koodali

Saturday, February 12, 2011

ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలను వీలయినంతవరకూ తగ్గించటం...........


ప్లాస్టిక్ కవర్స్ ను వాడి ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడవేయటం వల్ల అవి గాలికి కొట్టుకుపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. అవి శిధిలం అవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుందట.

ఇంకా, ఈ మధ్య ముంబయి లాంటి ఊర్లలో వరదలు వచ్చి రోడ్లు మునిగిపోవటానికి ......... ఇలా నీళ్ళు పోకుండా ప్లాస్టిక్ కవర్స్ అడ్డంపడి డ్రైనేజీలు బ్లాక్ అవ్వటమే కారణమంటున్నారు.


* ఇంకా, మనం తినగా మిగిలిన ఆహారపదార్ధాలు ప్లాస్టిక్ కవర్స్ లో కట్టి పారవెయ్యటంవల్ల జంతువులు ఆహారంకోసం ..... ఆ కవర్స్ ను మ్రిగటంవల్ల ......అవి చనిపోతున్నాయట.

ఇలాంటి వాటిని వీలయినంతవరకు తగ్గించుకోవాలి.

* ప్లాస్టిక్ కవర్స్ ను పారవేయటానికి ప్రభుత్వం రోడ్ల ప్రక్కన ప్లాస్టిక్ కవర్లను మాత్రమే పారవేయటానికి ప్రత్యేకంగా చెత్తకుండీలను ఏర్పాటు చెయ్యాలి.


ప్లాస్టిక్ సంబంధిత వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ విసిరెయ్యకుండా వాటిల్లో మాత్రమే పారవేయాలి. దీనికి ప్రజలు అలవాటుపడాలి.

* ఇలా చెయ్యటం వల్ల ఈ కవర్స్ గాలికి ఎగిరిపోకుండా ఉండి ............... రీసైక్లింగ్ కి సేకరించటం సులభంగా ఉంటుంది. మట్టిక్రింద కప్పబడితే తీయటం కష్టం కదా.........

* ఇక కొందరు షాప్స్ వాళ్ళు వస్తువులను ప్లాస్టిక్ కవర్స్ లోనే పాక్ చేస్తారు. మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే ..............ఇలా వచ్చిన కవర్స్ ను ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్లో వేస్తూంటాము. నెలకొకసారి దాన్ని అలాగే క్లోస్ చేసి బైట పడ వేస్తాము.


ఇంట్లో కూడా ఒక మూల ఒక డస్ట్ బిన్ అమర్చుకుని బిస్కట్, వేఫర్ పైన వచ్చే కవర్స్ ను ఆ డస్ట్ బిన్లో వేసేలా పిల్లలకు అలవాటు చెయ్యాలి. ( 25 రూపాయలతో నెట్టెడ్ బాస్కెట్స్ అమ్ముతున్నారు విడిచిన బట్టలు వెయ్యటానికి..........ఇలాటి బాస్కెట్ ) .

పాల కవర్స్ కడిగి ఎండలో పెట్టాలి.

* ఇక హోటల్ నుండి టిఫిన్స్, భోజనం పార్సిల్ తెచ్చుకోవటానికి రెండు స్టీలు కారియర్లు కొనుక్కుంటే సరిపోతుంది.


* పాతకాలంలో ఇడ్లీలు, దోసెలు........... అరటి ఆకులు, తామరాకులు, మర్రి ఆకులు ఇలాంటి వాటిలో పెట్టి పేపర్ తో పొట్లం కట్టేవారు. సాంబారుకు చిన్న డబ్బాలు తీసుకెళ్ళేవారు. ఆ వేడి ఇడ్లీ అరటి ఆకులో కట్టడం వల్ల ,ఆ వేడికి ఆకు మగ్గి ......... పొట్లం అంతదూరంలో ఉండగానే కమ్మటి సువాసన వచ్చేది.


* ఇప్పుడు వేడి సాంబారును ,వేడి కూరలను ప్లాస్టిక్ కవర్స్ లో కడుతున్నారు. ఆ వేడికి కవర్ నెమ్మదిగా కరిగి మన పొట్టలో ప్లాస్టిక్ పేరుకుపోయి పేగులకు పట్టేస్తుంది.


ఇక బైట తయారుచేసే ఆహారపదార్ధాలు తినకూడదంటే ఈ రోజుల్లో వినేవారు చాలా తక్కువ. కదా..


ఇప్పుడు కొన్ని ఊర్లలో ప్లాస్టిక్ ను నిషేధించి విజయవంతమయినట్లు వార్తలు వస్తున్నాయి.
అక్కడి అధికారులు ఈ విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరించారట.. . అక్కడి ప్రజలు కూడా మొదలు ఇబ్బంది పడినా నెమ్మదిగా పాతకాలంలా చేతిసంచులు తీసుకువెళ్ళటానికి అలవాటుపడటం శుభపరిణామం .


ఇంకా , మందపు పేపర్ సంచులు వాడుకోవచ్చు. లోపల దారాలతో గట్టిగా ఉండే పేపర్ కవర్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి కూడా వాడవచ్చు.


మిగిలిపోయిన ఆహారపదార్ధాలు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా మందపాటి కాగితపు కవర్లలో వేసి బయట పడవెయ్యాలి. దానివల్ల జంతువులకు హాని ఉండదు..


* ఇలా నెమ్మదిగా ప్లాస్టిక్ ను పూర్తిగా వాడటం మానివెయ్యాలి.ఎప్పటికయినా ప్లాస్టిక్ ను వాడటం పూర్తిగా మానేయాలి. మనం వాడి పారేసిన వస్తువులు రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ వాడటం తలుచుకుంటేనే వాంతి వస్తోంది...


* ఒకవేళ శాస్త్రవేత్తలు తామరాకును పోలిన పదార్ధాన్ని కనిపెట్టినా మానవులు కనిపెట్టిన ప్రతి కృత్రిమవస్తువుకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా ఉంటాయి. ఎంతయినా ప్రకృతిలో సహజంగా దొరికిన వాటిని వాడుకుంటే అంతా మంచి జరుగుతుంది..

 

4 comments:

  1. మనం వాడి పారేసిన వస్తువులు రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ వాడటం తలుచుకుంటేనే వాంతి వస్తోంది...
    ---------
    రీసైక్లింగ్ అంటే మీరు అనుకుంటున్నట్లు కాదనుకుంటాను. పాత బంగారాన్ని కరిగించి కొత్త ఆభరణాలు చేసి నట్లు.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి.
    నిజమేలెండి. రీసైక్లింగ్ అంటే అంతా కరిగించి మళ్ళీ కొత్తగా తయారుచేస్తారు. ........ అయినా మానసికంగా ఒక రకమైన ఫీలింగ్ అంతే........

    ఈ రోజుల్లో శానిటరీ నాప్కిన్స్, చికెన్ షాప్ లో మిగిలే వ్యర్ధాలు, హోటల్స్ లో పారవేసే ఎంగిలిపదార్ధాలు పదార్ధాలు దగ్గర్నుంచి ........ రకరకాల రసాయనాల చెత్త వరకూ ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టి పారవేస్తున్నారు కదా...

    ఒకోసారి ఆ చెత్తయొక్క అవశేషాలు ,ఇంకా ఎన్నో రసాయనాల మలినాలు ఇలాంటివన్నీ .......... ప్లాస్టిక్ రీసైక్లింగ్ అప్పుడు కరిగి అందులో మిగిలిపోవచ్చు కూడా...

    ( ఈ వ్యర్ధాలను కాగితపు కవర్స్ లో వేసి పారవేస్తే కాగితపు కవర్తో సహా అవి మట్టిలో కలిసిపోతాయి. )

    .ఇక హాస్పిటల్స్ లో ఆపరేషన్స్ తరువాత వచ్చే శరీరభాగాల వ్యర్ధాలు లాంటివి కూడా కవర్స్ లో ఉంచి బయట వేస్తుంటారు. ఇలా చెప్పాలంటే ఎన్నో వ్యర్ధాలు ఉంటాయి........ పాతకాలంలో వీటిని మట్టిలో కప్పిపెట్టటమో, అగ్నిలో వేయటమో చేసేవారు. పాపం అగ్ని అన్నిటిని భరిస్తుంది కదా.........

    ఆ మధ్య కొన్ని దేశాలలో ................ ప్రజలు వాడి వదిలేసిన మురికి నీరుని శుద్ధి చేసి ........... తిరిగి మంచినీరుగా తయారు చేస్తామంటే ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందట. ముందుముందు నీటికరువు వస్తే ఇవన్నీ ఎలాగూ తప్పవులెండి......... . ..... .............

    .ఇంకా, పూర్వం ప్రతి పల్లెటూరిలో చెరువు ఉండేది. ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద బావి ఉండేది. ఆ నీటిని ఊరి ప్రజలు త్రాగటానికి వాడేవారు. కొంతమంది ఇంట్లో కూడా నూతులు ఉండేవి.

    ReplyDelete
  3. Packaged foods, drinks వాడడం మానేస్తే బోలెడన్ని ప్లాస్టిక్ సమస్యలు తగ్గుతాయి.

    ఒకసారి నా బ్లాగులో "రైల్ నీరు" కూడా చదవండి.

    ReplyDelete
  4. ధన్యవాదాలండి.
    మీరు వ్రాసిన "రైల్ నీరు " చక్కటి ఆలోచన. అలా రైలులోనే పరిశుభ్రమైన నీరు అందించగలిగితే ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం చాలా వరకూ తగ్గుతుంది.

    ప్రభుత్వం వారు ఈ పధకం అమలుచేస్తే ఎంత బాగుంటుందో. అలా జరగాలని ఆశిస్తున్నానండి.........

    ReplyDelete