koodali

Monday, September 26, 2011

ప్రక్కవారు అత్యంత ఆత్మీయుల్లా అనిపించినా, ఆగర్భ శత్రువుల్లా అనిపించినా కారణం ఏమిటో ?

*ధ్రువ ప్రాంతంలో ఒంటరిగా చిక్కుకుని ఉన్న మనిషికి మరో మనిషి కనిపిస్తే ప్రాణం లేచొస్తుంది. ఆ మనిషి ఏ దేశస్తుడు అని ఆలోచన రాదు.

విదేశాల్లో ఉన్నప్పుడు మన దేశం వ్యక్తి కనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తుంది. వారు ఏ రాష్ట్రం వారు అయినా సరే.

ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్నప్పుడు మన రాష్ట్రం వారు కనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తుంది. వారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే.

ఇతర జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లా, మన ఊరు వారు , మన బంధువులు కనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తుంది.

ఇది ఇలా ఉంటే .. దీనికి వ్యతిరేకంగా ... ఒకోసారి ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితీ ఉండవచ్చు.

ప్రక్కవారు అత్యంత ఆత్మీయుల్లా అనిపించినా, ఆగర్భ శత్రువుల్లా అనిపించినా కారణం ఏమిటో ?

* అలా అనిపించటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

అందులో ఒకటి ,ఆత్మీయతల కన్నా ఆర్ధిక సంబంధాలకే ఈ రోజుల్లో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా !

కొందరు అంటుంటారు. ప్రపంచం చిన్నదిగా కుగ్రామంలా అయిపోయిందండి. అందరం ఒకటే అని.

నిజమే , కానీ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య జనాలు గొడవలు పడుతూనే ఉన్నారు.

* ఆధునిక రవాణా సదుపాయాల వల్ల ప్రపంచం కుగ్రామంలా దగ్గరగా అయిన మాట నిజమే.

* కానీ, మనుష్యుల మనస్సుల్లో ఆ దగ్గరితనం ఉందా అని ?

రాష్ట్రంలో ఉద్యమాలు స్ఫూర్తిదాయకంగా సాగుతున్నాయి.

ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఉద్యమాలు వస్తే ?

* ఉదా... ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఆంధ్ర, మన్యసీమ,

* ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, ఉత్తరాంధ్ర.....వగైరాలు.

ఇలా రావని గ్యారంటీ ఏమీ లేదు కదా !.

* ఎవరు ఎంతకాలం కలిసుంటారో ? ఎప్పుడు విడిపోతారో ?

* ఎవరు స్థానికులో ? ఎవరు వలసవాదులో ? ఇవన్నీ జవాబులు దొరకని ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి.,

* వీటన్నిటి మధ్యన దిక్కుతోచని సామాన్యుల జీవితాలు.

ఈ సమస్యలు లేకపోయినా కూడా పేదరికం గురించి , సామాన్య ప్రజల సమస్యల గురించిన పనులు నత్త నడకగా సాగుతుంటాయి. ఇక ఇప్పుడు చెప్పేదేముంది.

ఇదంతా కళ్ళప్పగించి చూడ్డం మినహా సామాన్యులు చేయగలిగిందేమీ కనిపించటం లేదు.

* ఇంట్లో పిల్లలు వాళ్ళలో వాళ్ళు తిట్టుకుని గొడవలు పడుతుంటే వారి పెద్దవాళ్ళకు చాలా బాధగా ఉంటుంది కదా !.

* ఎప్పటికైనా అన్నిటికి దైవమే దిక్కు.


8 comments:

  1. మీరు గతంలో నేను రాసిన కామెంట్లు ఎందుకో వేయలేదు. అయినా ధైర్యం చేసి మళ్ళీ రాస్తున్నా.

    నేను దేశంలోనూ విదేశాలలోనూ ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను, ఉన్నాను. నాకెక్కడా నేను వేరే ప్రాంతం వాడినని అనిపించలేదు. "నా" ప్రాంతం వారు కనిపిస్తే సంతోషమే కాని, ఆత్మీయత అనిపించలేదు.

    దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు శాశ్వతం కావు. ప్రజాభిష్టాన్నిబట్టి సరిహద్దులు మారుతూ ఉంటాయి. కొత్త రాష్ట్రాలను (మన్యసీమతో సహా, అలాంటిది ఎప్పుడయినా వస్తే) స్వాగతిస్తేనే అందరికీ శ్రేయస్కరం. ప్రజల బలమయిన కోరికను మన చిన్ని చిన్ని స్వార్తాలతో అడ్డుకోవడం సబబు కాదు.

    ReplyDelete
  2. పని వత్తిడి వల్ల మీ కామెంట్ ను వెంటనే చూడలేదండి. ఆలస్యంగా రిప్లై వ్రాస్తున్నందుకు క్షమించండి.

    " మీరు గతంలో నేను రాసిన కామెంట్లు ఎందుకో వేయలేదు." అన్నారు.

    మీరు పొరబడుతున్నారు. ఎవరైనా వ్యాఖ్యానిస్తే వెయ్యకపోవటం అనే సదుపాయాన్ని నేను ఇప్పటివరకూ ఉపయోగించలేదు.

    " నేను దేశంలోనూ విదేశాలలోనూ ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను, ఉన్నాను. నాకెక్కడా నేను వేరే ప్రాంతం వాడినని అనిపించలేదు." అన్నారు.

    అలా అనిపించే పరిస్థితి ఇప్పటివరకూ మీకు రాకపోవటం మీ అదృష్టం.
    కొందరు దురదృష్టవంతులకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి లెండి..

    " దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు శాశ్వతం కావు. ప్రజాభిష్టాన్నిబట్టి సరిహద్దులు మారుతూ ఉంటాయి. కొత్త రాష్ట్రాలను (మన్యసీమతో సహా, అలాంటిది ఎప్పుడయినా వస్తే) స్వాగతిస్తేనే అందరికీ శ్రేయస్కరం. ప్రజల బలమయిన కోరికను మన చిన్ని చిన్ని స్వార్తాలతో అడ్డుకోవడం సబబు కాదు." అన్నారు.

    కొత్త రాష్ట్రాలు సంగతి అంటే ,ఈ విషయంలో ఏది మంచి, ఏది చెడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

    ReplyDelete
  3. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాల గురించి నా అభిప్రాయాలు ఎక్కువగా చెప్పకపోవటానికి కారణాలున్నాయి.

    అందులో ఒక కారణం,
    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఆత్మీయులు ఉన్నప్పుడు ఎలా చెప్పినా ఎవరోఒకరు బాధపడే పరిస్థితి . అలా ఎవరైనా బాధపడటం నాకు ఇష్టంలేదండి.

    ఇదంతా చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇదంతా కొందరికి ఎగతాళిగా ఉంటుంది. ఈ ఇబ్బంది అర్ధం కావాలంటే అలా ఎగతాళి చేసేవారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడే ఈ బాధ తెలుస్తుంది అని అనటం బాగుంటుందో ,బాగోదో ?

    ఇక మీరు అన్నారు. " దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు శాశ్వతం కావు. " అన్నారు.

    మనిషి జీవితంలో చాలా విషయాలు శాశ్వతం కాదు. మరి ఇంతోటి శాశ్వతం కాని విషయాల కోసం జనాలు ఇంతలా గొడవలు పడటం ఎందుకో అర్ధం కావటం లేదు......

    ReplyDelete
  4. anrd గారూ,

    "అసలు స్థానికత అంటే ఏమిటో నాకు తెలియటం లేదు" అనే టపాలో నేను రెండు పొడుగాటి వాఖ్యలు రాసాను కానీ ఎందుకో అవి ప్రచురితం కాలేదు. బహుశా అంతర్జాలంలో submit చేయడంలో ఏదో సమస్య వచ్చిందేమోలెండి.

    నాకు ఏ ప్రాంతంలోనూ పరాయి వాడినని అనిపించకపోవడం అదృష్టం వల్ల కాదు, నేను అక్కడి వాతావరణంలో ఇమడగలగడం కారణమని అనుకుంటున్నాను.

    ఒక సమస్య మీద మన అవగాహనను, అభిప్రాయాన్ని చెప్పడం వల్ల ఎవరో బాధ పడతారని ఆగిపోవడం సబబు కాదు. అలాగే ఎవరి అభిప్రాయమయినా వారి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కాని వారు ఉండే ప్రాంతం మీద కాదు. ఆంధ్ర ప్రాంతం వారెందరో తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థిస్తున్నారు కదా.

    ఈ గొడవలు డిసెంబర్ 10 తరువాత బాగా పెరిగాయి. అంతకుముందు తెలంగాణా డిమాండును చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు.

    ReplyDelete
  5. " నాకు ఏ ప్రాంతంలోనూ పరాయి వాడినని అనిపించకపోవడం అదృష్టం వల్ల కాదు, నేను అక్కడి వాతావరణంలో ఇమడగలగడం కారణమని అనుకుంటున్నాను."

    నేనయితే మీ అదృష్టం వల్లే అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమంది ఎంత మంచిగా ఉన్నా అవతలివారు వారిని పరాయిప్రాంతం వారిగానే చూస్తారు .

    "ఒక సమస్య మీద మన అవగాహనను, అభిప్రాయాన్ని చెప్పడం వల్ల ఎవరో బాధ పడతారని ఆగిపోవడం సబబు కాదు. అలాగే ఎవరి అభిప్రాయమయినా వారి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కాని వారు ఉండే ప్రాంతం మీద కాదు. ఆంధ్ర ప్రాంతం వారెందరో తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థిస్తున్నారు కదా. "

    నేను మాత్రం నా అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఇతరులు బాధపడతారేమోనని ఆలోచిస్తానండి. కొన్ని సార్లు నేను సహనం కోల్పోయి ఇతరులను నా మాటలతో బాధపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారిని అలా అన్నందుకు తరువాత చాలా బాధపడ్డాను కూడా...

    ReplyDelete
  6. మంచిగా సరిపోదేమండీ, ఇమడిపోవాలేమే ఆలోచించండి. ఉదాహరణకు నేను బెజవాడ టీకొట్టుకెళ్ళి నా తెలంగాణా భాషలోనో, ఉర్డులోనో ఇరానీ చాయ్ ఆర్డర్ చేస్తే నన్ను చూసి వాళ్ళు నవ్వుకుంటారు కదా. నేను అదే రకంగా అస్తమానం ప్రవర్తించినా, నా లాంటి వాళ్ళు పరాక్కుగా కోపంగా మారే అవకాశం ఉంది.

    మీరింకో టపా రాసారు కాబట్టి ఇంతటితో ఈ విషయం వదిలేసి మళ్ళీ కలుద్దాం. All the best.

    ReplyDelete
  7. "నేను అదే రకంగా అస్తమానం ప్రవర్తించినా, నా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చేరినా పరాక్కు కోపంగా మారే అవకాశం ఉంది"

    Sorry for the typo.

    ReplyDelete
  8. " మంచిగా సరిపోదేమండీ, ఇమడిపోవాలేమే ఆలోచించండి. ఉదాహరణకు నేను బెజవాడ టీకొట్టుకెళ్ళి నా తెలంగాణా భాషలోనో, ఉర్డులోనో ఇరానీ చాయ్ ఆర్డర్ చేస్తే నన్ను చూసి వాళ్ళు నవ్వుకుంటారు కదా. నేను అదే రకంగా అస్తమానం ప్రవర్తించినా, నా లాంటి వాళ్ళు పరాక్కుగా కోపంగా మారే అవకాశం ఉంది." అన్నారు కదా !

    తెలంగాణా భాషలోనో, ఉర్డులోనో ఇరానీ చాయ్ ఆర్డర్ చేస్తే ఎందుకు నవ్వుకోవటం ?అలా ఏమీ నవ్వరండి.

    మేము రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల లోనూ నివసించాము.

    బెజవాడ చుట్టుపక్కల వ్యాపారరీత్యా వచ్చిన ఇతరరాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు.

    వాళ్ళకి తెలుగు రాకపోతే , అక్కడి స్థానికులు వారిని చూసి నవ్వరు.

    ఇంకా, అక్కడి స్థానికులు తమకు హిందీ, ఇంగ్లీష్ అంత బాగా రాకపోయినా కూడా అలా వచ్చీరాని హిందీ, ఇంగ్లీష్ లోనే వారితో మాట్లాడటానికి ప్రయత్నించటం నాకు తెలుసు.

    నాకు కూడా హిందీ, ఇంగ్లీష్ అంత బాగా రావు. అందుకే ఇతరులతో తెలుగులో మాట్లాడతాను.

    ఈ విషయం ఎప్పటినుంచో టపాలో రాయాలనుకుంటున్నానండి...

    వైజాగ్ లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు తెలుగు రాకపోతే వైజాగ్ లోని స్థానికులు వారిని చూసి నవ్వరండి.

    వారు తెలుగు నేర్చుకోవటం కన్నా అక్కడి స్థానికులు వారితో హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడటమే ఎక్కువగా కనిపిస్తుంది..

    అలాగే తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాలలోనూ ఉన్నారు. భారతీయులు చాలామంది విదేశాల్లోనూ ఉంటున్నారు.


    అయితే, ఇప్పుడు రాష్ట్రంలో మారిన పరిస్థితుల వల్ల మీరు అన్నట్లు ఎవరైనా నవ్వారేమో నాకు తెలియదండి.

    ఏమైనా ప్రజల మధ్య ఇంతలా అపార్ధాలు రావటం అత్యంత దురదృష్టం....

    "మీరింకో టపా రాసారు కాబట్టి ఇంతటితో ఈ విషయం వదిలేసి మళ్ళీ కలుద్దాం." అన్నారు కదా ! All the best..

    ReplyDelete