koodali

Friday, February 4, 2011

ఆనందనిలయవాసుని దర్శనం కొరకు.......


 

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కొరకు ఎందరో భక్తులు తిరుమల వెళ్తుంటారు. చాలా రద్దీగా ఉంటుంది కదా ఎప్పుడూ.


ఈ మధ్య మాకు తెలిసినవారు ఇలా చెప్పారు........వారి బంధువులు తిరుమల వెళ్తే ఎంత రద్దీగా ఉందంటే .......గర్భగుడి వద్దకు వచ్చేసరికి వారి ప్రమేయం లేకుండానే నడవబడి (ఆ రద్దీవల్ల ) ఇంకా మూలవిరాట్టుని చూస్తాంచూస్తాం అనుకునేంతలో ......... తేరుకుని చూసేసరికి వారు వకుళాదేవి గుడికి కొద్ది దూరంలో తేలేరట......... గర్భగుడిలోని మూర్తిని చూడనేలేదంట............. ఇది వినటానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ...అక్కడ రద్దీ అలాగే ఉంటుంది లెండి..


కొంతకాలం క్రితం మేము తిరుమల వెళ్ళామండి. పూజకు ముందే రిజర్వ్ చేయించుకున్నాము. ఆ పూజ పేరు సరిగ్గా గుర్తు లేదండి .ఆ.......అదీ ... సూర్యోదయానికి ముందే జరుగుతుంది పూజ ......... అర్చనా లేక అర్చనానంతరసేవనా అన్నది ఇప్పుడు సరిగ్గా గుర్తు రావటం లేదండి.


అయితే పూజ జరిగినంత వరకు చాలా సమయం భక్తులందరినీ మూలవిరాట్టు ముందు కూర్చోబెట్టారు. తనివితీరా దేవుని చూసే అవకాశం ..........అయితే అంతసేపు భగవంతుని ముందు కూర్చున్నాను కదా........... నా దృష్టి కొంతసేపు భగవంతుని పైనా......... కొంతసేపు చుట్టూ ఉన్న భక్తులను ,వారి కబుర్లను వినటం , పరిసరాలను గమనించటం . ఇదన్నమాట .



రద్దీగా ఉన్నప్పుడు దేవుడు ఒక్క క్షణం కనిపిస్తే చాలని తాపత్రయపడినవాళ్ళమే........ తీరిగ్గా క్రింద కూర్చుని చూసే అవకాశం వచ్చేసరికి ఇక దేవుని చూడటం తక్కువా ........... .పరిసరాలను గమనించటం ఎక్కువగా అన్నట్లు అయింది నా పరిస్థితి.


అయితే అందరూ నాలానే ఉండరులెండి. భక్తిభావం ఎక్కువగా ఉండేవారు చాలామందే ఉంటారు. అందుకే భగవంతుడు అందరికీ ఎప్పుడుపడితే అప్పుడు దర్శనం ఇవ్వరు అనిపించింది.


సరే.........ఈ పూజకు చాలా డిమాండ్ ఉంది. కొన్ని నెలలకు ముందే రిజర్వ్ చేసుకోవాలి. రిజర్వ్ చేసుకున్నా ......... ఒకోసారి అనుకోని ఆటంకాలు వచ్చి వారు వెళ్ళకపోతే ........ ఆ టిక్కెట్స్ ఇతరులు వాడుకునే సదుపాయం ఉన్నట్లుంది. అయితే భగవంతుని దయవల్ల ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా దర్శనం చేసుకువచ్చాము.


ఓసారి మేము చెన్నైలో ఉన్నప్పుడు తిరుమల వెళ్ళాము. అప్పుడు ఏవో కారణాలవల్ల భక్తులు పెద్దగాలేరు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే..........తిరుమల భక్తులతో రద్దీగా ఉంటే కొందరు ఇబ్బందులు పడినా .......... అక్కడ భక్తులు నిండుగా ఉంటేనే కళకళలాడుతూ బాగుంటుంది అనిపించిందండి.. .
......


ఇంకో విషయమండి , ఈ తెల్లవారుఝామున పెద్దగా భక్తుల రద్దీ ఉండదు కదా ! తిరుమల వచ్చే వి.ఐ.పి లను ఈ సమయంలో మాత్రమే దర్శనం చేయిస్తే రోజంతా సామాన్యభక్తులకు ఇబ్బంది ఉండదు కదా ......అని అనిపించిందండి. ఆ సమయంలో దర్శనం వల్ల వారికీ మంచిదే.

 

2 comments:

  1. అర్చనా లేక అర్చనానంతరసేవకు కూర్చోబెట్టరు.బహుశా తోమాలసేవ అయి ఉండవచ్చు.

    ReplyDelete
  2. .ధన్యవాదాలండి.
    మా ఇంట్లో వాళ్ళు అర్చన అనే అంటున్నారు. లోపల ఎక్కువసేపే కూర్చున్నాము మరి. మీరు అన్నట్లు తోమాలసేవేనేమో మరి. ఏమైనా పూజ పేరు గుర్తులేకపోవటం నిజంగా మా తప్పేలెండి.

    .ఇంకో విషయమండి , ఈ తెల్లవారుఝామున పెద్దగా భక్తుల రద్దీ ఉండదు కదా ! తిరుమల వచ్చే వి.ఐ.పి లను ఈ సమయంలో మాత్రమే దర్శనం చేయిస్తే రోజంతా సామాన్యభక్తులకు ఇబ్బంది ఉండదు కదా ......అని అనిపించిందండి. ఆ సమయంలో దర్శనం వల్ల వారికీ మంచిదే...

    ReplyDelete