koodali

Tuesday, June 12, 2018

కొన్ని విషయాలు...



ప్రపంచం ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరు  ప్రత్యేకమైన వ్యక్తుల  మధ్య శాంతి కొరకు చర్చలు జరగటం అనేది…  ఊహించలేని ఆశ్చర్యకరమైన విషయం

మాత్రం  పరిస్థితి మెరుగుపడటం అంటే  అంతా దైవం దయ.

భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది దైవానికే తెలుస్తుంది.

 ***********
 న్యూస్ పేపర్ చదవటం అంటే నాకు  చిన్నప్పట్నించి చాలా ఇష్టం. అందువల్ల ప్రపంచ చరిత్ర గురించి నాకు కొంత తెలుసు.

 నేను హిస్టరీలో  పోస్ట్ గ్రాడ్యుయేషన్   చేసాను.  ప్రపంచ రాజకీయాలు, అమెరికా దేశ చరిత్ర, భారతదేశ చరిత్ర, ..ఇలా కొన్ని సబ్జెక్ట్లు ఉన్నాయి. 

అవి  చదివాను కాబట్టి ,  నాకు ప్రపంచ చరిత్ర గురించి  బాగా తెలుసు అనుకోనవసరం లేదు

ఏదో బట్టీ పట్టి   చదివి రాసాను. దైవం దయ వల్ల పాసయ్యాను.  

చరిత్ర  విషయంలో సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలంటే నాకు చాలా కష్టమయింది.  ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అని  కొన్నిసార్లు  ఏడుపు కూడా వచ్చేది

మొత్తానికి దైవం దయ వల్ల పీజీ పూర్తి చేసి డిగ్రీ పొందగలిగాను.

అయితే , నాకు న్యూస్ పేపర్ చదవటం అంటే ఉన్న ఇష్టంతో   న్యూస్ పేపర్లను   ఆసక్తిగా చదవటం వల్ల    ఒక్కసారే  చదివినా  కూడా   గుర్తుంటాయి.

 పీజీ డిగ్రీ  కొరకు చదవటం  అంటే అంత   ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల,  అలా  చదివిన విషయాలు అంతగా గుర్తు ఉండవు 
 

1 comment:



  1. రోడ్డుపై డివైడర్లు ఉన్నఫ్ఫుడు ట్రాఫిక్ జాం అవటం తక్కువ. కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు , డివైడర్ లేని రోడ్దుమధ్య తాడుతో టెంపరరీగా విభజించి ట్రాఫిక్ సరిగ్గా వెళ్లేటట్లు ఏర్పాటు చేస్తారు.

    అయితే కొన్నికారణాల వల్ల ఇలాంటి ఏర్పాట్లు చేయలేనప్పుడు అధిక జనం ఫంక్షన్ కు వస్తే, రోడ్దుపై వచ్చేవాళ్లు , పోయేవాళ్లతో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది.

    ఇక జనం కూడా తామే త్వరగా వెళ్ళాలనుకుంటూ సందు దొరికితే బండిని ముందుకు పోనిస్తూ సన్నని రోడ్లపై మూడు నాలుగు వరుసలుగా ముందుకు వచ్చేస్తారు.

    ఇక ట్రాఫిక్ జాం అయి ఎన్ని గంటలైనా బండ్లు సరిగ్గా ముందుకు పోవు.

    సన్నని రోడ్దు మాత్రమే ఉన్నప్పుడు, జనం తమ ఇష్టానుసారంగా బండ్లను మూడు నాలుగు వరుసలుగా ముందుకు పోవటం కాకుండా ...

    వెళ్లే దారిలో వెహికల్స్ అన్నీ ఒకదాని తరువాత ఒకటి గా ఒకే వరుసలో ముందుకు వెళ్లేటట్లు... వచ్చేవి కూడా ఒకే వరుసలో వచ్చేటట్లు చూసుకుంటే... ట్రాఫిక్ జాం అవకుండా ఎన్ని వెహికల్స్ అయినా సునాయాసంగా ముందుకు వెళ్ళగలవు. ట్రాఫిక్ జాం అవదు.

    అయితే ప్రజలలో ఈ క్రమశిక్షణ ఎప్పుడొస్తుందో ? అందరూ ఒకేసారి ముందు కెళ్లాలనే దూకుడుతో భయంకరమైన ట్రాఫిక్ జాం కు ఎందుకు కారణమవుతారో ?

    ReplyDelete