koodali

Wednesday, February 23, 2011

భగవంతుని అగౌరవించటం తగని పని.......

 

దత్త దిగంబర ! దత్త దిగంబర ! శ్రీ పాదవల్లభ ! దత్త దిగంబర.

ఎట్టకేలకు కలెక్టర్ మరియు ఇంజనీర్లను విడిచిపెట్టటం సంతోషకరమైన విషయం. ( అయ్యో ! సారీనండి. కలెక్టర్ గారు విడుదల అవలేదంట. నేను న్యూస్ సరిగ్గా చూడకుండా రాసాను. పేదలకు మంచి జరగాలని పనిచేస్తున్న వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.. )

ఇంకో విషయమండి...... బ్లాగ్ మొదలుపెట్టినప్పట్నించి నన్ను ప్రత్యక్షంగా , పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికినా కృతజ్ఞతలను చెప్పుకుంటున్నానండి.

నాకు ఇలా అభిప్రాయములు చెప్పుకునే అవకాశం వస్తుందని ఎప్పుడూఅనుకోలేదు.

భగవంతునిదయవల్ల
మరియు మీ అందరి దయవల్ల ఇప్పుడు ఇలా చెప్పుకోగలుగుతున్నాను..

మనం అందరం బ్లాగుల్లోరాస్తున్న మంచి విషయాలు కష్టాలలో ఉన్నవారికి ఉపయోగపడాలని భగవంతుని కోరుకుంటున్నానండి.

ఇంకో విషయం.....నిన్న వార్తల్లో చెప్పిన విషయం ఇది.." శ్రీ కూర్మం " ప్రసిద్ధి చెందిన దేవాలయం.

అక్కడ గుడిపరిసరాల్లో ఎన్నో తాబేళ్ళు తిరుగుతుంటాయి. వాటిని భక్తులు పవిత్రంగా భావిస్తారు.

ఇక ఇప్పుడు వీటి గురించి చర్చమొదలయ్యింది.

వాటిలో
నక్షత్రపు తాబేళ్ళు ఉన్నాయట. రకం తాబేళ్ళను అలా పెంచకూడదట. అందుకని వాటిని పట్టుకెళ్ళి జూలోవదిలెయ్యాలని కొందరు అంటున్నారు. అలా చెయ్యటానికి వీల్లేదని భక్తులు అంటున్నారు.

అసలు
తాబేళ్ళు అక్కడ చక్కగా తిరుగుతుంటే వాటిని పట్టుకెళ్ళి జూకి తరలించి కష్టపెట్టడం ఎందుకో ? అర్ధంకావటంలేదు.....

మేము ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు వాటిని చూశాము. అక్కడ తిరుగుతున్న వాటిలో ఒక దానికి నేను అరటిపండుఇవ్వగా , కొద్దిగా తీసుకుంది. మేము దేవుడే స్వీకరించినట్లు భావించి సంతోషించాము.


అవి
కూడా అందరిమధ్య అలవాటుగా ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రాబ్లం ఏమిటో ?

( అయితే వీటికి జంక్ ఫుడ్ అయిన చిప్స్, పాప్ కార్న్ ఇలాంటివి తినిపించకూడదు. అలాంటి ఆహారం వల్ల జబ్బు చేస్తుంది. అందుకని దయ చేసి జంక్ ఫుడ్ వాటికి ఇవ్వకండి. ). .

ఇంకో విషయమండి................

తెలుగు
సినిమాల్లో కూడా దేవుళ్ళని.... రకరకాలుగా చూపిస్తోంటే మనమూ విరగబడి చూస్తున్నాము.

దేవుళ్ళని ఇలా అగౌరవంగా చూపించటమనేది తెలుగుసినిమాల్లో తప్పితే ఎక్కడా జరగదేమో............

ఏమైనా
అంటే జనాలు చూస్తున్నారు కాబట్టే మేమూ తీస్తున్నాము అంటారు వాళ్ళు.

ఇందులో తప్పెవరిది ? ఇలాంటివితీస్తున్నవాళ్ళదా ? వాటిని ఎగబడి చూస్తున్నవాళ్ళదా ? లేకపోతే చాదస్తంగా ఆలోచిస్తున్నానని అనిపించుకుంటున్ననాలాంటివాళ్ళదా ?

అలాంటి
సినిమాలని ప్రజలు చూడకపోతే ఇంకోసారి అలాంటి సినిమాలు తీసే సాహసం వాళ్ళు చేయగలరా ?

భగవంతుడు మన కోసం ఎన్నో అమర్చిమన ఆనందం కోసం ఎంతగానో తాపత్రయపడతారు... అలాంటి దైవాన్ని అవమానించటం ఎవరు చేసినా... అది మహాద్రోహం..

 

 

No comments:

Post a Comment