koodali

Monday, August 13, 2012

విపరీతంగా పెరిగిపోయిన ఆర్ధిక అసమానతలు.

 ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  అందరికీ  అనేక  కృతజ్ఞతలండి.
.................................


నీరు,  భూమి, సూర్యుడు,  గాలి,   వాతావరణం,    విత్తనాలు .......... ..ఇలా    మనిషి  జీవనానికి  కావలసిన  ఎన్నింటినో    దైవం  చక్కగా     సృష్టించి  ఇస్తే ,  వాటిని  సరిగ్గా  పంచుకుని  జీవించటం  కూడా    ప్రజలకు  చేతకావటం  లేదు.  ఇప్పటికీ    కొందరు  ప్రజలు   ఆహారం  కూడా  లభించక  మరణించటం  అనేది  ఎంతో  సిగ్గుపడవలసిన  విషయం.   చక్కటి  ప్రణాళిక,  చిత్తశుద్ధి  ఉంటే  సమాజంలో  ఇన్ని  అసమానతలు  ఉండవు   కదా! 

 

  కొందరు  పదితరాలకు  సరిపడా  సంపాదించి    దాచిపెడుతుంటారు.  తాము  మరణించిన  తరువాత  ఆ  సొమ్ము  ఏమవుతుందో  వీరికి  తెలియదు.  అయినా  అత్యాశతో  నానా  కష్టాలు  పడి  సంపాదిస్తారు.  అత్యాశ  వల్ల  ఇహలోకంలోనూ,  పరలోకం  లోనూ  కూడా  ఎన్నో  కష్టాలను  అనుభవించవలసి  వస్తుందని  ప్రాచీనులు  చెప్పటం  జరిగింది.  అన్నీ  తెలిసి  కూడా  ప్రజలు  స్వార్దాన్ని  తగ్గించుకోలేకపోవటం  చూస్తే   ఆశ్చర్యంగా  ఉంటుంది. 


 ఇప్పుడు  సమాజంలో  ప్రజల  మధ్య  ఆర్ధిక  అసమానతలు  విపరీతంగా   పెరిగి పోయాయి. వ్యాపారస్తులు,  ఉద్యోగస్తులు,  అన్నిరంగాల  ప్రజల  ఆదాయాల్లో  విపరీతమైన  తేడాలు  ఉంటున్నాయి. 

 
    నేను  రాసిన  రెండు  పాత  టపాలలోని   కొన్ని  విషయాలను   క్రింద  ఇస్తున్నానండి.  దయచేసి  చదువుతారని  ఆశిస్తూ.........

 
....................
 Wednesday, June 9, 2010  ధరలు తగ్గాలంటే ఇలా చేస్తే .........
 
ఆ మద్య నా  భర్తకు 
జీతం  పెరిగింది.  అయితే జీతాలు పెరిగిన దాని గురించి నేను పూర్తి స్తాయిలో సంతోషించలేదని వారు అన్నారు.... నాకు వారికి దీని గురించి చిన్న సంభాషణ  కూడ జరిగింది.


అసలు నేను ఏమన్నానంటే , దేశంలో ఇంతమంది పేదవారుంటే ఇంకా జీతం పెంచమనటం తప్పు అనీ,ఒక ప్రక్క వేరే దేశాలలో ఉద్యోగాలు ఊడిపోతుంటే మనం ఉద్యోగం ఉన్నందుకు సంతోషించక జీతం పెంచమనటం అన్యాయం అని ....

 

వారేమో.. ఆ.... మేము ప్రొద్దున్న నుంచి రాత్రి వరకూ ఎంతో కష్టపడుతున్నాము.  అని అన్నారు.

 
నేనేమో.... మీరు ఎ.సి రూంస్ లో పనిచేస్తూ ఇంత బాధపడుతుంటే చాలామంది కార్మికులు, కర్షకులు, చిన్నపనివారు ఎండలో ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు వాళ్ళకు జీతాలు ఎవరూ పెంచరు కదా  ! అని  అన్నాను.


 అసలు నా అభిప్రయమేమిటంటేనండీ , ధరలు తగ్గాలంటే....జీతాలు తగ్గాలండి.

డబ్బంతా కొంతమంది జీతాలకే పోతే పేదవారు ఏమి కావాలి. వారి కష్టం కష్టం కాదా....జీతాలు పెరిగిన వెంటనే వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ధరలు  పెరిగితే  మళ్ళీ  జీతాలు  పెంచమంటారు.  ఇక జీతాలు పెరిగి లాభమేమిటి...ఇదొక అంతులేని కధ....


ఒక ఉద్యోగికి 40వేలు నెలకు వస్తే ఒక చిన్న కార్మిక, చిన్న వ్రుత్తి వారికి 4 వేలు నెలకు వస్తే పెరిగిన జీతంవల్ల పెద్ద ఉద్యోగికి బాధ ఉండదు. కాని చిన్న ఉద్యోగి ఎలా బ్రతకాలి......? ఉద్యోగం లేని వారికి జీతాలు ఎవరు పెంచుతారు. 



రైతుల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారిని ఎవరూ పట్టించుకోరు. పేదవారు , కూలీలు వీరు ఈ రేట్లతో ఎలా బ్రతకాలి...? అందరి కష్టం ఒకటి కాదా.. .


జీతం పెరిగితే ధరలు పెరిగినప్పుడు....జీతాలు తగ్గిస్తే ధరలు తగ్గవా.. అని నా అభిప్రాయం. ...... ఉదాహరణకు ఆ మద్య ఐ.టి రంగం ప్రాబ్లంస్ లో ఉన్నప్పుడు .... ఇళ్ళు,,,స్తలములు కొనేవాళ్ళు లేక  ధరలు తగ్గాయి కదా.. ఇంటి అద్దెలు కూడా తగ్గాయి. .కొంతమంది చిన్న,మద్య తరగతి వాళ్ళు ఇళ్ళు,అవి కొనుక్కున్నారు కూడ..


అసలు ధరలు తగ్గించటం వల్ల వ్యాపారులకు కూడా లాభం. ధరలు ఎక్కువ ఉన్నప్పుడు 10 మంది సరుకులు కొంటే ధరలు తగ్గిస్తే 20 మంది వస్తువులు కొనే చాన్సుంది. అందరికి అన్నీ అందుబాటులోకి వస్తాయి.


 ఏ వ్రుత్తిలో ఉన్నా అందరి కష్టం ఒకటే . వారి ఆదాయములులలో ఇంత పెద్ద తేడాలు ఉండకూడదు. ఆ రోజునే సమసమాజం ఏర్పడినట్లు. ఆ పరమాత్మ ద్రుష్టిలో రాజుకు, బంటుకు, ఒకే రకమయిన విలువవుంటుంది....



రానురాను మన దేశంలో పేదలు మరీ పేదలుగాను, ధనికులు మరీ ధనికులు గాను అవ్వటం చూసి ఇలా నాకు తోచింది రాస్తున్నాను. నాకు ఇందులో తప్పులు ఉంటాయని భయమే కానీ నా అభిప్రాయములు మీతో చెప్పుకోవటానికి రాస్తున్నానంతేనండి. తప్పులను దయచేసి క్షమించండి..........
...............................

జూన్ 11, 2010
సుఖాలు అనుభవించే కొద్దీ.....పుణ్యక్షయం...................కష్టాలు అనుభవించే కొద్దీ....పాపక్షయం......

 
నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదే మరి.. నా వ్యాసాలను చదివి ఎవరయినా బాధ పడ్డారేమోనని కొంచెము ఫీలయ్యాను. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలలోను మంచివారు, దైవభక్తులు, సాటి ప్రజల  యందు  దయగలవారు చాలామంది ఉంటారు గదా.... వీళ్ళందరూ నన్ను అపార్ధము చేసుకోకూడదని ........... నా అభిప్రాయములు వ్యవస్త గురించె గాని ఏ వ్యక్తుల గురించి కాదని దయచేసి గ్రహించగలరు.

మన వ్యవస్ధ ఇలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు , సంపద ప్రభుత్వం దగ్గర కొంత భాగం, మిగతా ప్రజల అందరి వద్దా సమానంగా ఉండాలి.ఇప్పుడేమో ప్రభుత్వం, ప్రజల వద్ద కన్నా ప్రైవేట్ కంపెనీల వద్ద ఎక్కువ ఉంటోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఏ విధంగా ప్రజల సంక్షేమం చూడగలదు?


ఇవన్నీ ఆలోచించి పాత కాలం నాయకులు జమీందారీ వ్యవస్త రద్దు, భూపరిమితి చట్టం ఇలా  చేశారు. ఇప్పుడు మళ్ళీ  కొందరి  దగ్గరే   సంపద  ఉండిపోతోంది.

ఇలా ..పేదరికం పెరిగిపోటానికి ఎన్నో కారణాలున్నాయి.


ప్రజలలో కూడా లగ్జరీస్ అంటే వ్యామోహం బాగా పెరిగిపోయింది.  ప్రాధమిక అవసరాలు తీరని   వాళ్ళు  చాలామంది ఉన్నారు.ప్రభుత్వం ముందు
ప్రాధమిక అవసరాలకు  ప్రాముఖ్యం ఇవ్వాలి.


నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ దేవీ భాగవతములో ఇలా చెప్పారండి.

 
దేవేంద్రుడు ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు , బృహస్పతి.. దేవేంద్రుని    ఓదార్చిన సందర్భములో చెప్పిన విషయమిది.

 

ఈ విషయం గురించి ఎక్కువ వివరించే శక్తి నాకు లేదు కానీ అండి, కొంచెం చెప్పగలను. మనము సుఖములు అనుభవించేకొద్దీ మనం చేసుకున్న పుణ్యం యొక్క మొత్తం తగ్గుతూ వస్తుందట. కష్టాలు అనుభవించినప్పుడు పూర్వ జన్మలో చేసిన పాపం తగ్గుతూ వస్తుందంట. అంటే సుఖములు అనుభవించే కొద్ది వారి యొక్క పుణ్యం త్వరగా అయిపోతుంది అన్నమాట.



 
మనం ఎప్పుడూ సుఖముగా ఉండాలంటే ,  ఎప్పుడూ ధర్మ కార్యాలు చేస్తూనే ఉండాలి. కష్టాలలో ఉన్నవారు తమ పూర్వ జన్మ పాపం తగ్గిపోతోందని తమకు తాము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరయినా ధర్మబధ్ధమైన సుఖాలు మాత్రమే అనుభవించాలి.

 

కొద్ది మంది మహానుభావులు సాత్విక కర్మలతోసహా అన్ని కర్మలను త్యజించి దైవం ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటారంట. ఆ మహానుభావులు ఎక్కడో ఉంటారు.


తల్లి,తండ్రి చేసిన పుణ్యం,పాపం పిల్లలకు తగులుతాయంటారు. దయచేసి అందరూ తమ పిల్లల సుఖం కోసమయినా ధర్మ కార్యాలు మాత్రమే చేయ్యాలి.



 చెడ్డ పనులు చేసి సంపాదించిన డబ్బుతో పూజలు చేస్తే పుణ్యం రాకపోగా కష్టాలు రావచ్చని పెద్దలు చెపుతున్నారు మరి. భగవంతుడు గుడిలోనే కాదు .మన యొక్క  ధర్మ నడవడిలో కూడా ఉంటారు.

6 comments:

  1. నీరు, భూమి, సూర్యుడు, గాలి, వాతావరణం, విత్తనాలు .......... ..ఇలా మనిషి జీవనానికి కావలసిన ఎన్నింటినో దైవం చక్కగా సృష్టించి ఇస్తే , వాటిని సరిగ్గా పంచుకుని జీవించటం కూడా ప్రజలకు చేతకావటం లేదు.
    -------------------
    మనకి రియలిస్టిక్ గ ఆలోచించటం పోయింది.మనలాగే ఈ భూమిపై జన్మించిన అందరికీ వాటిలో భాగముందని మర్చేపోతున్నాము. మన జీవితం పరిమితమని తెలిసి కూడా దొరికినంత లాక్కోటం దాచుకోవటం. ఎప్పుడు దారికి వస్తుందో!

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ( మనకి రియలిస్టిక్ గ ఆలోచించటం పోయింది.మనలాగే ఈ భూమిపై జన్మించిన అందరికీ వాటిలో భాగముందని మర్చేపోతున్నాము. మన జీవితం పరిమితమని తెలిసి కూడా దొరికినంత లాక్కోటం దాచుకోవటం. ఎప్పుడు దారికి వస్తుందో! ).... చక్కగా చెప్పారు.

    ReplyDelete
  3. జంతువులు ప్రకృతి వాటికి అందించిన వనరులను అవసరానికి మించి వాడవు.. కాని మనిషి అలా కాదు, ప్రకృతి లో ఉన్న ప్రతీ వనరూ తనదే అంటాడు. ఈ మనిషి చేస్తున్న చర్యల ద్వారా ప్రకృతి, ఇతర జాతులతో పాటు, తన వినాశనానికి కూడా కరనమవుతున్నాడు... ప్రపంచంలో ఉన్న అతి క్రూరమైన, నిర్దాక్షిన్యమైన జంతువు మనిషే....

    మనిషి, అతని నాగరికత ఉన్నంత వరకు ఆర్ధిక అసమానతలు ఉంటూనే ఉంటాయి.. అది అమెరికా అయిన, సోమాలియా అయిన, ఇండియా అయినా!!

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ( జంతువులు ప్రకృతి వాటికి అందించిన వనరులను అవసరానికి మించి వాడవు.. కాని మనిషి అలా కాదు, ప్రకృతి లో ఉన్న ప్రతీ వనరూ తనదే అంటాడు. ఈ మనిషి చేస్తున్న చర్యల ద్వారా ప్రకృతి, ఇతర జాతులతో పాటు, తన వినాశనానికి కూడా కరనమవుతున్నాడు... ప్రపంచంలో ఉన్న అతి క్రూరమైన, నిర్దాక్షిన్యమైన జంతువు మనిషే....

    మనిషి, అతని నాగరికత ఉన్నంత వరకు ఆర్ధిక అసమానతలు ఉంటూనే ఉంటాయి.. అది అమెరికా అయిన, సోమాలియా అయిన, ఇండియా అయినా!! ).... చక్కగా చెప్పారు.

    మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసానండి. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    ReplyDelete
  5. మీ ఆవేదన పూర్తిగా వాస్తవమండి.భూటాన్ మోడల్ ఆర్ధిక వ్యవస్థ రావాలండి. అక్కడ జాతీయ ఆనంద సూచిక లెక్కిస్తారు.దీని పై నా బ్లాగు లో ఒక వ్యాసం వ్రాసాను.అలాగే మీరు ప్రస్తావించే అంశాల్లో చాలా ఆర్థిక శాస్త్రం ఇమిడి వుంది.ప్రభుత్వాల philosophy లో మార్పు రావాలి.మీరన్నట్లు భూటాన్ లో తక్కువ జీతాలు,తక్కువ రేట్లు ఉంటాయి.అందరు ఆనందం గా జీవిస్తారు.ఇంకా ఇలాంటి వ్యాసాలూ మరిన్ని వ్రాయండి.

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూసానండి. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    మనదేశంలో కూడా భూటాన్ మోడల్ ఆర్ధిక వ్యవస్థ వస్తే బాగుంటుంది.

    ReplyDelete