koodali

Sunday, September 13, 2020

మహిళలు వాడే శానిటరీ నాప్కిన్స్ ...


 మహిళలు నెలసరి రోజులలో వాడే శానిటరీ నాప్కిన్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాతకాలంలో కాటన్ క్లాత్ వాడి ఉతకటం చేసేవారు.

కొన్నినెలల తరువాత వాటిని  బకెట్లో వేసి కాల్చివేసి, కొత్త క్లాత్ వాడే పద్ధతి కూడా కొందరు అనుసరించేవారు.

********

ఇప్పుడు కొత్తవి రకరకాలు అందుబాటులోకి వచ్చాయి.

ఎప్పటికప్పుడు వాడి పడేసే శానిటరీ నాప్కిన్స్ లో కొంత ప్లాస్టిక్ కూడా కలుస్తుందట.

 చాలామంది మహిళలు వీటిని శుభ్రం చేయకుండానే ఎక్కడపడితే అక్కడ పారవేయటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

***********

 ఈ మధ్య కొత్త శానిటరీ నాప్కిన్స్ కొన్ని రకాలు మార్కెట్లోకి వచ్చాయి.

 ఇవి ఒకసారి కొంటే, ప్రతినెలా వాడి పడేయకుండా ... ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోవచ్చట.

అలాగని పాతకాలంలోలా పెద్ద వస్త్రం ఉండదు. చిన్న సైజు నాప్కిన్ ఉంటుంది. వీటివల్ల పర్యావరణం సమస్యలు ఉండవట.


ఖరీదుకూడా ఎక్కువేమీ కాదు. నెలనెలా వాడిపడేసేవి నెలకు సుమారు 60 నుంచి 150 వరకు ఖరీదు అవ్వచ్చు.

కొత్తరకం నాప్కిన్లు  సంవత్సరానికి ఒక్కసారి 499 రూపాయలు ధరకు కొంటే సుమారు ఒక సంవత్సరం వరకూ వాడుకోచ్చంటున్నారు.

వీటిని గదిలో ఫాన్ క్రింద వేసినా ఆరిపోతాయి.

ఎప్పుడయినా బయట ఎండలో కుర్చీ పైన వేసి.. కొంతసేపు ఎండిన తరువాత తీసుకోవచ్చు.

******

  వివరాలను క్రింద లింక్ వద్ద చూడగలరు..

PEESAFE Brand.. Reusable Sanitary Pads ..12 + Months ..ZeroWaste.. Cost..499 Rupees .

100% Organic Cotton | Pee Safe Biodegradable Sanitary Pads

*********

అరటినార వంటి వాటితో కూడా శానిటరీ నాప్కిన్స్ తయారుచేస్తున్నారు, వీటిని వాడి ఎప్పటికప్పుడు బయటపడేయవచ్చు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయట. 

మెన్స్ట్రువల్ కప్స్ కూడా వచ్చాయట.


9 comments:



  1. మహిళలు ధరించే లోదుస్తులు అప్పుడప్పుడయినా బాగా ఎండలో ఎండబెడితే మంచిది.

    ఇంటి చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటే తీగపైన వేసే లోదుస్తులు అందరికీ కనిపిస్తాయని ఇబ్బందిగా ఉంటుంది.

    ఇలాంటప్పుడు ఎండ వచ్చే దగ్గర తీగపై లోదుస్తులను వేసి, వాటిపై పలుచని చున్నీని వేసి క్లిప్ పెడితే లోదుస్తులు అందరికీ కనిపించవు. ఎండకు చక్కగా ఆరతాయి.

    ******
    చిన్నపిల్లల దుస్తులు కూడా ఎండలో ఆరపెడితే మంచిది.

    **********
    మగవారి అండర్ గార్మెంట్స్ కూడా ఎండలో ఆరపెడితే మంచిది.
    **********
    అప్పుడప్పుడు దుస్తులను వేడినీటిలో ఉతుక్కుంటే మంచిది.

    ఎప్పుడూ వేడినీటిలో దుస్తులను ఉతికితే రంగులు పోతాయనుకుంటే..వారానికి ఒకసారయినా వేడినీటిలో సర్ఫ్ వేసి దుస్తులను నానబెట్టి.. ఉతుక్కుంటే దుస్తులు బాగా శుభ్రంగా ఉంటాయి.

    ReplyDelete


  2. వాకింగ్ చేస్తే మనస్సు, శరీరం తేలిక పడే అవకాశం ఉందని వాకింగ్ చేస్తారు కొందరు.

    అయితే, వాకింగ్ చేసేటప్పుడే దైవనామ స్మరణ చేస్తే ఇంకా మంచిది.

    బయటకు వెళ్ళే అవకాశం లేనివారు ఇంట్లోనో, ఇంటి ముందర కొద్దిస్థలంలో కూడా వాకింగ్ చేయవచ్చు.
    **********

    ఈ మధ్య యువతలో చాలామంది జీవితంలోని ఒడిదుడుకులవల్ల చెడు అలవాట్లకు లోనవుతున్నారు.

    జీవితంలో కొంతయినా కష్టనష్టాలు సహజం. వాటిని తట్టుకోలేకపోతున్నామంటూ చెడ్డపనులను అలవాటు చేసుకుంటే జీవితంలో కష్టాలు తప్పవు.

    మనస్సు స్థిరంగా ఉండటానికి దైవనామ స్మరణ అలవాటుచేసుకుంటే మంచిది.

    కష్టాలను తప్పించుకోవటానికి ..వర్తమానంలో మంచికర్మలను చేస్తూ, దైవనామ స్మరణ చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల జీవితంలో మంచి జరిగే అవకాశం ఉంది.

    ఒకవేళ ..గతజన్మలో చేసిన చెడు కర్మ బలంగా ఉన్నప్పుడు.. ప్రస్తుతం కష్టాలు తప్పకపోయినా, కష్టాల బాధ కొంత తగ్గవచ్చు.

    ఇప్పుడు చేసిన దైవస్మరణ ఫలితం వృధాపోదు.ఎప్పటికయినా తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది.

    చెడు అలవాట్లకు బానిసలయితే మాత్రం ఇహమూ, పరమూ రెండిటికి చెడే అవకాశం ఉంది.
    .............

    పెద్దలు ఏం చెబుతారంటే..మన మనస్సు, బుద్ది చాలా శక్తివంతమైనవని అంటారు. మనం దేనినైన బలంగా అనుకుంటే అది జరిగే అవకాశముందంటారు.

    ఉదా..ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆ జబ్బు తగ్గేలా.. శరీరం రోగనిరోధకశక్తి పెంచుకుని పోరాడి గెలవాలని శరీరానికి ఎవరికి వారే సూచనలను ఇచ్చుకోవచ్చు.

    అలా అనుకున్నంత మాత్రాన జరిగిపోతుందా .. అని నిరాశ పడకూడదు.ప్రయత్నించటంలో లాభం జరిగే అవకాశం ఉంది ..నష్టమయితే ఉండదు.

    అయితే అందుకు తగ్గట్లుగా సక్రమంగా ప్రవర్తించాలి.

    అంతేకానీ, అనారోగ్యం తగ్గాలని శరీరానికి సూచనలు ఇస్తూ.. రోగం పెరిగే విధంగా ఇష్టం వచ్చినట్లు తిని, తిరిగితే మాత్రం ఫలితం సక్రమంగా ఉండదు.

    ఇంకా, ఈ విషయంలో ఫలితాన్ని మన గతకర్మఫలం వంటివి కూడా ప్రభావితం చేస్తాయి.

    అందువల్ల, జీవితంలో మంచి జరగాలంటే..దైవభక్తి కలిగిఉండటం, చేస్తున్న కర్మలు మంచిగా ఉండేలా ప్రయత్నించటం తప్పనిసరి.

    మనం జీవితంలో సరైన విధంగా ప్రవర్తించేలా తగిన బుద్ధిశక్తిని ఇవ్వమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

    ReplyDelete

  3. శారీరికశ్రమ చేసే వాళ్ళకు బలవర్ధకమైన ఆహారం అవసరం. బలవర్ధకమైన ఆహారం తీసుకున్నా శారీరికశ్రమ వల్ల వారికి ఆహారం త్వరగా అరుగుతుంది.

    కొందరు ఏమనుకుంటారంటే.. శారీరిక శ్రమ చేసేవారికే ఎక్కువ ఆహారం అవసరం..ఒకే దగ్గర కూర్చుని మానసికశ్రమ చేసే వారికి ఎక్కువ ఆహారం అవసరం లేదనుకుంటారు.

    శారీరక శ్రమచేసేవారికి, మానసికశ్రమ చేసేవారికి కూడా బలవర్ధకమైన ఆహారం అవసరం.

    శారీరికశ్రమ లేని వారు ఎక్కువ ఆహారం తీసుకుంటే సరిగ్గా అరగక లావు అయిపోతారని అనుకుంటారు చాలామంది.

    అయితే, మానసిక శ్రమ చేసే వారికి కూడా బలవర్ధకమైన ఆహారం అవసరం. బలవర్ధకమైన ఆహారం తీసుకోకుంటే వాళ్లు కూడా నీరసపడిపోతారు.

    ఉదా..విద్యార్ధులు, ఐటీ ఉద్యోగులు..ఇలాంటి వాళ్ళు ఒకే దగ్గర కూర్చుని ఆలోచించే పని వల్ల వారికి మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది.

    పరీక్షల్లో చదివే పిల్లలను గమనిస్తే ఆకలి ఎక్కువగా అవటం మనం గమనించవచ్చు. ఎక్కువగా ఆలోచించటం వల్ల నీరసం రాకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.

    అయితే, ఒకే దగ్గర కూర్చుని మానసిక శ్రమ చేసేవారు లావు అవ్వకుండా వాకింగ్ వంటివి చేస్తే మంచిది.

    లావు అవ్వకూడదని ఆహారం తక్కువ తింటే మాత్రం నీరసం వచ్చే అవకాశం ఉంది.

    ReplyDelete
  4. చాలా మంచి మంచి చిట్కాలు, టపాలలో పొందు పరుస్తున్నారు అనురాధ గారు. ఇలాంటి విలువైన సమాచారం అతి తక్కువ మంది మాత్రమే తెలియజేస్తారు.

    ReplyDelete
  5. ధన్యవాదములండి.
    నాకు తెలిసిన విషయాలు ఎవరికైనా ఉపయోగపడాలని వ్రాసానండి.

    ReplyDelete

  6. ఆధునిక కాలంలో కొందరికి మలబద్ధకం సమస్య తరచు వస్తోంది. మలబద్ధకం వల్ల చాలా సమస్యలు వస్తాయి. మలం గట్టిగా ఉంటే ముక్కలేక గుండె జబ్బు కూడా వచ్చే ప్రమాదముంది. మలం గట్టిగా ఉంటే మలద్వారం వద్ద కట్ అయి రక్తం కూడా అవకాశం ఉంది.

    అందువల్ల మలవిసర్జన సాఫీగా జరగాలంటే ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్దాలు ఎక్కువగా తినాలి. నీరు సరిపడా త్రాగాలి.

    మలం పలుచబడటానికి మందులు ఉంటాయి. అయితే, కొందరికి కొన్ని మందులు సరిగ్గా ఉపయోగపడకపోవచ్చు. అలాంటప్పుడు వేరే మందులు ప్రయత్నించాలి.

    త్రిఫల పొడి వంటివి ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకోవచ్చు. ఆయుర్వేదంలో సోనాముఖి వంటివి వాడుతారు. Cusena..అనే టాబ్లెట్ రోజుకు ఒకటి చొప్పున వారం రోజులు వరకు వాడవచ్చు.

    అయితే ఇవన్నీ ఎక్కువరోజులు వాడకూడదట. ఎక్కువ రోజులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందట. అందువల్ల వైద్యుల సలహా ప్రకారం వాడుకోవాలి.

    అయితే, దోసపండు తింటే సాఫీగా విరేచనం అవుతుందని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది.

    దోస పండు అంటే అంటే కీరా దోస కాయ కాదు. కూరకు వాడే దోసకాయలు బాగా పండినవి తెచ్చుకుని, గింజలు తీసివేసి తింటే మలబద్ధకం సమస్య ఉండదని అంటారు. దోసకాయలను తెచ్చి ఫ్రిజ్లో కాకుండా బయట ఉంచితే పండుతాయి.


    మందులు ఎక్కువ రోజులు వాడకూడదు. దోసపండు, జామపండు వంటివి రోజూ తిన్నా ఏమీకాదు. ఎండుద్రాక్ష , ఖర్జూరాల వంటివి నీటిలో నానబెట్టి తినవచ్చు. ఇలాంటివి వాడుకుని మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు.

    మలద్వారం వద్ద నొప్పి ఉన్నవారు ఆయింట్మెంట్ వాడుకోవచ్చు.

    కొన్ని ఆంటిబయాటిక్ మందుల వాడకం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది.

    డెలివరి సమయంలోనూ, ఆపరేషన్ అయినవారిలోనూ, దీర్ఘరోగాల వల్ల మంచం మీద ఉన్నవారిలో కూడా మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి ఎనిమా చేయటం, మలద్వారం వద్ద కాప్సూల్ ఉంచి సాఫీగా విరేచనం చేయటం వంటివి చేస్తారట.

    ReplyDelete

  7. దోసపండు తినటం ఇష్టం లేనివారు తర్బూజా పండు తినవచ్చు.

    ReplyDelete
  8. కొందరు ఏమంటున్నారంటే.. ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి వంటి.. వివిధ రకాల మందులను ఒకేసారి వాడకూడదంటున్నారు.
    కాబట్టి వైద్యులను సంప్రదించి మందులను వాడుకోవటం మంచిది.

    ReplyDelete
  9. ఇప్పుడు చాలామంది పిల్లలకు పరీక్షల సమయం. టెన్షన్ గా ఉంటుంది.

    మంచి ఆహారం తీసుకోవటం, కొద్దిసేపు ధ్యానం, ప్రాణాయామం చేయటంతో పాటు..

    ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారం బ్రాహ్మి, త్రిఫల..వంటివి వాడితే పరీక్షలకు చదువుకునే పిల్లలు టెన్షన్ తట్టుకోగలరు.

    ReplyDelete