koodali

Wednesday, August 8, 2012

.ఓసోస్ !...ఇంతేనా .! .

ఒక  చిన్న  కధ  ...........
 
 ఎప్పుడూ  బిజీగా  ఉండే  ఒక  వ్యక్తి ,  అర్జంట్   పని  వల్ల  వేరే  ఊరికి  వెళ్తున్నాడు.  ఒక  పల్లెటూరి  దారిలో  వెళ్తుండగా  ఏదో  ప్రాబ్లం  వచ్చి  కారు  ఆగిపోయింది. డ్రైవర్  ఎంత  ప్రయత్నించినా  కారు  స్టార్టవలేదు. 

 

అక్కడకు  కొద్ది  దూరంలో   పశువులను  మేపుకుంటూ   ఒక  చెట్టు  క్రింద  కాలుమీద   కాలు  వేసుకుని 
కూర్చుని  హాయిగా  పాటలు  పాడుకుంటున్న  ఒక  పిల్లవాడు    ఉన్నాడు.  
 

 కారు  ఆగిపోవటం  ...   ఇదంతా    చూసి  ఆ  పిల్లవాడు  గబగబా  వచ్చి  పరామర్శించాడు.   ఊళ్ళోని   మెకానిక్  గురించిన   కొన్ని  వివరాలను  వారికి    తెలియజేశాడు. 

 
 మళ్ళీ  వెళ్ళి  చెట్టు  క్రింద  కూర్చున్నాడు.

  డ్రైవర్  మెకానిక్  కోసం  వెళ్ళాడు.

 పెద్దమనిషి  జరిగినదానికి  తిట్టుకుంటూ , విసుగ్గా  కారు   డోర్  తెరిచి  కూర్చున్నాడు. 

 

 ఏసీ    గదుల్లో  పుట్టిపెరిగిన  అతడికి  ఈ  పైరగాలి,  పచ్చదనం   గురించి  అంతగా  తెలియదు.  ఆహ్లాదకరంగా  వీస్తున్న   గాలివల్ల  , క్రమంగా  అతని  చిరాకు   తగ్గసాగింది.


 చిత్రంగా , పెద్దమనిషికి   ఆ  పిల్లవానితో  మాట్లాడాలనిపించింది. 
 

కారుదిగి  నిలుచుని  పిల్లవాడిని  పిలిచాడు. .......పిల్లవాడు  వచ్చాడు.

పెద్ద  మనిషి.......నువ్వు    ఎంతవరకూ  చదువుకున్నావు   ?


 
పిల్లవాడు...........చదువు  అంటే  ఏంటి  సార్  ?

 
  (  పెద్దమనిషి  తడబడ్డాడు. ) 

పెద్ద  మనిషి...........చదువు  అంటే,    ఏదన్నా  విషయాన్ని   గురించి  తెలుసుకోవటం,  నేర్చుకోవటం.

 

పిల్లవాడు.............పశువుల  ఆలనా పాలన    ,  వాటి    గురించి    తెలుసుకోవటం,  నేర్చుకోవటం ..... చదువు  కాదా  సార్ ? 


   (పిల్లవాడు  అమాయకంగా  ప్రశ్నించాడు.)
 

  (  మాట  మార్చటం  కోసం ....
పెద్దమనిషి  ,)

పెద్ద  మనిషి............. స్కూల్ కు వెళ్లి    బాగా  చదువుకోవాలి  .

 
పిల్లవాడు............బాగా   చదువుకుంటే  ఏమవుతుంది  సార్    ? 

 
పిల్లవాడు............బాగా  చదువుకుంటే  గొప్ప  ఉద్యోగం  వస్తుంది  .


 
పిల్లవాడు............పెద్ద  ఉద్యోగం  వస్తే  ? (  పిల్లవాడిలో  తెలుసుకోవాలన్న  ఉత్సాహం   పెరిగింది )


 
పెద్ద  మనిషి...........ఉద్యోగం  వస్తే,. .బాగా  డబ్బు  సంపాదించవచ్చు.

 
పిల్లవాడు.............బాగా  డబ్బు  సంపాదిస్తే  ?

 
పెద్ద  మనిషి.............బోలెడు  వస్తువులు  కొనుక్కోవచ్చు.

 
పిల్లవాడు............బోలెడు  వస్తువులు   కొనుక్కుంటే  ?


 
పెద్ద  మనిషి............బోలెడు  వస్తువులు  కొనుక్కుంటే ,..నాలా  కాలు  మీద  కాలు  వేసుకుని  హాయిగా  పాటలు  పాడుకోవచ్చు.


 
పిల్లవాడు..............ఓసోస్  !...ఇంతేనా .! ..

ఇందాకా    నేను  కూడా   కాలు  మీద  కాలు  వేసుకుని  హాయిగా  పాటలు  పాడుకుంటున్నాను  కదా  ! 
 
 (  పిల్లవాడు   తేలిగ్గా  తీసిపారేశాడు.  పెద్దమనిషి  మాటల్ని.) 

 
ఈ  కధను   ఎప్పుడో  చాలా  కాలం  క్రితం  చదివానండి.  సంభాషణలు    చదివినవి  చదివినట్లుగా   గుర్తులేవు.  నాకు  పేరు  తెలియని  ఆ   రచయితకు  నా  కృతజ్ఞతలు....



10 comments:

  1. Replies
    1. ఆ రచయిత చక్కటి కధను అందించారండి.

      Delete
  2. ఏదో సినిమాలో కూడా చూసిన గుర్తు,nice one.

    ReplyDelete
    Replies
    1. ఆ రచయిత చక్కటి కధను అందించారండి.

      Delete
  3. Replies
    1. ఆ రచయిత చక్కటి కధను అందించారండి.

      Delete
  4. Replies
    1. ఆ రచయిత చక్కటి కధను అందించారండి.

      Delete
  5. Dil cinama lo Nitin-Chalapathi Rao discussion ilage vuntundi...

    ReplyDelete
    Replies
    1. ఆ రచయిత చక్కటి కధను అందించారండి.

      Delete