సుమతీదేవి ఎంతో ఓపికతో, సహనంతో తన కాపురాన్ని చక్కదిద్దుకుంది.ఆమె భర్త అనారోగ్యంతో ఉండి కూడా భార్యనే కోరరాని కోరిక కోరాడు.
భార్య అనుకూలవతి అయినా పర స్త్రీల పట్ల మోజుపడే వారు ఉంటారు .
తన ప్రియురాలి వద్దకు తీసుకెళ్ళమని భార్యను కోరాడు. ఏ స్త్రీకయినా ఇలాంటివి తట్టుకోవటం కష్టమే.
ఇలాంటి భర్తను కఠినంగా శిక్షించాలని చాలామంది అంటారు . ఇలాంటివి విన్నప్పుడు అంతటి బాధ కలిగే మాట వాస్తవమే.
అయితే, వ్యసనపరుడైన భర్తను శిక్షించాలని ఆవేశపడే వాళ్ళు తమ పిల్లలు లేక అన్నదమ్ములు వ్యసనపరులైనా ఇలాగే శిక్షించాలని కూడా అనగలరా ?
శిక్షకన్నా ముందు నేరస్తులలో పరివర్తన తేవటానికి ప్రయత్నించవచ్చు.
...............
సుమతీ సాధ్వి తన భర్త కోరికను తీర్చటానికి సిద్ధమవటానికి ఎంతటి మానసిక వ్యధను అనుభవించిందో కదా !
రోగిష్టి అయిన తన భర్త కోరికను తీర్చటానికి అతని ప్రియురాలు ఒప్పుకోదని సుమతి భావించి ఉండవచ్చు. ఆ నమ్మకంతోనే భర్తను ఇతరుల వద్దకు తీసుకెళ్ళటానికి ఒప్పుకుని ఉండవచ్చు.
........................................
వ్యసనపరులను మంచి మార్గంలోకి తేవాలంటే ఎంతో ఓర్పు, నేర్పు ఉండాలి. ఈ రోజుల్లో వ్యసనపరులను మార్చటానికి సైకాలజిస్టుల వద్దకు తీసుకువెళ్తున్నారు.
వ్యసనపరులను మార్చాలంటే సైకాలజిస్టులు కూడా ఎంతో సహనంతో ప్రయత్నించవలసి ఉంటుంది. సుమతి ఎంతో సహనంతో .... వ్యసనపరుడయిన తన భర్తను తానే సరిదిద్దుకుంది.
....................
సుమతి ఎంతో సహనంతో తన కాపురాన్ని చక్కదిద్దుకుంది. అందుకు ఆమె ఎంతో అభినందనీయురాలు. ఆ విధంగా సమాజానికి ఒక చక్కటి మేలును చేసింది.
సుమతి చేసిన దానిలో తప్పేమిటి ? ఎవరి ఇల్లును వారు సరిదిద్దుకుంటే దేశమే బాగుపడుతుంది కదా!
అయితే ఇలా సరిదిద్దటం తేలికయిన పనేమీ కాదు. అందుకు ఎంతో సహనం అవసరం.
( జీవితభాగస్వామి మరీ శాడిస్టు అయినా సర్దుకుపోవాలని నా అభిప్రాయం కాదు. అయితే ఈ కాలంలో కొందరు జీవిత భాగస్వామిలో చిన్న లోపాలున్నా శాడిజం అనేస్తున్నారు. అది తప్పు. )
.....................
సుమతిలాంటి అత్యంత సహనశీలురకు న్యాయం చేయటానికి సూర్యుడు , అనసూయాదేవి వంటి వారు కూడా తమ సహకారాన్ని అందిస్తారు.
.......................
వ్యసనపరులను, చెడ్డపనులు చేసేవారిని చెంపపగలగొట్టాలని కొందరు అంటారు .అయితే, చెంపపగలగొట్టటం వల్ల మళ్ళీ చెడ్డపనులను చేయరని నమ్మకమేమిటి ?
రెచ్చిపోయిన వాళ్ళు మరింతగా చెడ్డపనులను చేసే ప్రమాదం కూడా ఉంది.
అయితే , అలాగే వదిలేస్తే వారు సమాజం మీద పడి ఇతరులకు హాని చేసే అవకాశం కూడా ఉంది.
అందుకని, వారిని మంచివారి గా మార్చటానికి ప్రయత్నించటంలో తప్పులేదేమో...అనిపిస్తోంది.
ప్రయత్నించినా మారకపోతే అప్పుడు కఠినంగా శిక్షించవలసిందే.
మరీ క్రూరమైన నేరాలను చేసిన వారి విషయంలో మాత్రం వారిని మార్చటానికి ప్రయత్నించటం కన్నా ..... వెంటనే కఠినంగా శిక్షించటమే మంచిదనిపిస్తోంది.
ఆ శిక్షలు ఎలా ఉండాలంటే, ఇతరులు మళ్ళీ తప్పు చేయటానికి భయపడేంత కఠినంగా శిక్షించాలి.
నేరస్తులకు కఠినశిక్షలు వేసిన తరువాత , అటువంటివారు తయారుకావటానికి గల మూల కారణాలను గుర్తించి వ్యవస్థను మార్చటానికి ప్రయత్నించాలి.
..............................
మన పూర్వీకులైన భార్యాభర్తలు ఇప్పటి కాలపు భార్యాభర్తలలా .......నా హక్కులే నాకు ముఖ్యం...అంటూ విడిపోయి ఉంటే ఈ దేశంలో కుటుంబవ్యవస్థ ఎప్పుడో మాయమై ఉండేది.
......................
మనుషుల మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. తల్లిబిడ్డల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. ఎక్కడో పుట్టిపెరిగిన భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం అత్యంత సహజం.
అందుకే మన పెద్దవాళ్ళు సర్దుకుపోతూ సంసారాలు చేసారు. తమ సుఖసంతోషాలను కొద్దిగా తగ్గించుకుని అయినా పిల్లలను సంతోషంగా ఉంచారు.
...................
ఎన్నో కష్టాలను సహించి కుటుంబవ్యవస్థను నిలబెట్టిన ఈ దేశపు పెద్దవాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
బహుశా నా బ్లాగులో గోల ను చూసి రాసి వుంటారు.. ఈనాటి అజ్ఞాత పతివ్రత దాడికి సిద్ధపడండీ..చక్కటి పోస్ట్ రాసారు..ధన్యవాదాలు..
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteనిజమే , మీ బ్లాగ్ లో విషయాన్ని చూసే ఈ టపాను వ్రాసాను.
ఇంతకు ముందు సతి సుమతి కధ గురించి నాకు అంతగా తెలియదు.
అయితే, సతిసుమతి కధ నెట్ లో కొన్ని చోట్ల కొద్దిపాటి తేడాలతో ఉంది.
సతీ సుమతి గురించి ఇంకా మరికొన్ని విషయాల గురించి నాకు తోచిన అభిప్రాయాలను వ్రాయాలనిపించి వ్రాసాను.
అపోహలు, అపార్ధాలు సమసిపోతే బాగుండునని ఆశిస్తున్నానండి.