koodali

Monday, August 20, 2012

కురువపురం....ఎంతో గొప్పక్షేత్రం.

ఓం.

 ఆదివారం  మరియు  రంజాన్  పండుగ  శుభసందర్భంగా  సోమవారం  కార్యాలయాలకు  సెలవు  ప్రకటించారు  కదా  ! 
 
మేము  శ్రీపాద  శ్రీవల్లభస్వామి  వారి  దేవస్థానం ..... కురువపురం  వెళ్ళి  వచ్చామండి.  అంతా  దైవం  దయ.  చాలా  అద్భుతంగా  ఉంది.


కొంత దూరము  కృష్ణా  నదిలో  తెప్పలో  వెళ్ళాము. కొద్దిగా  భయంగా  అనిపించింది  గానీ,  దైవం  దయవల్ల  క్షేమంగా  చేరాము. 

 కురువపురం  ఒక  ద్వీపమ్ . నది  మధ్యలో   ఉన్నది.  అయితే, వేసవిలో  నదిలో (నీరు లేనప్పుడు)  నడిచి వెళ్ళ వచ్చట .


ఈ  క్షేత్రం  ఎంతో  గొప్పక్షేత్రం.  జీవితంలో  ఒక్కసారైనా  దర్శించుకుంటే  మంచిదని  పెద్దలు  చెబుతున్నారు.

  అంతా  అద్భుతమైన  ప్రకృతి  సౌందర్యం,  పక్షుల  కిలకిలారావాలు,  పచ్చటి  పొలాలు  చాలా  బాగున్నాయి.

 దర్శనం  చేసుకుని   ఈ  రోజే    తిరిగి  వచ్చాము.

కురువపురం  దేవాలయం  ఎంతో  ప్రశాంతంగా  అద్భుతంగా  ఉంది.

 ఇంత  అద్భుతమైన  దర్శనాన్ని  అనుగ్రహించిన  శ్రీపాద  శ్రీ  వల్లభ  స్వామి  వారికి  అనేక  నమస్కారములు.   అంతా  దైవం  దయ.  


కురువపురం  గురించి ,   ఈ  లింక్  లో..... వివరములున్నాయి.  

1............Shripad Shri Vallabha. 

2...Glory of Kurugadda(Kuruvapuram)--Please hurry to visit this place.

 

3..Shripada Shrivallabha Devasthan (sripada Srivallabha).............

 

*  Kuravpur - Sreepada Sreevallabha Maha Samasthan  

 

 దేవ స్థానం  గురించి  ఎన్నో  వివరములు  ఈ  లింకులో  ఉన్నాయండి.

....................

జగద్గురు  శ్రీశ్రీశ్రీ  దత్తాత్రేయ స్వామి  మహా సంస్థాన  పీఠం.
శ్రీ క్షేత్ర  శ్రీ వల్లభాపురము
పంచ దేవ పహాడ్ ( పోస్ట్ )....509208.
మఖ్తల్  (  మండలం ) మహబూబ్  నగర్  జిల్లా..


ఇక్కడ   నది  దాటి  కొద్ది  దూరం  వెళ్తే   శ్రీపాదశ్రీవల్లభస్వామి  వారి  దేవాలయాన్ని  చేరుకోవచ్చు.

 

6 comments:

  1. Link ivvandi akkadiki ela cherukovalo?

    ReplyDelete
  2. కురువపురం గురించి, అక్కడకు వెళ్ళే మార్గాల గురించి మరి కొన్ని విషయాలు ఉన్న లింక్స్....

    * పైన టపాలో కూడా ఈ లింక్స్ ఇస్తున్నానండి.

    1...Glory of Kurugadda(Kuruvapuram)--Please hurry to visit this place.

    2...Shripada Shrivallabha Devasthan (sripada Srivallabha)

    ReplyDelete
  3. మీ యాత్రా విశేషాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.సమయం చిక్కినపుడు వెళతాము.

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. వీలు కుదిరినప్పుడు వెళ్ళిరండి.

    ReplyDelete
  5. అనూరాధ గారు,
    మీ యాత్రా విశేషాలు మాతో పంచుకుని, మమ్మల్నీ మానసికంగా యాత్ర చేయించిన పుణ్యం మీదే!

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేకపోయినా మానసికంగా అక్కడకు వెళ్ళినట్లు భావించుకుంటే చాలు...అక్కడకు వెళ్ళినంత ఫలితం లభిస్తుందని అంటారు కదండి.

    ReplyDelete