Friday, April 21, 2017
చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే సంతోషాన్ని , ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.
( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)
ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************
రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.
దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..
ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.
భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుందని తెలుస్తుంది.
*********
జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని, దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.
పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.
*************
ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!
************
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)
ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
*******************
రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.
దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు..
ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.
భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుందని తెలుస్తుంది.
*********
జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా .. తమ చెడు ప్రవర్తనను మార్చుకుని, దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.
పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.
*************
ఈ రోజుల్లో కూడా ..జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు , ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా!
************
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
....................
కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)
అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.
కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)
అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.
****************
దైవం ఎన్నో జీవులకు ఇవ్వని తెలివితేటలను మానవులకు ఇచ్చారు. అయితే, ఎన్నో జీవులు లోకానికి ఉపయోగపడుతుండగా , మనుషులు మాత్రం దైవానికి ఇష్టం లేని అధర్మమైన పనులు చేస్తూ.. సమాజానికి సమస్యగా తయారవుతున్నారు. ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.
**********
* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి, దైవభక్తి కలిగి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.
***********
ఒక వ్యక్తికి చిన్న కష్టాన్ని కలిగించి, రాబోయే పెద్ద కష్టాన్నుండి ఆ వ్యక్తిని తప్పించటం గురించి ఒక యోగి ఆత్మకధ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.
ReplyDeleteదైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.
Delete
Deleteకొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.
తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు.
ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.
నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా శిక్ష పడక తప్పకపోవచ్చు.
ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!
చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.
పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.
అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.
అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
ఎవరైనా సరే, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం కన్నా ముందే మనస్సును అదుపులో ఉంచుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించటం మంచిది.
సమాజంలో నేరస్తులు తయారుకావటానికి ఎన్నో కారణాలుంటాయి.
కొందరు సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా పనులు చేసి డబ్బును సంపాదిస్తారు.
సమాజానికి హాని కలిగించే చర్యల ద్వారా డబ్బు సంపాదించేవారు ఈ లోకంలో శిక్ష నుండి తప్పించుకున్నా కూడా ...దైవం ఇచ్చే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.
**
మనస్సును నిగ్రహించుకోవటం అత్యంత కష్టమే. అయితే, కష్టాలు రాకుండా ఉండాలంటే మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించచటం తప్పనిసరి.
నిగ్రహాన్ని, సరైన విధంగా ప్రవర్తించే శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధించుకోవాలి.
Deleteసమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం?
జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.
జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.
జీవులు పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవంపై భారం వేసేయటం కాకుండా, ముందే మనస్సును నిగ్రహించుకోవాలి.
చేసిన పాపాల ఫలితంగా కష్టాలు అనుభవించటం కన్నా, ముందే మనస్సును నిగ్రహించుకోవటం మంచిది.
Deleteదేవలోకంలో ఉన్నవారు కొందరు.. లోకరక్షణ కొరకు.. కొన్నిసార్లు భూమిమీదకు వచ్చి కొన్ని క్రియలను చేస్తారు.
..
కొందరు తమ గతకర్మఫలితాలను అనుభవించటం ద్వారా క్షయం చేసుకుంటారు.
..
కొందరు కర్మానుభవాన్ని మరుజన్మకు వాయిదా వేసుకుంటారు.
..
వర్తమానంలో సంపాదించిన తపశ్శక్తిని వినియోగించి గతకర్మఫలితాలను దగ్ధం చేసుకుంటారు కొందరు.
..
తపశ్శక్తిని వెచ్చించటం ఇష్టం లేక.. గతకర్మఫలాన్ని అనుభవించటం ద్వారా కర్మక్షయం చేసుకోవటానికి సిద్ధపడతారు కొందరు.
ధ్యానం వంటి విధానాల ద్వారా కష్టాన్ని తగ్గించుకుంటారు కొందరు.
కష్టం అనుభవించేటప్పుడు. ధ్యానం వంటి విధానాలు అవలంబించటం వల్ల బాధలు అంతగా తెలియవంటారు.
..
కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.
..
పాపాలు చేసినప్పుడు కొంతయినా శిక్ష ఉండవచ్చు. చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని పొంది మంచిగా జీవించటానికి ప్రయత్నించుతూ..దైవాన్ని ప్రార్ధించుకుంటే కష్టాలు తీరే అవకాశం వస్తుంది.
..
జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలంటే ముందే మనస్సును దృఢపరచుకోవటం మంచిది. శక్తి చాలకుంటే సరైన దారిలో నడిచేలా శక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్దించుకోవచ్చు.
Deleteదైవం పరమానందభరితులు, సర్వజ్ఞులు, దయాసముద్రులు.
జీవులు అంతా పరమానంద స్థితిని పొందాలని దైవం యొక్క అభిప్రాయం.
లోకాసమస్తాసుఖినోభవంతు అనుకోవాలని పెద్దలు తెలియజేసారు. అందరూ అలా బలంగా అనుకుంటే ఆ భావనా బలం వల్ల క్రమంగా ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది.
ఏది, ఎప్పుడు, ఎలా జరిపించాలో దైవానికి తెలుసు. సృష్టిలో జీవులకు అన్నీ సమకూర్చినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.
శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం. ...
ReplyDeleteఈ రోజుల్లో సమాజంలో పెరుగుతున్న చెడును గమనిస్తే చాలా బాధ కలుగుతుంది.
కొందరు ప్రజలు పైకి చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండటం లేదు.
భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు.
భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు?
బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు,
లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.
****************
ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.
ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.
అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు.
శిక్ష వల్ల తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.
చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు , ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు.
అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.
ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
****************
రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.
పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.
****************
కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.
తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?
దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.
శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.
శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.
అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
*******************
కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.
ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.
***************
ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి.. సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి.
అంతా దైవం దయ.
Deleteకొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వాటిలోని అంతరార్ధాలు అందరికీ సరిగ్గా అర్ధం కావు.
ఎవరైనా ఏ విషయంలోనైనా కష్టాలు అనుభవిస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలుంటాయి.
గ్రంధాలలో గమనిస్తే,
సాందీపని ముని శ్రీకృష్ణుని గురువు. గురు దక్షిణగా .. శ్రీకృష్ణుడు వారి గురువు గారైన సాందీపని మహర్షి యొక్క మరణించిన పుత్రులను .. పునర్జీవితులుగా తెచ్చి ఇచ్చారు.
అయితే, భారత యుద్ధంలో అర్జునుని పుత్రుడైన అభిమన్యుని బ్రతికించలేదు. కానీ, అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తుకు జీవితాన్ని ఇచ్చారు.
ఎన్నో సంఘటనలు ఉన్నా..సృష్టిలో ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో, ఎవరి జీవితంలో ఏ సంఘటనలు ఎందుకు జరుగుతాయో? అనే కారణాలు అందరికీ అర్ధం కావు.
దైవానికి అన్ని రహస్యాలు తెలుస్తాయి.
ReplyDeleteఈ జన్మలో కష్టాలు వచ్చాయంటే, కేవలం ఈ జన్మలో చేసిన కర్మలే కారణం కాకపోవచ్చు.
గత ఎన్నో జన్మలలో చేసిన కర్మలు కూడా కారణం కావచ్చు.
మంచివాళ్ళు, గొప్పవాళ్లు అనే పేరున్న కొందరిలో కూడా కొన్ని బలహీనతలు ఉండవచ్చు. ఉదా..గొప్ప వ్యక్తి అనే పేరున్న మనిషిలో కూడా కోపం....వంటి గుణాలున్నప్పుడు, ఆ గుణాల వల్ల ఇతరులు బాధపడినప్పుడు కూడా వ్యక్తికి కష్టాలు రావచ్చు.
ధర్మమార్గంలో జీవించే ప్రయత్నం చేయాలి.. సరైన మార్గంలో ప్రవర్తించే శక్తిని ఇమ్మని దైవాన్ని ప్రార్ధించాలి.
అంతా దైవం దయ.
ReplyDeleteదైవం గురించి.. ఎందరో పండితులు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. వాటిలో కొన్ని విషయాలు..
కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అయితే, దైవం దయ ఉంటే.. కష్టాలు వచ్చినా కూడా కష్టం అనిపించదు.
ఉదా.. ఆపరేషన్ అనేది నొప్పితో కూడిన వ్యవహారం. అయితే వైద్యులు పేషెంటుకు మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయడం వల్ల ఆపరేషన్ జరుగుతున్నా కూడా పేషెంటుకు నొప్పి తెలియదు.
అలాగే దైవకృప ఉంటే..కష్టాలు వచ్చినా కూడా బాధ తెలియకుండానే కష్టాలు గడచిపోతాయి.
దైవకృపను మరింతగా పొందగలిగితే కష్టాలు ఉండవు.
ధ్యానంలో కొన్నిగంటలు కదలకుండా కూర్చోవాలంటేనే సామాన్యులకు చాలా కష్టం. దైవాన్ని శరణు వెడిన యోగులు తపస్సు చేస్తూ శరీరంపైన పుట్టలు పెరిగినా చలించకుండా కొన్ని నెలలు తపస్సును కొనసాగించినట్లుగా గ్రంధాల ద్వారా తెలుస్తుంది. వారు ఆత్మానందంలో ఉంటారు. కష్టాలు వారిని బాధించలేవు. సమాజంలో కొందరు గొప్పవ్యక్తుల జీవితాలను గమనిస్తే, అంత గొప్పవారు కూడా కష్టాలను ఎందుకు అనుభవించవలసి వచ్చిందో? అని సందేహాలు కలగవచ్చు. దైవాన్ని శరణు వేడిన వారు.. కొన్నికారణాల వల్ల జీవితంలో కష్టాలను అనుభవించినట్లుగా ప్రపంచానికి అనిపించినా ...వారు ఆత్మానందంలో ఉంటారు. కష్టాలు వారిని బాధించలేవు.
ReplyDeleteధ్యానంలో కొన్నిగంటలు కదలకుండా కూర్చోవాలంటేనే సామాన్యులకు చాలా కష్టం. దైవాన్ని శరణు వెడిన యోగులు తపస్సు చేస్తూ శరీరంపైన పుట్టలు పెరిగినా చలించకుండా కొన్ని నెలలు తపస్సును కొనసాగించినట్లుగా గ్రంధాల ద్వారా తెలుస్తుంది. వారు ఆత్మానందంలో ఉంటారు. కష్టాలు వారిని బాధించలేవు. సమాజంలో కొందరు గొప్పవ్యక్తుల జీవితాలను గమనిస్తే, అంత గొప్పవారు కూడా కష్టాలను ఎందుకు అనుభవించవలసి వచ్చిందో? అని సందేహాలు కలగవచ్చు. దైవాన్ని శరణు వేడిన వారు.. కొన్నికారణాల వల్ల జీవితంలో కష్టాలను అనుభవించినట్లుగా ప్రపంచానికి అనిపించినా ...వారు ఆత్మానందంలో ఉంటారు. కష్టాలు వారిని బాధించలేవు. వారికి వచ్చిన ఆ కష్టాలు కూడా తాత్కాలికమే.
Deleteదైవం గురించి.. ఎందరో పండితులు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. వాటిలో కొన్ని విషయాలు..
ReplyDeleteకొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అయితే, దైవం దయ ఉంటే.. కష్టాలు వచ్చినా కూడా కష్టం అనిపించదు.
ఉదా.. ఆపరేషన్ అనేది నొప్పితో కూడిన వ్యవహారం. అయితే వైద్యులు పేషెంటుకు మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయడం వల్ల ఆపరేషన్ జరుగుతున్నా కూడా పేషెంటుకు నొప్పి తెలియదు.
అలాగే దైవకృప ఉంటే..కష్టాలు వచ్చినా కూడా బాధ తెలియకుండానే కష్టాలు గడచిపోతాయి.
దైవకృపను మరింతగా పొందగలిగితే కష్టాలు ఉండవు.
దైవ కృప ఉన్నంత మాత్రాన విధి రాతను తప్పించు కోలేము
ReplyDeleteదైవకృపను పొంది.... భక్త మార్కండేయుడు, సతీసావిత్రి.. వంటివారు తమ జీవితాలను మార్చుకున్నారు.
Deleteఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.
ReplyDeleteచెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.
గొప్ప మహానుభావులకు ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. అయితే, కర్మలకు సంబంధించి ఎవరికర్మ ఏమిటి? దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది..మనకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అవన్నీ దైవానికి తెలుస్తాయి.
కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.
ReplyDeleteఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
మూఢనమ్మకాలతో కొందరు తాము భయపడుతూ ఇతరులను భయపెడుతుంటారు. వారి మాటలను నమ్మి చాలామంది మూఢనమ్మకాలను ఆచరించే విషయంలో వారి కుటుంబసభ్యులతో గొడవలు పడతారు. మూఢనమ్మకాల వల్ల ఎందరో బాధలు పడతారు. అలా బాధపడిన వారి ఉసురు..మూఢనమ్మకాలను చెప్పిన వారికి కూడా కొంత తగిలే అవకాశముంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా జాగ్రత్తగా చెప్పాలి.
ReplyDeleteకొందరు తమకు తోచినట్లు ఎన్నో విషయాలను చెబుతున్నారు. గ్రంధాలలో ఉన్న విషయాలలో కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి. అందువల్ల విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి.
ReplyDeleteదైవం అంటే కూడా భయపడుతూ ఉండటం అనేది బాధాకరమైన విషయం. మనుషులకు దైవం అంటే ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయంగా, అరమరికలు లేకుండా మన కష్టసుఖాలను అన్నింటినీ చెప్పుకోగలిగిన ఆత్మీయశక్తిగా ఉండాలని అందరికీ అనిపిస్తుంది.
ReplyDeleteదైవం అంటే గౌరవంతో కూడిన భయభక్తులు ఉండవచ్చు కానీ, దైవపూజ అంటే భయపడుతూ ఏం తప్పులు వస్తే ఏం కష్టాలు వస్తాయో? అనే విధంగా ఉండకూడదు.
***
ReplyDeleteదైవం మనలో ఉన్నారు..సృష్టి అంతా ఉన్నారు. మనలోనే ఉన్న దైవాన్ని ఎప్పుడైనా చక్కగా స్మరించుకోవచ్చు. ప్రతిదానికి ఇలా చేయకూడదు, అలా చేయాలి..అనుకుంటూ భయపడుతూ దైవానికి దూరమవ్వకూడదు.