కొంతవరకూ తెలియవచ్చు.

      అంతేకానీ, చాలా విషయాలు తెలుసుకోవటం కష్టంగానే ఉంటుంది.

      ఉదా.. జాతకం ప్రకారం వైవాహిక జీవితం బాగున్న అమ్మాయి యొక్క (అబ్బాయి యొక్క) జాతకం.. మరియు.. జాతకం ప్రకారం వైవాహిక జీవితం బాగాలేని అబ్బాయి యొక్క(అమ్మాయి యొక్క) జాతకం పరిశీలనకు వచ్చినప్పుడు వారిద్దరికి వివాహం చేస్తే ఏమవుతుంది? వంటి ప్రశ్నలు ఎన్నో కలుగుతాయి.

      Delete

  2. ఈ మధ్య చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వివాహాలు..

    ఈ మధ్య కొన్ని మాట్రిమొనిలను గమనించితే, అందులో చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు వివాహాలు జరగక చాలాకాలంగా అలాగే ఉంటున్నట్లు తెలుస్తోంది.. ఇందుకు అనేక కారణాలుండవచ్చు.

    వధూవరులు ఒకరికొకరు నచ్చకపోవటం, ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగం..ఇలా ఎన్నో కారణాలుంటాయి.

    అయితే, ఈ మధ్య జాతకాలు కలవటం.. అనే విషయాన్ని కూడా అందరూ బాగా పట్టించుకుంటున్నారట. సంబంధం అన్నీ నచ్చినప్పుడు కూడా నక్షత్రం కలవలేదని సంబంధం వదులుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి.

    అయితే, జాతకాలు కుదరకపోతే జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయని చెబున్నారు. అవి వింటే భయం కలుగుతుంది. ఇందువల్ల, జాతకాల గురించి పండితులను సంప్రదించటం మంచిది.

    ***********
    కొందరు ఏమంటారంటే ..పాతకాలంలో జాతకాలు చూడకుండా వివాహం చేసుకున్నా కూడా బాగానే ఉండేవారు ...
    ఈ మధ్యకాలంలో జాతకాలు కలిసాయని వివాహాలు చేసుకున్నవాళ్లు మాత్రం అందరూ బాగుంటున్నారా ? అంటూన్నారు.

    జాతకాలు కుదిరాయని వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావటానికి అనేక కారణాలుండవచ్చు.

    జన్మించిన సమయం సరిగ్గా చూసిఉండకపోవచ్చు, జాతకం చూడటంలో పొరపాటు వచ్చిఉండవచ్చు, పెద్ద గండాలు లేకుండా చిన్న కష్టాలు వచ్చినా అవే పెద్ద కష్టాలు అనుకోవటం కావచ్చు, వర్తమానంలో తెలిసి తెలియక చేస్తున్న పాపాల వల్ల కష్టాలు రావచ్చు..ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి.


    జాతక విజ్ఞానాన్ని తప్పు పట్టటం సరైనది కాదు.. ఆ విజ్ఞానాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

    **********
    ఇంకో విషయం..
    ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జాతకాలను పట్టుకుని ఇద్దరు పండితుల వద్దకు వెళ్తే..
    ఒక పండితులు ..అబ్బాయి అబ్బాయి జాతకాలు కలవలేదని చెప్తే..ఇంకొక పండితులు అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిసాయి, వివాహం చేసుకోవచ్చని అన్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలో అర్ధం కాదు.

    ఇలా వ్రాసానని దయచేసి ఎవరూ అపార్ధం చేసుకోవద్దండి.

    ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే, వివాహపొంతన విషయంలో మరీ పట్టింపులకు పోకుండా దైవాన్ని ప్రార్ధించుకుని సంబంధం నచ్చితే ముందుకువెళ్ళటం మంచిదనిపిస్తుంది.

    ***************
    కొందరు మధ్యవర్తులు ఏమంటున్నారంటే, ఇంతకుముందు మేము చకచకా చాలా వివాహాలు కుదిర్చేవాళ్ళం..
    ఇప్పుడు జాతకాల విషయంలో విపరీతమైన పట్టింపు వల్ల కూడా వివాహాలు కుదర్చాలంటే చాలా కష్టంగా ఉందంటున్నారు.

    ఈ రోజుల్లో అసలే చదువుల వల్ల పిల్లలకు వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఇంకా తాత్సారం చేస్తే సంతానం కలగటం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

    ప్రతి విషయానికి విపరీతమైన సందేహాలతో హిందువులు ప్రతిపనినీ వాయిదా వేయటం సరైనది కాదు.

    ముఖ్యంగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం ఉండాలని కోరుకోవాలి.


    ReplyDelete

  3. నీటిలో ఎక్కువగా పని చేయటం వల్ల కాలి వ్రేళ్ళకు కానీ, చేతి వ్రేళ్ళకు కానీ గోరు వద్ద ఇన్ ఫెక్షన్ వస్తే AFDERM-M N..అనే ఆయింట్ మెంట్ బాగా పని చేస్తుంది.
    *అయితే, మందులను వాడటానికి వైద్యులను సంప్రదించి వారి సలహాతో వాడుకోవటం మంచిది.

    ReplyDelete