koodali

Friday, January 24, 2014

పాపాలు పండే రోజు ఎప్పుడు వస్తుందో ...

 
 
ఈ  మధ్య  సమాజం  గందరగోళంగా  తయారయ్యింది.  నైతికవిలువలకు  ప్రాముఖ్యత  తగ్గిపోవటం  బాగా  కనిపిస్తోంది.  టెక్నాలజీ   వల్ల  అశ్లీల  దృశ్యాలు  అరచేతిలో    చూడటానికి   అందుబాటులోకి  వచ్చాయి.

 భారతీయ  సంస్కృతి  గొప్పది  అంటూ  పైకి  చెప్పటమే  కానీ   విదేశీ  సంస్కృతి  అంటే  మోజు పడుతున్న  ప్రజల  సంఖ్య  పెరుగుతోంది. 


 సమాజంలో  నేరాలు  ఘోరాలు  జరుగుతున్నాయంటే  అందుకు  ఎన్నో  కారణాలుంటాయి. 


 పిల్లలను  చక్కటి   పౌరులుగా  తయారుచేస్తే  సమాజంలో  నేరాలు  ఘోరాలు  గణనీయంగా  తగ్గుతాయి.  అందుకు  తల్లితండ్రుల   బాధ్యత  ఎంతో  ఉంటుంది. 

 * తల్లితండ్రులు  పిల్లలను  ప్రేమగా,  బాధ్యతగా  పెంచాలి.   మంచి  పౌరులుగా  తయారుచేయాలి. 


  క్రమశిక్షణ పేరుతో  అతిగా  ఆంక్షలు  విధించటము...అతి  స్వేచ్చనిచ్చి  వదిలేయటం  రెండూ  తప్పే.  

సంపాదన  కోసం  అంటూ  కుటుంబసభ్యులు  ఎవరిదారిన  వాళ్ళు  పోతున్న  వ్యవస్థ   పెరిగిన   ఈనాటి  సమాజంలో  పిల్లలు   ప్రవర్తనలో  గణనీయమైన  మార్పులు  వస్తున్నాయి. 


కొందరు  పెద్దవాళ్ళు  తమ  విలాసాల  మోజులోపడి  కుటుంబాన్ని  నిర్లక్ష్యం  చేస్తుంటారు.


  బాధ్యతారాహిత్యంగా  తిరిగే  తల్లితండ్రుల  పాపం  ఎప్పుడు  పండుతుందో...

* టెక్నాలజీ  ద్వారా   విచ్చలవిడిగా  వ్యాపిస్తున్న  అశ్లీలతకు  అడ్దుకట్ట  వేయవలసిన  అవసరం  ఉంది. 


కొన్ని   సినిమాలు,  సీరియల్  కధలు  మరియు  మీడియా  ద్వారా  ప్రసారమయ్యే  అసభ్య  కార్యక్రమాలు  సమాజంపై  చాలా  ప్రభావాన్ని  చూపిస్తున్నాయి. 



 ఇలాంటి  కార్యక్రమాలను  ప్రసారం  చేస్తున్న  వారికి,  పత్రికలలో  అశ్లీల  చిత్రాలు  వేసి  డబ్బు  సంపాదిస్తున్న  వారికి  పాపాలు  పండే  రోజు  ఎప్పుడు  వస్తుందో ...


* మద్యం  వల్ల    ఎన్నో   కుటుంబాలు  ఆర్ధికంగా  చితికిపోతున్నాయి.  ఆరోగ్యాలు  పాడవుతున్నాయి.  ఆ  మత్తులో  నేరాలూ    చేస్తున్నారు.  



    మద్యం  వల్ల   డబ్బు  సంపాదిస్తున్న  వారికి   పాపాలు  పండే  రోజు  ఎప్పుడు  వస్తుందో ...


   ప్రజల  సంరక్షణను  చూడవలసిన   ప్రభుత్వాలే  ఆదాయం  కోసం  అంటూ  మద్యాన్ని   ప్రోత్సహిస్తున్నప్పుడు  ఇక  చెప్పటానికి  ఏముంది ?



*   ప్రభుత్వాలు  ,  తల్లితండ్రులు,   విద్య  నేర్పించే వ్యవస్థ  , పటిష్టంగా  అమలవుతున్న   చట్టం...  ..ఇలా  వ్యవస్థ  అంతా   కలిసికట్టుగా  పనిచేస్తేనే  నేరాలు...ఘోరాలు  తగ్గుతాయి.


 
  

8 comments:

  1. పాపాలు పండే రోజెప్పుడొస్తుందో అని కూచోడంకాదండి. ఒక కంపెనీ వారు నెలకి ముఫై రూపాయల చొప్పున అశ్లీల దృశ్యాలు చూపడానికి ఇస్తుంటే మహిళలు అడ్డు పడి అప్పు చేశారు. మన్మూ మన ప్రయత్నం చెయ్యాలండి.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమే మీరు అన్నట్లు మన ప్రయత్నం మనం చేయవలసిందే.
      అయితే అసభ్యకరమైన పనులు చేస్తున్న వారిలో మహిళలూ ఉంటున్నారు.
      మహిళల భాగస్వామ్యం లేకపోతే ఇలాంటివి తగ్గుతాయి కదా !
      పిల్లలను పెంచే విషయంలో తండ్రుల కన్నా తల్లుల పాత్రే ఎక్కువ.
      తల్లులు పిల్లలను పెంచేటప్పుడు.... మగపిల్లలకు స్త్రీల పట్ల గౌరవం ఉండే విధంగా ...ఆడపిల్లలకు పురుషుల పట్ల గౌరవం ఉండే విధంగా పెంచితే చాలా సమస్యలు తగ్గుతాయి.

      Delete
    2. ఇది ఒకపట్టాన పోయే విషయం కాదండీ. స్త్రీలు కూడా మనుషులే అన్న నిజాన్ని మొగవారికి అర్ధం కావాలి. తల్లి తండ్రులు పిల్లలకు ఈ సత్యాన్ని చిన్నప్పిటి నుండే నేర్పిస్తే తప్ప ఇది జరగదు.

      Delete


    3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      స్త్రీలను గౌరవించే మగవారు కూడా ఉంటారండి.
      స్త్రీలు బాధలు పడటంలో కొందరు మగవారి పాత్ర ఉన్నట్లే .... స్త్రీల బాధలకు కొందరు స్త్రీలు కూడా కారణమే.

      కోడలిపై కిరోసిన్ పోసే అత్త స్త్రీనే కదా !

      కాళ్ళు చేతులు పనిచేయని అత్తను కాలువ ప్రక్కన పడేసిన కోడలు స్త్రీనే కదా !

      వివాహితుడైన పురుషుని వెంటపడి అతని భార్య, పిల్లల కష్టాలకు కారణమయ్యే స్త్రీ ....స్త్రీనే కదా !


      Delete
  2. చనిపోయేలోగా వాళ్ళ పాపం పండే రోజు వస్తుంది.

    ReplyDelete
    Replies

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      చనిపోయేలోగా వాళ్ళ పాపం పండే రోజు వస్తుంది. లేక
      చనిపోయిన తరువాతైనా చేసిన పాప ఫలితాన్ని అనుభవించక తప్పదు.

      Delete
  3. సమాజం పట్ల మీ ఆవేదన అభినందనీయం .బగా వ్రాసారు patla mee

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete