koodali

Wednesday, January 22, 2014

దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం.


ఆధునికవిజ్ఞానం..".Matter and energy cannot be created or destroyed "....  అని  వివరించటం  జరిగింది.

 సృష్టిలోని  పదార్ధాల   రూపం  మారే   అవకాశం  ఉంది  గానీ   మూల శక్తి    నాశనం  కాదు.  ఉదా..ఆవిరి  నీరుగా  రూపాంతరం  చెందుతుంది.  నీరు  మంచు గా  రూపాంతరం  చెందుతుంది ,  మంచు  నీరుగా,  నీరు  ఆవిరిగా  మారే  అవకాశం  ఉంది    గానీ    మూలశక్తి  ఎప్పుడూ  ఉంటుంది.



 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం   నిత్యమూ  ఉండే  శక్తి.    దైవానికి  ఆది అంతమూ  లేదు.     మొదలైన  విషయాల   గురించి   విష్ణుచిత్తుల వారు  మరియు  ఎందరో  మహానుభావులు  తమ    అభిప్రాయాలను    తెలియజేసారు. 



  ఈ మధ్య   టీవీలో  ప్రసారమైన  ఒక    కార్యక్రమంలో   శ్రీ  సామవేదం  షణ్ముఖశర్మ  గారు   కొన్ని  విషయముల  గురించి  తెలియజేస్తూ....మర్రి  విత్తనంలో  ఉండే  శక్తి  గురించి  తెలియజేశారు.


   నిజమే,  మర్రి  విత్తనాన్ని  చూసిన  వారికి  పెద్ద  కాండము,  శాఖోపశాఖలు  కనిపించవు.  అంత  చిన్న  విత్తనంలో    మహావృక్షం    దాగుంది.

  చిన్న  విత్తనం  నుంచి  మహావృక్షం  రావటం   అనేది  సృష్టిలో  ఒక    అద్భుతం.  సృష్టిలో  ఇలాంటి  అద్భుతాలెన్నో  ఉన్నాయి.

..............

ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.


అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) 


అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు.  దైవానికి  అనేక  వందనములు.


4 comments:

  1. ఏమోనండి నేటి వారు గురువునై దేవుడునై అంటున్నట్టు ఉంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    దేనికైనా సమయం రావాలేమోనండి. గురువు నై దేవుడు నై ( గురువు లేరు దేవుడు లేరు ) అంటున్న వాళ్ళు కూడా వారిగి తగిన సమయం వచ్చినప్పుడు దైవం ఉన్నారని ఒప్పుకోకతప్పదు.

    దైవాన్ని ఒప్పుకునే సమయం ప్రతి జీవికి వస్తుంది.

    నేను కూడా ఒకప్పుడు దేవుడు లేడు అని వాదించి దేవుని చిత్ర పటాన్ని అవమానపరిచిన వ్యక్తినే. అదంతా గతం. అలా చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.


    ReplyDelete
  3. దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం, సత్యం, సనాతనం

    ReplyDelete
  4. భారతి గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం, సత్యం, సనాతనం

    ReplyDelete