koodali

Monday, August 6, 2012

ఈ దేశం ఇలా ఎందుకు తయారయింది ?


మనది పేద దేశం కాదు ....సిరి సంపదలు గల ఎంతో గొప్ప  దేశం. కేవలం మన అలక్ష్యం వల్ల ఇలా ఉంది అంతే. మన సిటీల్లో చూశారా .......ఒక పక్కన ఆకాశాన్నంటే ఆకాశహర్మ్యాలు ,ఆ ప్రక్కనే స్లంస్ లో    మురికి గొట్టాలలో అర్ధాకలితో బ్రతుకుతున్న ప్రజలు. ఈ పరిస్తితిని మనం మార్చలేమా....



 అపారమైన   ప్రకృతిసహజ    వనరులు,  అన్ని  కాలాల్లోనూ     చక్కటి   సూర్యరశ్మి  ,  చక్కటి  వాతావరణం,.......   ఇలా  ఎన్నో  ప్రత్యేకతలున్న  దేశం   భారతదేశం.


  ఆధునిక  టెక్నాలజీ    రాకముందే   సిరిసంపదలతో ,   భోగభాగ్యాలతో    అలరారిన   దేశం     భారతదేశం.   అలాంటి  దేశం  ఇప్పుడు    ఇలా      ఎందుకు  ...  ? 

పేదరికం,  అవినీతి  ,  ఆకలితో  అల్లాడే  ఎందరో  ప్రజలు  ,  మత్తులో  ,  విలాసాలలో   జోగుతున్న  వ్యక్తులు...  . ఈ  దేశం  ఇలా  ఎందుకు  తయారయింది  ?  


ఇక్కడ  ఇప్పటికీ  ఎందరో  మేధావులు  ....  మంచి  మనసున్న  వాళ్ళు  ....  దైవభక్తులున్నారు.   వీళ్ళంతా  గట్టిగా   తలుచుకుంటే   పేదరికం  అనేది   ఉండనే  ఉండదు.  మురికవాడలు,  మురికి  వీధులు  కనిపించనే  కనిపించవు.   అధర్మము,  అవినీతి  ఆమడదూరం  పారిపోతాయి.  


 దేశంలో  కొందరు  విశిష్టవ్యక్తుల  గురించి   వింటుంటే   ఎంతో   ఆశ్చర్యంగా    ఉంటుంది.    వ్యవస్థ  చేతులెత్తేసిన  పనులను  కొందరు  వ్యక్తులు  ఒంటరిగా   చేసి  చూపిస్తున్నారు. 


*  ఉదా.....   ఒక  మధ్యతరగతి  వ్యక్తి   ప్రతి  వేసవిలో   రోజూ    కొందరికి  రాగులజావను    ఉచితంగా  అందజేస్తారట.  ఒక  వ్యక్తి   తన  గ్రామంలో   ఎన్నో  అభివృద్ధిపనులను    చేసి  ఆదర్శ  గ్రామంగా  అభివృద్ధి   చేశారట.   కొందరు   ప్రజలు  సమిష్టిగా  పనిచేసి  తమ  ఊరి    సమస్యలన్నీ     పరిష్కరించుకున్నారట. 


*  ఇలా  కొందరు  వ్యక్తులు  తమ  పరిధిలో  కష్టపడి   ఎన్నో  అద్భుతాలను   చేస్తున్నారు.  


*  అధికారం,  డబ్బు   అంతగా  లేని  వ్యక్తులే  ఇలా  చేయగలుగుతున్నప్పుడు  ......అధికారం  ఉన్న  వ్యక్తులు  ,  ప్రజలు  కలిసి   పనిచేస్తే      మరెన్నో  అద్భుతాలను  చెయ్యగలరు.  దేశాన్ని  ప్రపంచానికే  ఆదర్శంగా   మార్చివేయగలరు. 


 కొందరు    వ్యక్తులు  తాము  దైవాన్ని  నమ్ముతాము ....అంటూనే    పాపపు  పనులు  చేస్తున్నారు.     దైవాన్ని  నమ్మే  వ్యక్తులు   పాపపు పనులు    చేస్తూ  దైవాన్ని   పూజిస్తే , వాళ్ళు   దైవానుగ్రహాన్ని  ఎలా  పొందగలరు ? 


రావణాసురుడు  ఎన్నో  పూజలు  చేశాడు.     అయినా  ,  అతడు    తాను   చేసిన  పాపాల  వల్ల    దైవం    చేతిలో  సంహరించబడ్డాడు. 


 కొందరు   ఎంతో  తపస్సు  చేసి  దైవానుగ్రహంతో  వరాలను  పొంది   కూడా   ,  తరువాత   ఎన్నో    పాపాలను  చేస్తారు.     అటువంటప్పుడు  దైవం   ఎటువంటి    మొహమాటం  లేకుండా    అటువంటి  పాపాత్ములను     శిక్షించటం     జరిగింది. 


* ఈ  సంఘటనల  వల్ల  మనం  నేర్చుకోవలసింది  ఏమిటంటే  , .... దైవానుగ్రహం  పొందాలంటే  సత్ప్రవర్తనను   కలిగిఉండాలి  అని.

 మనస్సును  నిగ్రహించటం  కష్టమే  కానీ ,  దైవానుగ్రహం  పొందాలంటే    మాత్రం   పాపాలను  చేయకుండా  మనస్సును  నిగ్రహించుకోవటానికి  ప్రయత్నించాలి.


*  సత్ప్రవర్తనతో  జీవించటం  అనేది    భగవంతునికి    ఇష్టమైన    చక్కటి   పూజ.



16 comments:

  1. సత్ప్రవర్తన గురించి చక్కగా రాశారు, అభినందనలు.
    హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
    ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం.... ఇది చక్కటి సందేశం.

    ReplyDelete
  3. వ్యవస్థ చేతులెత్తేసిన పనులను కొందరు వ్యక్తులు ఒంటరిగా చేసి చూపిస్తున్నారు.
    --------------
    వీరు, బ్రతకటానికి కావాల్సింది గుప్పెడు మెతుకులు, ఉండటానికి చోటు, కట్టుకోటానికి బట్ట ఉంటే చాలు అని (అంతేగానీ స్విస్ యక్కౌంట్ లో డబ్బులు కాదని) గ్రహించిన వారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం. డబ్బంతా దోచి , దాచుకుంటున్న వారి వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతోంది. ( అలా డబ్బును దాచుకున్నవారు సుఖపడేది ఏమీ ఉండదు. )

      ఇప్పుడు సమాజంలో అత్యాశలు బాగా పెరిగిపోయాయి...... వీటన్నిటివల్లా స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా , దేశంలో ఎన్నో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.

      Delete
  4. స్వార్ధం...

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం. నేటి సమాజంలో .. వీలయినంత ఎక్కువగా సంపాదించి , జీవితాన్ని వీలైనంత ఎక్కువగా ఎంజాయ్ చెయ్యాలి . అనే స్వార్ధం విపరీతంగా పెరిగిపోయింది. అందువల్లే వేలు , లక్షలు ఖర్చుపెట్టి విలాసవంతమైన వస్తువులు కొనుక్కుని తమకుతాము ఎంజాయ్ చేస్తున్నారు.

      ( ఎంజాయ్ చేస్తున్నామని భ్రమిస్తున్నారు .... . వాళ్ళల్లో నిజంగా సంతోషంగా ఉన్నామని చెప్పగలిగే వారెవరూ ఉండరు. )

      Delete
  5. స్వార్ధం,వ్యామోహం అన్నిటికీ మించి ఆశ ఇలా తయారవ్వడానికి కారణాలేమో..!!
    మంచి ఆలోచింపజేసే పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం. సమాజంలో స్వార్ధం, వ్యామోహం, ఆశ ..... ఎక్కువైన ఫలితమే సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్న సమస్యలు.

      పూర్వం పెద్దవాళ్ళు .... ఉన్నదానితో తృప్తి చెందాలని, అత్యాశ ఉండకూడదని, పరాయి సొమ్ముకు ఆశ పడకూడదని .... పిల్లలకు చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో అలా చెబుతున్న పెద్దవాళ్ళు చాలా తక్కువమంది.

      Delete
  6. మంచి పోస్ట్...
    ఆలోచింప జేసేదిగా ఉంది.
    అన్నిటికీ మూలం అవినీతి...
    అది లేకుంటే..
    స్వర్ణిమ భారతం అవుతుంది మన దేశం..
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీరు చెప్పింది నిజం. సమాజంలో ఎటు చూసినా , ఎంజాయ్ చేయటమే జీవితలక్ష్యం అన్నట్లుగా మారిపోయిన సంస్కృతి కనిపిస్తోంది...... అందుకు అవసరమైన డబ్బును అవినీతి ద్వారా సంపాదిస్తున్నారు.


      డబ్బును సంపాదించటానికే జీవితం సరిపోతోంది. చిన్నప్పుడు చదువుల పోటీ , పెద్దయ్యాక టార్గెట్ ల పోటీ, ఆ తరువాత పోటీకి సహకరించని శరీరంతో .... ఆరోగ్యం కోసం పోటీ ...ఇలా జీవితం గడిచి పోతోంది.

      Delete
  7. Vote for Congress and gand'h'i family...then this country becomes ....hhee hehehe...

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు దేశంలో ఉన్న వర్గాలు రెండేనండి.
      1. ధనికులు. 2. పేదలు.

      Delete
  8. ఈ మధ్య జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ వంటి సంఘటనల గురించి వింటుంటే .......జీవితం అంటే ఏమిటో అర్ధం కాని పరిస్థితి.

    ReplyDelete
  9. ఆలోచనాత్మక వ్యాసం.బాగా వ్రాసారు.

    ReplyDelete
  10. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete