koodali

Monday, February 7, 2011

మన పెరట్లో కూడా చిన్నపాటి బిగ్ బాంగ్ లాంటి........

 

శ్రీ ఆంజనేయస్వామికి ప్రణామములు.

మనకు ఒకోసారి చెట్టు ముందా ? విత్తు ముందా ? అని సందేహం వస్తూంటుంది. ఈ రెండింటిని సృష్టించిన ఆ దైవశక్తి ముందని పెద్దలు చెబుతున్నారు. చెట్టులోనూ, విత్తులోనూ కూడా చైతన్య రూపంలో ఆ శక్తి ఉండటం జరుగుతుంది.

ఒకప్పుడు పెద్ద విస్ఫోటనం జరిగి దాన్నించి గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడ్డాయని అంటున్నారు కదా .....


అంటే.. ఒకప్పుడు పెద్ద విస్ఫోటనం జరిగి అందులోనుంచి గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాల కాలం గడిచాక ఆ గ్రహాలు, నక్షత్రాలు భూమి మరల నెమ్మదిగా కుంచించుకుపోతూ అతి సూక్ష్మ పరిమాణంలోకి మారిపోతాయట........


ఇలా ప్రళయం జరిగి కొంత కాలం గడిచాక దైవం మరల పునఃసృష్టిని సంకల్పించిన తరువాత భూమి అవి మరల తిరిగి ఆవిర్భవిస్తాయట. .......


ఇలాగే మన పెరట్లో కూడా ఇలాంటి పోలికలు గల విశేషాన్ని గమనించవచ్చు. 

ఉదా.......కొన్ని చెట్ల ఎండిన ఫలాలలో ఎన్నో విత్తనాలు ఉంటాయి. ఆ ఎండిన కాయ విస్ఫోటనం చెంది ఆ బీజాలు అంతా వెదజల్లబడి కొంతకాలానికి అవి మొలకెత్తి అందులోనించి మొక్క వస్తుంది. అది క్రమంగా పెరిగి కొమ్మలు, అలా శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. కొన్నాళ్ళకు ఎండిపోతుంది.


దాన్నించి వచ్చిన ఫలాలు నెమ్మదిగా కుంచించుకుపోయి అంటే ఎండి చిన్నగా అయిపోతాయి.

కొంతకాలానికి ఆ ఎండిన ఫలం పగిలి మళ్ళీ మళ్ళీ మొక్క రావటం ఇలా నిరంతరంగా జరుగుతుంది.

అసలు అంత చిన్న విత్తనమ్నుంచి .... పెద్ద చెట్టు కొమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరించటం ఇదంతా భలే ఆశ్చర్యంగా ఉంటుందండి.

అంత పెద్ద చెట్టు అంత చిన్న విత్తనంలో దాగుంటుంది . ఇది చాలా ఆశ్చర్యం కదండీ. అంతా దేవుని లీల.

ఇందులో ఎన్ని తప్పులున్నాయో తెలియదు తోచింది రాశాను . దయచేసి భగవంతుడు క్షమించాలని కోరుకుంటూ.

 

No comments:

Post a Comment