koodali

Friday, January 17, 2014

పరిపూర్ణత్వం అంటే దైవం మాత్రమే.

 
పరిపూర్ణత్వం  అంటే  దైవం  మాత్రమే.

  దైవ  సృష్టిలో  మంచి  ఉన్నది.   దైవ  సృష్టిలో  నెగటివ్  కూడా  ఉన్నట్లు  మనకు  తెలుస్తుంది.  ఇదంతా   భగవంతుని  లీలలో  భాగమే.


  నెగటివ్  అంటే  అంతా  చెడే  అనుకుంటాము  కానీ  నెగటివ్  వల్ల  మంచి  కూడా  జరిగే  అవకాశముంది. 

 ఉదా..  శరీరంలో  రోగకారక  క్రిములు  ప్రవేశించినప్పుడు  వాటిని  బయటకు  పంపటానికి  శరీరంలోని  రోగనిరోధక  వ్యవస్థ....   రోగకారక  క్రిములతో  పోరాడుతుంది.  ఇదంతా  జ్వరం... మొదలైన  చర్యల  ద్వారా బయటకు    తెలుస్తుంది.  


అప్పుడు  జ్వరం  వచ్చిన  వ్యక్తి  జాగ్రత్తపడి  అనారోగ్యం  తగ్గటానికి  మందులు  వాడతారు.  ఇక్కడ  జ్వరం  మొదలైన  లక్షణాలు  బాధాకరమే  అయినా  వాటివల్ల  శరీరంలో  ప్రవేశించిన  అనారోగ్యాన్ని  గమనించి  జాగ్రత్తపడే  అవకాశం  కలుగుతోంది  కదా  !  



 పర్యావరణాన్ని  కలుషితం  చేస్తుంటే  వాతావరణంలో  విపరీతమైన  మార్పులు  వచ్చి  అకాల  వర్షాలు,  వరదలు,   మొదలైనవి   వస్తుంటాయి.   ఇవన్నీ    పర్యావరణం  కలుషితమైన  దానికి  చిహ్నాలుగా  గుర్తించి  పర్యావరణాన్ని  కలుషితం  చేయటాన్ని  తగ్గించుకుంటూ  జాగ్రత్త  పడాలి. 



ఎవరైనా  చెడ్డ పని  చేస్తే  వారు  దానికి  తగిన  ఫలితాన్ని  అనుభవిస్తారు.    రాక్షసులు  మొదలైన  వారు   చెడ్డ పనులను  చేసినప్పుడు  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించినట్లు  పురాణేతిహాసాల  ద్వారా  తెలుస్తుంది.    చెడుగా  ప్రవర్తిస్తే  శిక్ష  పడుతుందని  గమనించి,   మనము   చెడ్దగా  ప్రవర్తించకూడదనే  నీతిని  నేర్చుకోవచ్చు. 



ఈ  విధంగా  సృష్టిలోని  నెగటివ్   క్రియల  నుంచి  కూడా   మంచిని  అభివృద్ధి  చేసే  విధానాలను  తెలుసు కోవచ్చు.

.................................... 

Sri Satyanarayana Swamy - YouTube 

  .....  చిత్రం  ద్వారా   ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.  

  పై  చిత్రం  లోని పాట..... 

 Sri Satyanarayana Swamy Video Songs - Bhagwan Hey ... - YouTube  .....

 ఈ పాటలోని  కొన్ని  భావాలు ..... 

ఆకలి  అన్నది  లేకుంటే  ఆశలు  పుట్టే  తావేది..


చీకటి  అన్నది  రాకుంటే  వెలుగుకి  విలువే  ఉంటుందా..


శోకం  లేని లోకంలో  సుఖమెక్కడ  కలిగేది  ...

............................................

దైవం   అంటే  మూర్తీభవించిన  పాసిటివ్  శక్తి. 


  దైవం  ఈ  సృష్టిలో  అంతా  మంచినే   ఉంచవచ్చు  కదా  !  చెడును  కూడా  ఎందుకు  సృష్టించారు  ?  అని  మనకు  సందేహం  వస్తుంది. 

ఆటలలో  ప్రత్యర్ధులు  ఉంటారు.   గెలుపు,  ఓటములు   ఉంటాయి  కదా  !

 ఈ  జగన్నాటకమనే  ఆటలో   నెగటివ్  లక్షణాలను  జయిస్తూ  ఉన్నత  స్థానానికి  ఒకో  మెట్టూ   ఎక్కుతున్నప్పుడు     దైవత్వానికి  దగ్గరవుతూ  ఉంటారు  జీవులు. 


   చెడుపై  గెలుపును  సాధిస్తూ  దైవమనే  పరిపూర్ణత్వాన్ని   పొందటమే మానవ  జీవితమనే  ఆటలో  గెలుపు.




2 comments:

  1. సర్వం జగన్నాధం

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    నిజమేనండి, సర్వం జగన్నాధం.

    ReplyDelete