koodali

Wednesday, August 15, 2012

ఒకరి సంపద 100 కోట్లు.....ఒకరి సంపద 100 నోట్లు.......


 దేశానికి  స్వాతంత్ర్యం  రావటానికి   ఎన్నో  త్యాగాలను  చేసిన     ఎందరో   త్యాగమూర్తులకు   అనేక  నమస్కారములు.

..................................

అసలు మన దేశము
లో   ఇంత దరిద్రము   ఎందుకు   ఉందంటే , ఒకరి దగ్గర 100కోట్లు ఉంటే ఒకరి దగ్గర ఓటు తప్ప నోట్లు,  కోట్లు ఉండవు కాబట్టి.  కొంత   మంది ప్రపంచములో సొమ్మంతా వారి తరతరాలకి దాచి అత్యాశకు పోతున్నారు.
 

అసలు మనకు కావాల్సిన దానికన్న ఒక లిమిట్ దాటి సంపాదించుకోవటము మహా పాపము. 


ధనవంతులు చాలా మందికి కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది కాని , కడుపు నిండా ఇష్టమయినవి తినలేరు. 


 మనలో చాల మందికి ఏ షుగరు జబ్బో, బి.పి,జబ్బో ఉంటాయి. ఇంకా,  మనశ్శాంతి లేక ఎన్నో కష్టాలుంటాయి. అప్పుడు డబ్బు ఎక్కువ ఉండి కూడా ఏం  లాభం ? 


 అందరి సొమ్ము దోచుకునేవాళ్ళు వచ్చే జన్మలో బిచ్చగాళ్ళుగా పుట్టే  అవకాశం   ఉంది.
 
 కుటుంబంలో  సమస్యలు,   ప్రమాదాలు  వంటి  సమస్యలు  ..... డబ్బు  ఉన్న  వాళ్ళకి,  డబ్బు  లేని  వాళ్ళకు  కూడా  ఉండే  అవకాశం  ఉంది.  అలాంటప్పుడు  డబ్బు  చాలా  ఉన్నా  ఏం  లాభం ...



దయచేసి , ధనవంతులు మరీ ఎక్కువ  డబ్బు పోగు చేసుకోవటం మాని ,  పేద వాళ్ళు కూడా పైకి రావటానికి సహాయపడితే ఎంతో పుణ్యము చేసిన వాళ్ళవుతారు. ఆ పుణ్యము వల్ల ధనవంతులకు కూడా జీవితములో ఎంతో సంతోషముగా ఉంటుంది......


అంతే గాని ,  పేదలను దోచుకుని భగవంతుని పూజ చెయ్యటము మహా పాపము.
 

ఈ ప్రపంచము మన ఒక్కరి కోసము కాదు. ఈ సంపద అందరితో కలసి మనము పంచుకోవాలి. అప్పుడు మాత్రమే పేదరికం ఉండదు.



మనము ఇంకొకరికి సహాయము చేసినప్పుడు ఉండే   తృప్తి   ఎన్ని లక్షలున్నా,  కోట్లున్నా  రాదు. ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. దయ చేసి,   ధనవంతులూ కొంచెము ఆలోచించండి. ప్లీజ్...
 

మనము ఏదైనా కష్ట సమయములో రక్షించమని భగవంతుని అడిగితే , దానికి మన అర్హత, మనకు  ఎంత కోట్ల ఆస్తి ఉందని ఆయన ఆలోచించడు. మనము ఎంత మందికి సహాయము చేశామని మాత్రమే
వారు చూస్తారు.


5 comments:

  1. అనూరాధ గారు మీ కోరిక నెరవేరాలనుకుంటా.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మన అందరి కోరిక నెరవేరాలని కోరుకుంటూ.....

    ReplyDelete
  3. చాలా బాగా చెప్పారండి."సంతృప్తిగా జీవించాలంటే"అనే వ్యాసం లో ఈ విషయాలను వివరించాను.నా బ్లాగును గమనించగలరు.

    ReplyDelete

  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. వ్యాఖ్యను ఇప్పుడే చూశానండి. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    మీరు రాసిన టపా ఇంతకు ముందు చదవానండి. చాలా బాగా వ్రాసారు. మళ్ళీ తప్పక చదువుతానండి.

    ReplyDelete