koodali

Monday, January 20, 2014

* అందుకేనేమో దైవం సునామీలనూ, సుడిగాలులనూ కూడా సృష్టించారు....* కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....


దైవం, ఈ భూలోకంలో మానవులను , వారి ఆహారానికి అవసరమైన మొక్కలనూ సృష్టించారు.

మొక్కలను సృష్టించటానికి ముందే , సూర్యుడిని, గాలినీ, నీటినీ , సృష్టించారు.

ఇలా ఒక పద్ధతి ప్రకారం అన్నీ సృష్టించబడ్డాయి.

ఇదంతా చూస్తేనే తెలుస్తోంది. అనంతమైన గొప్ప ఆలోచనా శక్తి గల మహాశక్తి వల్లనే , అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని.


దైవం పచ్చటి ప్రకృతిని, పసిడిపంటలనూ, , పైరగాలినీ, రసభరిత ఫలాలనూ, సుగంధ పుష్పాలనూ .... ఇలా ఎన్నింటినో సృష్టించి మనకు ఇచ్చారు.

ఇంకా, మహా అగ్నిపర్వతాలనూ, మంచుపర్వతాలనూ, మహా సముద్రాలనూ కూడా సృష్టించారు.

సునామీలనూ, సుడిగాలులనూ, సుడిగుండాలనూ కూడా సృష్టించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ సౌకర్యాలు అమర్చి ఇచ్చినా ...

తామంటే కొద్దిగా భయభక్తులు ఉండటానికి అప్పుడప్పుడు పిల్లల పట్ల..... కోపాన్ని, గాంభీర్యాన్నీ , ప్రదర్శిస్తారు. అది పిల్లల మంచికోసమే.

వారు తప్పుదారి పట్టకుండా ఉండటానికి అలా చేస్తారు అంతే. .

అలాగే జీవులకు అన్నీ అమర్చి ఇచ్చిన దైవం భూకంపాలు, సునామీలను ఎందుకు సృష్టించారు అంటే ,

మానవులు మరీ అహంకరించకుండా భయభక్తులతో ఉండటానికి ,

లోకంలో ధర్మం క్షీణించినప్పుడు ,జీవులను హెచ్చరించటానికి.. ఇంకా ,


భూమిపై జీవులు విపరీతంగా పెరిగిపోకుండా సమపాళ్ళలో ఉండటానికి, ..... ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి.


జంతువులకు భూకంపాలు వంటి వాటిని గ్రహించే శక్తి ఉందట.

పూర్వం ప్రజలు జంతువుల ప్రవర్తన ఆధారంగా తామూ భూకంపాలు రావటాన్ని కొద్దిగా ముందే తెలుసుకుని జాగ్రత్త తీసుకునేవారట.

కొందరు , ఈ సునామీలూ, భూకంపాలను తప్పించుకోవటానికి మహిమలు తెలిస్తే బాగుండు అనుకుంటారు.

ఇక్కడ ఒక్క విషయం...
భూకంపాలు, సునామీలూ వచ్చినప్పుడు కూడా కొందరు ఏ హానీ లేకుండా బయటపడతారు.

ఒక పెద్ద ప్రమాదంలో అందరూ చనిపోగా ఒక పసిబిడ్డ చిన్న దెబ్బ తగలకుండా బయటపడిన వార్త ఆ మధ్య చదివాను.

ఇదంతా వారివారి పూర్వసుకృతంపై ఆధారపడి ఉంటుంది. . కాలం కలిసివస్తే ఎంత గొప్ప ప్రమాదం నుంచి అయినా బయటపడతారని తెలుస్తోంది కదా !


లోకంలో ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు ఉంటేనే కొందరు మానవులు విశ్వంలో తామే గొప్ప అంటున్నారు.


ఇక ఏ భయమూ లేకపోతే మనుష్యులు మరీ అహంకరించే అవకాశం ఉంది.

మనం తెలుసుకోవలసింది ఏమంటే, ఇవన్నీ పరీక్షలు.

ఈ పరీక్షలకు తట్టుకుని ఈ లోకంలో సత్ప్రవర్తనతో జీవించిన వారికి బాధలు లేని ఉత్తమలోకాలకు వెళ్ళటానికి అర్హత లభిస్తుంది.

అందుకే, ఈ భూకంపాలు వంటి వాటికి భయపడకుండా , సత్ప్రవర్తనతో జీవితాన్ని సాగించటానికి ప్రయత్నించాలి .

అదే మనం చేయవలసింది......


...............................

 కష్టాలు లేని లోకాలూ ఉన్నాయి. అవి పొందాలంటే, అర్హత సంపాదించాలి.....

కొంతకాలం క్రిందటి వరకూ ఇలా అనిపించేది.

* సృష్టిలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా ! అవి ఎందుకు జరగాలి ? అనిపించేది.

అయితే , ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ లోకంలో బాధ కలిగించే విషయాలున్నాయి నిజమే.

కానీ , భూకంపాలు, సునామీలు, వంటి బాధలు , ఇతర బాధలు లేని లోకాలు కూడా ఉన్నాయి.


* పెద్దలు చెప్పిన స్వర్గం వంటి ," ఒక యోగి ఆత్మకధ " గ్రంధములో చెప్పబడిన , కారణలోకం, వంటి ఉత్తమలోకాలలో ఈ బాధలుండవు.


కానీ అక్కడికి చేరుకోవాలంటే ఈ జన్మలో సక్రమమార్గంలో జీవించాలి. అలా క్రమంగా అత్యుత్తమమైన బ్రహ్మానంద పరమపదమును పొందవచ్చు.


* మానవులు ఈ భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని దైవం యొక్క అభిప్రాయం కాదని పెద్దలు చెపుతారు.


* మానవులు సత్కర్మలను ఆచరించటం ద్వారా దైవకృపను పొంది , బాధలు లేని ఉత్తమలోకాలను పొంది, పరమపదాన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందాలని వారి భావన.

ఇంకా,  ఏమనిపిస్తుందంటే, ఇదంతా దైవం మనకు పెట్టే పరీక్ష.

ఈ ప్రపంచమనే పరీక్షలో ఎక్కువమార్కులు తెచ్చుకుని పాసయిన వారికే బాధలు లేని ఉత్తమ లోకాలను పొందే అర్హత లభిస్తుంది. క్రమంగా అలా పరమపదాన్నీ పొందే అర్హత లభిస్తుంది.అనిపించింది.


లోకంలో మామూలు పరీక్షలంటేనే , ఎంతో కష్టపడి చదవాలి. ఆటల్లో గెలవాలన్నా ఎంతో శ్రమపడి కోచింగులు తీసుకోవాలి. ఆటల్లో తగిలే దెబ్బలకు భయపడకుండా కష్టపడాలి.


మరి బాధలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా, పరమపదాన్ని పొందాలన్నా కష్టపడకుండా ఎలా ?

* ఇలా అనిపించిన తరువాత నా సందేహం తీరింది.

* జీవులకు అసలు పరీక్ష........ మనసును అదుపులో పెట్టుకోవటమే.

అందుకే పెద్దలు అంటారు మనస్సును జయించితే.....ప్రపంచాన్ని
జయించినట్లే అని.


* అందుకే లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి ? అని వాటిని చూసి నిరాశ పడిపోకూడదు.


గొప్ప సుఖాలను పొందాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి మరి.

చిన్నపిల్లలు నడక నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుని ఏడుస్తారు. అది సహజం. నడకనేర్చుకునేటప్పుడు దెబ్బలు ఎందుకు తగలాలి ? మా అమ్మ ఎంత దయలేనిది . నేను క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నా కూడా నడకనేర్చుకోమంటోంది. అని పిల్లలు అనుకోరు కదా ! .


సైకిల్ నేర్చుకునేటప్పుడు బాలన్స్ చేతకాక ఎన్నో సార్లు క్రిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా లెక్కచేయకుండా ఉత్సాహంగా సైకిల్ నేర్చుకుంటారు. అంతేకానీ సైకిల్ నేర్చుకోవాలంటే దెబ్బలు ఎందుకు తగులుతాయి ? ఇది చాలా అన్యాయం, మా నాన్నకు కూడా దయలేదు, క్రిందపడుతున్నా జాలి లేకుండా సైకిల్ నేర్పిస్తున్నారు. అని పిల్లలు అనుకోరు కదా !


ఒక ఆఫీసులో ఉద్యోగస్తులను చేర్చుకోవాలన్నా వ్యక్తుల అర్హతలను పరిశీలించే ఉద్యోగంలో చేర్చుకుంటారు. రోడ్డున పొయ్యే వారిని పిలిచి ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వరు కదా !


* అలాగే, మరి కష్టాలు లేని ఉత్తమలోకాలను పొందాలన్నా దానికి కొన్ని అర్హతలను సంపాదించాలి.

* అలాగే పరమపదాన్ని సాధించే క్రమంలో ......... జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సునామీలు, భూకంపాలూ అటువంటివే.


ఆ కష్టాలను చూసి ధైర్యాన్ని కోల్పోకూడదు. అప్పుడే బ్రహ్మానందం మనకు లభిస్తుంది.


* భూకంపాలు, రైలు ప్రమాదాలు వంటి ప్రమాదాల్లో కూడా కొందరు చెక్కుచెదరకుండా బయటపడతారు, కాలం కలిసి వస్తే అంతే మరి.


* చిన్నచీమ కూడా తాను ఎప్పుడు ఎవరి కాలిక్రింద పడి చనిపోతానో అని భయపడకుండా తన జీవితాన్ని సాగిస్తుంది.


* మనిషి కూడా ప్రతిదానికి భయపడకుండా భగవంతునిపై భారం వేసి స్వధర్మాన్ని పాటిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడపటానికి ప్రయత్నించాలి.


* బాధలు లేని లోకాలను చేరాలంటే ఈ జన్మలో సక్రమమైన పద్ధతిలో జీవించాలి.

* జీవించటమో ? మరణించటమో ! కష్టమో ! సుఖమో ! అంతా భగవంతుని దయ .అనుకున్ననాడు బాధేలేదు.

* ఆ ధైర్యం రావాలన్నా దైవకృప అవసరం . అందుకే దైవకృప కోసం ప్రయత్నించాలి..


6 comments:

  1. ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా!

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమే మీరన్నట్లు , ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు.

    కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మపరంపర , కష్టసుఖాలు మొదలైనవి.. ఉంటాయంటారు.

    ReplyDelete
  3. చక్కటి అవగాహనతో చాలా చక్కగా విశ్లేషించారు. మంచి పోస్ట్.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  5. బాగా చెప్పారు. ధన్యవాదములు.

    -వంశీ కృష్ణ

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete