చాలా ప్రాంతాలలో ఫ్లోరైడ్ నీరు త్రాగటం వల్ల ప్రజలకు చాలా రకాల జబ్బులు రావటం చూస్తున్నాము. మనం త్రాగటానికి, వంటలో వాడుకోవటానికి కావలసిన రెండు, మూడు బిందెల నీటిని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది.
దీనికి ఈ మధ్యన టి.విలో ఆయుర్వేదం వైద్యులు చెప్పిన చిట్కా రాయాలనిపించిందండి.
ముందు నీటిని కాచాలి.............
ఆ నీరు చల్లారాక పై నీళ్ళను జాగ్రత్తగా వంచుకోవాలి............
చిల్లగింజలు ( తెల్లని చిన్న గింజలు ) రాయి మీద అరగదీసి గంధము తీయాలి. .............
ఈ గంధమును ఒక బకెట్టుకు 2, 3 గింజల గంధమును కలుపుకోవాలి. ...........
ఈ గంధముతో పాటు అతి మధురం వేరు ముక్క కూడా ఆ నీళ్ళలో వేస్తే నీరు శుభ్రపడుతుంది.............
ఇలా చెప్పారండి వారు.
ఈ రోజుల్లో చాలామంది వాటర్ కాన్స్ పెద్దవి తెప్పించుకుంటున్నారులెండి. అలా తెప్పించుకోనివారు లేక ఆ కెమికల్స్ ఇష్టంలేనివారు ఇలా వాడుకోవచ్చు. పాతకాలంలో ఇలాంటి విధానాలతోనే నీటిని శుభ్రపరుచుకొనేవారు. ఈ ఫ్లోరైడ్ బాధితులను చూస్తే చాలా బాధగా ఉంటుంది.
స్నానానికి, ఇతర అవసరాలకు వాడే నీరు పెద్దమొత్తంలో శుభ్రం చేసుకోవటం కష్టమేకానీ............. ఈ జబ్బులు ఆ నీటిని............ త్రాగటం వల్లే వస్తాయి కాబట్టి......... రోజూ త్రాగే ఒకటి, రెండు బిందెల నీటిని ఇలా శుభ్రపరుచుకుని త్రాగితే రోగాలబారినుండి తప్పించుకోవచ్చు.
నేను ఒక దగ్గర చదివానండి సరిగ్గా గుర్తు లేదుగానీ, కొన్ని ములక్కాయ ఎండిన గింజలను నీళ్ళలో వేసినా నీరు శుభ్రపడుతుందట. ఇది మరింత సులభం.
ఇంకా ఇలాంటి చిట్కాలు ఆయుర్వేద వైద్యులైతే వివరంగా చెప్పగలరు.....
అయితే ఇవన్నీ చేసే ఓపిక అందరికీ ఉండదుకదా ! ఏదైనా ఒక చిటికెడు పొడి ( లేదా టాబ్లెట్ రూపంలో ) నీళ్ళలో కలపటం ద్వారా నీరు శుద్ధి అయ్యే విధానం ఉంటే బాగుంటుందండి.
ఇలాంటి ఆయుర్వేద చిట్కా పురాతన ఆయుర్వేద గ్రంధాలలో ఉన్నదేమో వైద్యులు కనుక్కుంటే బాగుండు. ములక్కాయల ఎండిన గింజలు నీటిని శుద్ధి చేస్తాయన్నది నిజమయితే అలాంటివి కూడా ఈజీనే. కొందరు పటిక కూడా వాడుతారు.
ఇలా ఈజీగా నీటిని శుద్ధి చేసే చిట్కా గనక ఉంటే ప్రతి ఇంటికి ఆరోగ్య కార్యకర్తల ద్వారా పరిచయం చేయవచ్చు. అయితే ఇందులో నకిలీలు ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి.
పాత రోజుల్లో నీటిలో ఇంత కాలుష్యం చేరేది కాదు. ఇప్పుడు రసాయనాలతో కలిసిన పారిశ్రామిక వ్యర్ధాలు ఇవన్నీ నదులలో ,ఇంకా కాలువలలో కలుస్తుండటం వల్ల నీటిని శుద్ధి చేయటం కష్టమైన పనే. ..........
* కానీ కనీసం ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాలలో అయినా కుటుంబానికి రోజుకి రెండు బిందెల శుభ్రమయిన నీరు త్రాగటానికి, వంటలో వాడటానికి అందించగలిగితే ఈ ఫ్లోరైడ్ వల్ల వచ్చే జబ్బులు తగ్గుతాయి,.....
*ఇవన్నీ కుదరనప్పుడు కుటుంబానికి ఒక వాటర్ ఫిల్టర్ని ఉచితంగా పంపిణీ చేస్తే మరీ మంచిది....
ఇలా ఫిల్టర్స్ ఇచ్చి ఊరుకోకూడదు. వాటికి అప్పుడప్పుడూ లోపల భాగాలు మార్చుకోవలసి ఉంటుంది. వాటిని కూడా పంపిణీ చేస్తూ ఉంటేనే మంచిఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పెద్ద ఖరీదు ఉండవు. పేదవారు ఇవన్నీ సరిగ్గా ఉపయోగించేలా వారికి నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇవన్నీ అమలుపరచవచ్చు.
ఇదంతా అయ్యేపనేనా అని కొందరు సందేహపడతారు. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. ఫ్లోరైడ్ నీరువల్ల భయంకరమైన జబ్బులు వచ్చి ఇబ్బందులు పడేకంటే ముందు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రభుత్వానికి కూడా ......... ప్రజలకు అనారోగ్యం వచ్చిన తరువాత పెట్టే ఖర్చు కన్నా ఈ ఖర్చు తక్కువే అవుతుంది.
ReplyDeleteఫ్లోరైడ్ ప్రాంతాలలో నీరు కఠినంగా ఉండటం వల్ల కిడ్నీలు పాడవటం వంటివి జరుగుతాయి.
ఫ్లోరైడ్ ప్రాంతాల వాళ్లు..నిమ్మరసంలో ఎక్కువనీరు కలుపుకుని ఆ నీటిలో కొద్దిగా ఉప్పుకానీ, బెల్లం కానీ వేసుకుని అప్పుడప్పుడు త్రాగినా మంచిదేమోనని నాకు అనిపించింది. (సుమారు రోజుకు అర నిమ్మచెక్క..?)
అలాగని నిమ్మరసం అదేపనిగా త్రాగకూడదు. కిడ్నీలకు మంచిది కాకపోవచ్చు.
నిమ్మరసం రాయిమీద పడితే ఆ ప్రదేశం గరుకుగా అయిపోతుంది. నిమ్మరసం కూడా యాసిడ్ వంటిదే కాబట్టి డైరక్ట్ గా త్రాగకూడదు. నీటితో కలిపి త్రాగాలి.