koodali

Friday, February 25, 2011

పేర్లు ఎన్నయినా దైవం ఒక్కటే........... మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు .......

 

భగవంతుని నమ్మే అందరూ తాము పూజిస్తున్న దైవం విశ్వాన్ని సృష్టించారనే నమ్ముతారు. అంటే ప్రపంచంలో ఉన్న అందరు మానవులనీ తాము నమ్ముతున్న దైవమే సృష్టిస్తారని నమ్ముతాము.

అలాంటప్పుడు మన ప్రక్కవాళ్ళు కూడా ఆ దైవం సృష్టించిన వాళ్ళే కదా ! వారియందు మనకు భేద భావం ఎందుకు ?

ఇంకా, సూర్యుడు, చంద్రుడు ప్రపంచంలో ఒక్కరే.

సూర్యుని కొందరు సన్ అంటారు, కొందరు సూర్యుడు అంటారు.......... అలాగే చంద్రుని కొందరు మూన్ అంటారు, కొందరు చంద్రుడు అంటారు.

ఎవరు ఏ పేరుతో పిలిచినా మానవులందరికీ ' చంద్రుడు ' ఒక్కరే. మానవులందరికీ ' సూర్యుడు ' ఒక్కరే.

చంద్రుని, సూర్యుని అన్ని మతములవారు వారివారి పధ్ధతులలో పూజించుకుంటారు.

రంజాన్ పండుగ సమయాలలో చంద్రోదయానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ముస్లిం మతమును అనుసరించేవారు,.............పండుగలలో పూజలలో చంద్రునికి ఇంపార్టెన్స్ ఇస్తారు హిందూ మతమును అనుసరించేవారు..

మా చంద్రుడు మాత్రమే గొప్ప అని కొందరు అంటే .........మా మూన్ మాత్రమే గొప్ప అనికొందరు ..

 అలాగే మా సూర్యుడు మాత్రమే గొప్ప అని కొందరు........ మా సన్ మాత్రమే గొప్ప అని కొందరు వాదించుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఎందుకంటే సూర్యుడు , చంద్రుడు ఎవరికయినా ఒకటే కదా.........

అలాగే మానవులందరూ ' దైవం ' ' మతం ' విషయాలలో
ఎవరి ఆచారాలను వారు పాటించుకుంటూ ......ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ... ఇతరుల మతములను గౌరవిస్తూ గొడవలు లేకుండా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు.

ఏకత్వంలోనే భిన్నత్వం............భిన్నత్వంలోనే ఏకత్వం అన్న మాట.. ......
అంటే......... ఒకే దైవంలో అన్ని దేవుళ్ళరూపాలను దర్శించగలగటం...........అన్ని దైవరూపాలలోనూ ఒకే దైవాన్ని దర్శించగలగటం అన్నమాట. 

 

 

2 comments: