koodali

Monday, August 27, 2012

ప్రపంచమంతా మాయ అని ఆధునిక విజ్ఞానం ద్వారా కూడా...


* ఉదాహరణకు   రంగుల  విషయం   తీసుకుంటే....

* మానవులకు  సృష్టిలోని  వస్తువులు  కొన్ని   రంగులలో  కనిపిస్తాయి  కదా  !  కానీ  కొన్ని  పశుపక్ష్యాదులకు  మనలాగా   అన్ని   రంగులు  కనిపించవని  శాస్త్రవేత్తలు   అంటున్నారు.

 
* ఉదా...కొన్ని   
పశుపక్ష్యాదులకు  ,  ప్రపంచం  రంగుల్లో  కాకుండా  తెలుపు  నలుపు  రంగుల్లో  మాత్రమే  కనిపిస్తుందట.
 

*  కొన్ని  జీవులకేమో ,   గ్రే,  పసుపు,  ఆకుపచ్చ ,  నీలం    వంటి  కొన్ని  రంగులు మాత్రమే   కనిపిస్తాయట. 

 

* కొన్ని  రకాల   సీతాకోకచిలుకలకు ,       పుష్పాల  యొక్క  అల్ట్రావయొలెట్   వంటి  రంగులు   కూడా    కనిపిస్తాయట.   ఈ  శక్తి 
వాటికి   ఆహారసంపాదనకు  ఉపయోగపడుతుందట.  
 
  ( ఈ  అల్ట్రావైలెట్  రంగులను  మానవుల  కళ్ళు  గుర్తించలేవట. అందుకే   మనకు  ఆ  రంగులు  కనిపించవట.  )


 
* ఇవన్నీ  చూస్తుంటే,    ఇతర లోకాలకు  (గ్రహాలకు)   చెందిన    వారికి  మరెన్నో  క్రొత్త  రంగులు  కనిపించే  అవకాశం కూడా  ఉందని  మనం  భావించవచ్చు.
 

* ఇలా  ప్రపంచం  ఒక్కొక్క  జీవికి  ఒక్కొక్క  విధంగా  కనిపిస్తుంది.

 
*  మరి  ప్రపంచంలో  అసలు  ఎన్ని  రంగులు  ఉన్నాయి  ? అసలు    ఏ  వస్తువు  ఏ  రంగులో  ఉంటుంది  ?  అని  ప్రశ్నించుకుంటే   దానికి  సరైన  సమాధానం  సృష్టికర్తయైన  దైవానికి  మాత్రమే  తెలుస్తుంది.

 

*   కంటికి  కనిపించేదానిలో  ఏది  నిజమో  ? ఏది  భ్రాంతో  ?  ఎవరికీ  తెలుసు?
మన  కళ్ళకు  కనిపించేదంతా   మాయలా  అనిపిస్తుంది.
 

* కొందరు  ఏమంటారంటే,  తాము  కళ్ళతో  చూస్తేనే  ఏదైనా  నిజమని   నమ్ముతాము.  లేకపోతే  నమ్మము  అంటారు. 
 

* ఒక్కో  వస్తువు రంగు   .....ఒక్కో  జీవికి .... ఒక్కో  విధంగా  కనిపిస్తున్నప్పుడు   ఏది  నిజమని ,  ఎవరిది   నిజమని   నమ్మాలి  ? ఇలాంటప్పుడు   హేతువాదం  అంటే    అర్ధం  ఏమిటి  ? 



*   ఏ  జీవికి   ఏ   రంగులు  కనిపిస్తాయి  ? అన్నది  ఇక్కడ   ముఖ్యం  కాదు.  వస్తువుకు  ఏ   రంగు   ఉన్నట్లు ? ఏ   రంగు లేనట్లు ?  అసలు  రంగులు  ఉన్నట్లా  ?  లేక  లేనట్లా ? అంతా  మాయ..అని.
 
................................................
 
* ఒక  సమావేశంలో  మానవులు,  పశుపక్ష్యాదులు,  ఇతరగ్రహ  జీవులు  సమావేశమయ్యారట.  వారి  ఎదురుగా  కొన్ని  పుష్పాలున్నాయి.    ఏ  పుష్పం  ఏ  రంగుదో  చెప్పాలని  ఆ  సమావేశం  యొక్క  ఉద్దేశ్యం.
 

*  కొన్ని 
జీవులేమో ....... అన్ని   పుష్పాలు  తెలుపు,  నలుపు  రంగువే . అన్నాయి.
 
 (  ఆ  జంతువులు    తెలుపు,  నలుపు  తప్ప  వేరే  రంగులను  గుర్తించలేవు  మరి.  )
 

* కొన్ని  జీవులేమో ,..... ఆ   పుష్పాలు   గ్రే ,  పసుపు,  ఆకుపచ్చ,  నీలం  ....  రంగుల్లో  మాత్రమే  ఉన్నాయి.  అన్నాయి.

 (  ఈ  జీవులు   గ్రే,  పసుపు,  ఆకుపచ్చ,  నీలం  ....  తప్ప  వేరే  రంగులను  గుర్తించలేవు  .  )
 

* మానవులేమో  ........పుష్పాలు  ఏడురంగుల్లో  ఉన్నాయి  అన్నారు.
 
(  మానవులకు  ఏడు  రంగులకు  సంబంధించిన  రంగులు  కనిపిస్తాయి . 
)
 

* కొన్ని  సీతాకోకచిలుకలు  ....... అల్ట్రావయొలెట్  రంగు కలిగిన  పుష్పాలు  కూడా  ఉన్నాయి . అన్నాయి.
 
 (  ఈ  సీతాకోకచిలుకలకు  మానవులకు  కూడా  కనపడని  అల్ట్రావయొలెట్  రంగు  కనిపిస్తుంది  మరి.  )
 

*  ఇతర  గ్రహాల  జీవులేమో ...... అనేక    కొత్త  రకం  రంగుల్లో  పువ్వులు  ఉన్నాయి . అన్నారు.
 
 (   ఇతర  గ్రహ  జీవులకు  మనకు  కనిపించని  క్రొత్త  రంగులెన్నో  కనిపించే  అవకాశం  ఉండొచ్చు.  )
 

* అందరి  మధ్య  వాదం  పెరిగింది.  నేను  చెప్పిందే  కరెక్ట్  అంటే  నేను  చెప్పిందే  కరెక్ట్  అని ...... అన్ని  జీవులు  ఘర్షణ  పడటం  మొదలెట్టారు.

 
*  ఎందుకంటే  వారి    దృష్టికి  కనపడేదే  వారు  చెప్పగలుగుతున్నారు.
 

* ఈ  ఒక్క  విషయంలోనే  కాదు . సృష్టికి    సంబంధించిన   అన్ని    రహస్యాల    గురించి ,   సృష్టికర్త  అయిన  దైవానికి   మాత్రమే  సరిగ్గా   తెలుస్తుంది.  మనకు  తెలిసింది  చాలా  తక్కువ.
 

*  అందుకే    పూర్వపు  మహర్షులు  తపస్సు,  ధ్యానం  ద్వారా  దైవాన్ని  మెప్పించి ,  భౌతికదృష్టికి  అందని    విషయాలను  కూడా  తెలుసుకుని ,  లోకహితం  కోసం     ప్రపంచానికి  అందించటం  జరిగింది.. 

 
* హేతువాదానికి,  భౌతికవాదానికి  అందని  విషయాలెన్నో    ఆధ్యాత్మికత  ద్వారా   తెలుసుకోవచ్చని  పెద్దలు  తెలియజేసారు.




10 comments:

  1. జీవరాసులలొ ఒకొక్క జీవికి ఒక్కొరకంగా కొన్ని రంగులు మాత్రమే కనిపిస్తున్నాయంటె అది ప్రకౄతి దర్మం. అంతేగాని యవరొ ఒక వ్యక్తి (దేవుడు) పని కట్టుకుని చేసింది కాదు. ఇలాంటి వాదాలు నాస్తికులకూ, బక్తులకూ, వేల సత్సరాలుగా జరుగుతునే వున్నాయి. సమాజం ఎప్పుడుకుడా అభివౄద్దివైపే పయనిస్తుంది . ఇప్పుడు ఇంత సాంకేతిక ప్రగతి సాధించినాకుడా ఇలాంటి ఇలాంటివాదాలకు భలం ఎందుకు చేకూరుతుంది? ప్రజలలొ అసమానతలు ఒక పక్క బొటా బొటిగా ఏ రొజుకు ఆరొజు వూడిగం చేస్తేగాని జీవించలేని పరిస్తితి మొరొ పక్క వేలకొట్ల ఆస్తిపరులు ఇలాంటి వైరుద్యాలున్న సమాజంలొ సాంకేతికంగా ఎంత ప్రగతిసాదించినా ముడత్వానికి సాగిల పడవలసిందే . బక్తులు తమ వెనకటి అభిప్రాయాలకు తిలొదకాలు ఇచ్చారు. మారిన పరిస్తులకు అనుకూలంగా తమ వాదాలు మార్చుకుంటూ వస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ప్రకృతి అంటే దైవం. మనుషులకే ఇంత ఆలోచనా శక్తి ఉన్నప్పుడు ఇంత సృష్టినీ సృష్టించిన మహాశక్తికి ఎంత గొప్ప ఆలోచనాశక్తి ఉంటుందో కదా !

      మనిషి యొక్క శరీరంలో శ్వాస దానికదే శ్వాసించటం, మనిషి ప్రమేయం లేకుండానే ఆహారం అరిగిపోవటం, ఎన్నో రకాల జీవులు, వాటికి తగ్గ శరీర నిర్మాణం, ఎగిరే పక్షులు, ఈదే చేపలు, గతి తప్పకుండా వచ్చే సూర్యచంద్రులు, పర్వతాలు, ....ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన దైవమే గొప్ప సైంటిస్ట్.

      దైవ సృష్టితో పోల్చుకుంటే మానవులు సాధించిన సాంకేతికత ఏపాటిది ?

      దైవం ప్రసాదించిన గాలిని పీల్చి బ్రతుకుతూ .... దైవ సృష్టి లోని పదార్ధాలతో సాంకేతికతను అభివృధ్ధి చేసుకుని కూడా , కొందరు నాస్తికులు దైవం లేరు అనటం ఎంతో బాధాకరం.

      సాంకేతికత ఇంత అభివృద్ధి చెందటం వెనుక దైవభక్తి గల ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్తలందరూ నాస్తికులు కారండి.



      Delete
  2. I understand your inner spirit of things....yes every layer is to unfurl...but can be understood when right time come

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం.... every layer is to unfurl...but can be understood when right time come

      Delete
  3. జీవరాసులలొ ఒకొక్క జీవికి ఒక్కొరకంగా కొన్ని రంగులు మాత్రమే కనిపిస్తున్నాయంటె అది ప్రకౄతి దర్మం.
    ----------------------------
    @రామమోహన్ గారూ, అవన్నీ జీవరాసుల అవసరాలకోసం ప్రకృతి ద్వారా సృష్టించ బడ్డాయి. నా ఉద్దేశంలో దేముడు, దైవత్వం అంటే అదే.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం. ప్రకృతి అంటే దైవం.

      ప్రకృతిమహాశక్తిని ( దైవాన్ని ) సాకారంగానూ నిరాకారంగానూ కూడా భావించి ఆరాధించుకోవచ్చు.

      Delete


  4. ఆస్తిక,నాస్తిక వాదాలను పక్కనపెడదాము కాస్సేపు.మరొక వింత లేక మాయ ఏమంటే;కాంతి సెకండుకి మూడు లక్షల కిలోమీటర్ల వేగంగా ప్రసరించినా మనం చూస్తున్న కొన్ని నక్షత్రాలు ఎన్నో కాంతి సంవత్సరాల దూరం లో ఉండటం వలన మనం చూస్తున్న ఆ నక్షత్రం ఎంతో కాలం కిందటిదట.ఒకవేళ మనం ఏదో సాధనంతో దానిలో దృస్యాన్ని చూడగలిగితే అది ఎన్నో వేల సంవత్సరాల కిందట జరిగిందన్న మాట.ఇంక రంగులు అంటే, ఆయా వస్తువులు కాంతిచక్రం (spectrum) లోని భాగాలని ఇముడ్చుకోడం ,లేక పైకి వెదజల్లడం అనే శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే వెలుతురు దాని పైన పడకపోతే రంగులే లేవు.అందరికీ physics ద్వారా తెలిసిన సంగతే అనుకోండి.ఐనా ఇది ఒక 'మాయ ' లేక భ్రాంతి ( illusion) అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ( కాంతి సెకండుకి మూడు లక్షల కిలోమీటర్ల వేగంగా ప్రసరించినా మనం చూస్తున్న కొన్ని నక్షత్రాలు ఎన్నో కాంతి సంవత్సరాల దూరం లో ఉండటం వలన మనం చూస్తున్న ఆ నక్షత్రం ఎంతో కాలం కిందటిదట.ఒకవేళ మనం ఏదో సాధనంతో దానిలో దృస్యాన్ని చూడగలిగితే అది ఎన్నో వేల సంవత్సరాల కిందట జరిగిందన్న మాట. )
      ..........................

      ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తున్న కొన్ని నక్షత్రాలు ఇప్పటివి కావు . అన్న విషయం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

      అంటే , ఎంతో కాలం కిందటి నక్షత్రాలను మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము. ఇప్పుడు ఉన్న నక్షత్రాలు , వాటి స్వరూపం కొంతకాలం తరువాతి వాళ్ళకి కనిపిస్తాయి.

      ఒక వస్తువు ( దృశ్యం ) నుంచి వచ్చే కాంతి (దృశ్య ) కిరణాలు ....... ఆ వస్తువు ( దృశ్యం ) మారిపోయిన తరువాత కూడా మాయమైపోకుండా అలా పయనిస్తూనే ఉంటాయి అనుకుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటో అంతా మాయ.

      ......విశ్వం వింతలమయం.

      Delete
  5. andukhe antha maya ye ani antaru peddalu

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం.

      Delete