కేజ్రీవాల్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసారు. అవకాశం వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం హడావుడి పడకుండా ప్రజల అభిప్రాయాన్ని అడగటం వంటి పద్ధతులను గమనించితే కేజ్రీవాల్ గారి వ్యవహారశైలి బాగుందనిపిస్తోంది.
అయితే, కేజ్రీవాల్కు ఓట్లేసాము కాబట్టి ఇక సమాజ ప్రక్షాళన అంతా ఆయనే చూసుకుంటాడులే .... మనం కాళ్ళు బారజాపుకుని సరదాగా వినోదకార్యక్రమాలు చూస్తూ పొద్దుపుచ్చుదాం ..... అని ప్రజలు అనుకోకూడదు.
సమాజం కొంతయినా బాగుపడాలంటే ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలి. అప్పుడే సమాజంలో పెద్ద ఎత్తున మార్పు సాధ్యమవుతుంది.
........................................
ఇక్కడ మనం, మరి కొన్ని విషయాలను గురించి ఆలోచించాలి.
స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటుచేయటానికి కొన్ని సీట్లు తక్కువ రావటం వల్ల కేజ్రీవాల్ పార్టీ ఇతరపార్టీ మద్దతు తీసుకోవలసి వచ్చింది. ( తమకు ఇష్టం లేకపోయినా ).
* ప్రజలు తమకు నచ్చని వారికి ఓట్లు వేయకుండా తమ తిరస్కారాన్ని తెలియజేస్తారు……. అయితే ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలు … ప్రజలు తిరస్కరించిన పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అగౌరవపరచటం అవుతుంది కదా !
* ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి చాలినన్ని సీట్లు రాకపోయినా , ఎన్నికలలో ఎక్కువ సీట్లను గెలుచుకున్న పార్టీ ఇతరుల మద్దతు లేకుండా స్వతంత్రంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం ఇచ్చే విధంగా నియమాలను సడలించవలసిన అవసరముంది.
* నియమాలు మన బాగుకొరకు మనమే ఏర్పాటు చేసుకున్నవి. అవసరమైతే నియమాలను మార్చుకోవటం మంచిది.
* ఎన్నికలు జరగటానికి ముందే పార్టీల మధ్య పొత్తులు ఉండటమనేది న్యాయం…. అప్పుడు ప్రజలు తమ ఇష్టాన్నిబట్టి తీర్పు చెబుతారు. అంతేకానీ , ఎన్నికల తరువాత పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు పొత్తులు పొట్టుకుంటే అప్పుడు ప్రజలను ఓట్లు వేయమని అడగటం ఎందుకు ?
...............................
అధికారం కోసం , ధన వ్యామోహం కోసం కాకుండా ప్రజాసేవ కోసం వ్యక్తులు రాజకీయాలలోకి వచ్చినప్పుడు రాజకీయరంగంలో మంచి మార్పు సాధ్యమవుతుంది.
....................................
ప్రజల సమస్యలను పరిష్కరించటం చేతకాకపోయినా , ప్రజల మధ్య విభేదాలు కల్పించే వారు నాయకులుగా చెలామణి అవుతున్న ఈ రోజుల్లో ....
మాణిక్ సర్కార్ గారు.. వంటి నిజాయితీపరులు, నిరాడంబరులు అయిన నిజమైన నాయకులు రాజకీయాల్లో ఉండటం ప్రజలకు శుభసూచకం.
iMkoddi kaalaM vechichuddaam
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరన్నది నిజమే. ఎన్నో ప్రలోభాలు, ఆకర్షణలు ఉన్న ఈ సమాజంలో ఆదర్శాలను పాటించాలనుకునే వారికి ఎన్నో పరీక్షలు ఎదురవుతుంటాయి.
కేజ్రీవాల్ గారి లాంటి ఆదర్శవంతులు సమాజంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగకూడదని, వారిపై ప్రజలు పెట్టుకున్న ఆశలను భగ్నం చేయకూడదని మనసారా కోరుకుందాము.
ఇక ప్రజల తలరాతను బట్టి భవిష్యత్తు ఉంటుంది.
ఎవరి తలరాతకు వారే బాధ్యులు కదా ! ప్రజలు కూడా తమ స్వార్ధాన్ని , అత్యాశను వీడితే మంచి పాలకులు లభిస్తారు.
ReplyDelete